India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శేఖర్ కమ్ముల, ధనుశ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కుబేర’. ఈ మూవీ నుంచి ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు ఎగ్జైటింగ్ న్యూస్ రానున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
AP: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని విభజించడంతో ఏపీ నష్టపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అది డిమాండ్ కాదు.. రాష్ట్ర ప్రజల హక్కు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న TDP-BJPలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను నెరవేర్చాలి’ అని కోరారు.
ఈ T20WCలో బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఏకంగా 44 మెయిడిన్లు వేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. 2012లో అత్యధికంగా 21 మెయిడిన్లు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య డబుల్ దాటిపోయింది. కివీస్ ప్లేయర్ ఫెర్గూసన్ పపువా న్యూగినియాపై 4 ఓవర్లూ మెయిడిన్ వేసి చరిత్ర సృష్టించారు. బుమ్రా, హార్దిక్ చెరో 2 మెయిడిన్లు వేశారు. 2007లో 15, 2009లో 5, 2010లో 11, 2014లో 13, 2016లో 9, 2021లో 17, 2022లో 17 మెయిడిన్లు నమోదయ్యాయి.
పెన్షన్ పంపిణీ, పెంపు విషయంలో YS జగన్‌కి చంద్రబాబు ఎప్పటికీ సాటిరారని టీడీపీకి వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మాటలు నేర్చిన కుక్క.. ఉస్కో అంటే డిస్కో అన్నదట. అలా ఉంది TDP తీరు. గడప వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది YS జగనే. ఇది ఒప్పుకునే ధైర్యం లేకనే ఫేక్ అంటూ తప్పించుకుంటున్నావ్!’ అని ట్వీట్‌లో పేర్కొంది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ లోక్‌సభలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నారు. నిన్న సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఎన్డీఏ పార్టీ ఎంపీలతో మోదీ సమావేశమైన సంగతి తెలిసిందే. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు ఆయన వివరించారు.
ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘ఏఐ జనరేటెడ్ ఇమేజెస్’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్లు మొదట తమ ఫొటోను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘మెటా ఏఐ’ చాట్‌లో ‘imagine me’ అని టైప్ చేస్తే మీ ఏఐ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇది ఇతర చాట్‌లలో కావాలంటే “@Meta AI imagine me” అని టైప్ చేస్తే సరిపోతుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
AP: కూటమి ప్రభుత్వం పవర్ స్టార్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని వైసీపీ విమర్శించింది. నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను మెప్పించేలా ఈ బ్రాండ్‌ను తెచ్చిందని ఆరోపించింది. దీనికి టీడీపీ-జనసేన కౌంటర్ ఇస్తున్నాయి. ఐదేళ్లలో ప్రమాదకరమైన మద్యంతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను జగన్ తీశారని దుయ్యబట్టాయి. ఈ బ్రాండ్‌లు అన్నీ వైసీపీ తెచ్చినవే అని పేర్కొంటున్నాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మొదటి మూవీ ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలోనే వీరి కాంబో అనౌన్స్‌మెంట్ ఉంటుందట. తండ్రి వరుస హిట్‌లతో దూసుకుపోతుండగా కుమారుడి ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ టారిఫ్‌లను సగటున 10%-25% పెంచాయి. అంటే వినియోగదారుడు నెలకు సగటున రూ.50 అదనంగా భరించాల్సి వస్తుంది. జియో, వొడాఫోన్ ఐడియాలు వాయిస్ ఓన్లీ ప్లాన్ల టారిఫ్‌లను మార్చలేదు. ఎయిర్‌టెల్ మాత్రం పెంచింది. దీనివల్ల ఎయిర్‌టెల్ యూజర్లు కాస్త ఎక్కువగా ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. ఒక విడత అదనపు ఛార్జీ తగ్గాలంటే ఈరోజే రీఛార్జ్ చేసుకోండి. ఈ పెంపు జులై 3 నుంచి అమలవుతుంది.
TGSRTCలో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. డ్రైవర్-2,000, శ్రామిక్- 743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)-114, డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)-84, DM/ATM/మెకానికల్ ఇంజినీర్-40, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)-23, మెడికల్ ఆఫీసర్-14, సెక్షన్ ఆఫీసర్(సివిల్)-11, అకౌంట్స్ ఆఫీసర్-6, మెడికల్ ఆఫీసర్(జనరల్, స్పెషలిస్ట్)-14 ఉద్యోగాలున్నాయి.
Sorry, no posts matched your criteria.