India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బిల్ పేమెంట్స్‌లో సేఫ్టీ కోసం భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌తోనే చెల్లింపులు జరగాలని RBI గతంలో మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఈ సిస్టమ్‌ను బిల్లర్లు యాక్టివేట్ చేసుకోవాలి. HDFC, ICICI, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు దీనిని యాక్టివేట్ చేసుకోలేదు. ఫలితంగా ఫోన్‌పే, క్రెడ్, పేటీఎం వంటి థర్డ్‌పార్టీ యాప్స్ బిల్లులు ప్రాసెస్ చేయలేవు. ఫలితంగా క్రెడిట్ కార్డులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు వీలు పడదు.
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు మరో ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా తొలి రెండు టీ20లకు భారత <<13502519>>జట్టు<<>>తో చేరుతారని పేర్కొంది. సంజూ, దూబే, జైస్వాల్ స్థానంలో ఈ ముగ్గురు అందుబాటులో ఉంటారని తెలిపింది. టీ20WC గెలిచిన జట్టులో దూబే, జైస్వాల్, సంజూ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోచ్ లక్ష్మణ్‌తో పాటు కొందరు ఆటగాళ్లు జింబాబ్వేకు బయలుదేరారు.
భారత్-శ్రీలంక ఆతిథ్యంలో 2026 T20 వరల్డ్ కప్ జరుగుతుందని ICC ప్రకటించింది. 20 జట్లతో గ్రూప్, సూపర్ 8, నాకౌట్ ఫార్మాట్‌లో టోర్నీ ఉండనుంది. ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక, 2024 టోర్నీ రన్నరప్ హోదాలో సౌతాఫ్రికాతో పాటు అఫ్గాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్, US, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, పాక్, నేరుగా క్వాలిఫై అయ్యాయి. మరో 8 జట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్ టోర్నీలు జరగనున్నాయి.
TG: ఏపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానించారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులను ఆమె ఆహ్వానించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘కల్కి’ నార్త్ అమెరికాలోనూ దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్‌ను దాటేసినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. దీంతో అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచినట్లు వెల్లడించారు. ఇండియాలోనూ రూ.600 కోట్లను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.
TG: ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో రైతు ప్రభాకర్ <<13549226>>సూసైడ్<<>> ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొలం పంచాయతీల కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. గ్రామాల్లో పొలం పంచాయతీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అవసరమని, అది లేకపోవడం వల్లే ఎన్నికల్లో YCP ఓడిపోయిందని CPI నారాయణ అన్నారు. BJPతో ఉంటే ఉన్నామని, లేకపోతే లేమని జగన్ స్పష్టంగా చెప్పలేకపోయారని, న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడంతో నష్టపోయారని పేర్కొన్నారు. అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టి ప్రతిపక్ష హోదా ఉంటుందని, ఓట్ల శాతం ఆధారంగా కాదని తెలిపారు. రాష్ట్రాన్ని డెవలప్ చేయకపోవడం వల్లే YCP 11 స్థానాలకు పరిమితమైందని వ్యాఖ్యానించారు.
శేఖర్ కమ్ముల, ధనుశ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కుబేర’. ఈ మూవీ నుంచి ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు ఎగ్జైటింగ్ న్యూస్ రానున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
AP: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని విభజించడంతో ఏపీ నష్టపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అది డిమాండ్ కాదు.. రాష్ట్ర ప్రజల హక్కు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న TDP-BJPలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను నెరవేర్చాలి’ అని కోరారు.
ఈ T20WCలో బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఏకంగా 44 మెయిడిన్లు వేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. 2012లో అత్యధికంగా 21 మెయిడిన్లు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య డబుల్ దాటిపోయింది. కివీస్ ప్లేయర్ ఫెర్గూసన్ పపువా న్యూగినియాపై 4 ఓవర్లూ మెయిడిన్ వేసి చరిత్ర సృష్టించారు. బుమ్రా, హార్దిక్ చెరో 2 మెయిడిన్లు వేశారు. 2007లో 15, 2009లో 5, 2010లో 11, 2014లో 13, 2016లో 9, 2021లో 17, 2022లో 17 మెయిడిన్లు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.