India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెన్షన్ పంపిణీ, పెంపు విషయంలో YS జగన్‌కి చంద్రబాబు ఎప్పటికీ సాటిరారని టీడీపీకి వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మాటలు నేర్చిన కుక్క.. ఉస్కో అంటే డిస్కో అన్నదట. అలా ఉంది TDP తీరు. గడప వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది YS జగనే. ఇది ఒప్పుకునే ధైర్యం లేకనే ఫేక్ అంటూ తప్పించుకుంటున్నావ్!’ అని ట్వీట్‌లో పేర్కొంది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ లోక్‌సభలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నారు. నిన్న సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఎన్డీఏ పార్టీ ఎంపీలతో మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు ఆయన వివరించారు.
ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘ఏఐ జనరేటెడ్ ఇమేజెస్’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు మొదట తమ ఫొటోను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘మెటా ఏఐ’ చాట్‌లో ‘imagine me’ అని టైప్ చేస్తే మీ ఏఐ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇది ఇతర చాట్‌లలో కావాలంటే “@Meta AI imagine me” అని టైప్ చేస్తే సరిపోతుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
AP: కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్‌ను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ-జనసేన కౌంటర్ ఇస్తున్నాయి. ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను జగన్ తీశారని దుయ్యబట్టాయి. ఈ బ్రాండ్‌లు అన్నీ వైసీపీ తెచ్చినవే అని పేర్కొంటున్నాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మొదటి మూవీ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలోనే వీరి కాంబో అనౌన్స్‌మెంట్ ఉంటుందట. తండ్రి వరుస హిట్‌లతో దూసుకుపోతుండగా కుమారుడి ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ టారిఫ్‌లను సగటున 10%-25% పెంచాయి. అంటే వినియోగదారుడు నెలకు సగటున రూ.50 అదనంగా భరించాల్సి వస్తుంది. జియో, వొడాఫోన్ ఐడియాలు వాయిస్ ఓన్లీ ప్లాన్ల టారిఫ్‌లను మార్చలేదు. ఎయిర్‌టెల్ మాత్రం పెంచింది. దీనివల్ల ఎయిర్‌టెల్ యూజర్లు కాస్త ఎక్కువగా ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. ఒక విడత అదనపు ఛార్జీ తగ్గాలంటే ఈరోజే రీఛార్జ్ చేసుకోండి. ఈ పెంపు జులై 3 నుంచి అమలవుతుంది.
TGSRTCలో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. డ్రైవర్-2,000, శ్రామిక్- 743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)-114, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)-84, DM/ATM/మెకానికల్ ఇంజినీర్-40, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)-23, మెడికల్ ఆఫీసర్-14, సెక్షన్ ఆఫీసర్(సివిల్)-11, అకౌంట్స్ ఆఫీసర్-6, మెడికల్ ఆఫీసర్(జనరల్, స్పెషలిస్ట్)-14 ఉద్యోగాలున్నాయి.
హిండెన్‌బర్గ్‌తో K-ఇండియా ఆపర్‌ట్యూనిటీస్ అనే సంస్థ కుమ్మక్కై షార్ట్ సెల్లింగ్‌కు పాల్పడిందని సెబీ అనుమానిస్తోంది. ‘హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు (JAN 24, 2023) ముందే K-ఇండియా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి అదానీ షేర్లు విక్రయించింది. రిపోర్ట్ తర్వాత విలువ తగ్గడంతో మళ్లీ కొనుగోలు చేసింది. దీంతో ₹183.24కోట్లు లబ్ధిపొందింది’ అని పేర్కొంది. కాగా ఆ K-ఇండియా కోటక్ గ్రూప్‌కు <<13549816>>KMIL<<>> అని హిండెన్‌బర్గ్ చెబుతోంది.
అయోధ్య రామాలయంలోని పూజారుల డ్రెస్ కోడ్‌లో తీర్థ క్షేత్ర ట్రస్ట్ మార్పులు తీసుకొచ్చింది. ఇకపై పూజారులు తప్పనిసరిగా పసుపు రంగు తలపాగా, కుర్తా, ధోతీలను ధరించాలని తెలిపింది. గతంలో కొందరు కాషాయ రంగు, పసుపు రంగు దుస్తులు ధరించేవారు. వారిలో సారూప్యం తీసుకొచ్చేందుకు ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, గర్భాలయం లోపలికి పూజారులు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకెళ్లడాన్ని నిషేధించింది.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామాలకు రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ భవన్‌లో మీడియాకు తెలిపారు. స్థానిక సంస్థల పాలకవర్గాలకు కాలం చెల్లినా ప్రభుత్వం ఎన్నికల ఆలోచన చేయట్లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.