India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని, ఈ బదిలీల అంశంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదల్చుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌ను ఉపాధ్యాయ సంఘాలు కలిశాయి. ఎన్నికల కోడ్‌తో నిలిచిన బదిలీ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయనను కోరాయి.
జూన్‌లో బడి గంట మోగితే పేరెంట్స్ గుండె చప్పుడు మే నుంచే ఎక్కువ మోగుతుంది. డొనేషన్, అడ్మిషన్, ట్యూషన్ పేర్లతో పిండే ఫీజులకు యునిఫాం, స్టేషనరీ, ట్రాన్స్‌పోర్టు పోటులు అదనం. వీటి నుంచి కోలుకునేలోపు టర్మ్, యాక్టివిటీ, ఎగ్జామ్స్ ఫీజు రిమైండర్లు మైండ్‌ను వదలవు. ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకమే ఉంటే ఇలా జరగదు కదా. ఆ టీచర్లే వారి పిల్లల్ని బయట చదివిస్తే భరోసా వచ్చేదెలా? ఈ భారాలు తగ్గేదెలా?
AP: కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ నిర్వహిస్తున్నారు. తొలుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు కార్యకలాపాలపై సమీక్షిస్తున్నారు. అనంతరం శాఖల వారీగా జిల్లాలో స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం నానాజీ, చినరాజప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీమ్ ఇండియా కోచ్‌గా రిటైరైన రాహుల్ ద్రవిడ్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించారు. టెస్టుల్లోనూ భారత్‌ను ఛాంపియన్‌గా నిలపాలని సూచించారు. ‘తెల్ల బంతితో ఆ మూడూ సాధించాం. ఇక ఎరుపే ఉంది. అది కూడా సాధించండి’ అని కోహ్లీకి చెప్పారు. కాగా T20WC, వన్డే WC, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్‌కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలవాలన్న ఆకాంక్ష నెరవేరలేదు. 2021, 2023 WTC ఫైనల్స్‌లో ఓడింది.
ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ‘ఈ ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదే. మతతత్వ రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయాయి. బీజేపీ 400 సీట్ల అజెండా ఫెయిలైంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు. అందుకే పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈవీఎంల మీద మాకు ఇప్పటికీ నమ్మకం లేదు. వాటిని తొలగించే దాకా మా పోరాటం ఆగదు’ అని లోక్‌సభలో వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించేలా రూ.249 ప్లాన్‌ను పరిచయం చేస్తోంది. 45 రోజుల కాలవ్యవధితో అన్‌లిమిలిటెడ్ కాల్స్, రోజుకి 2GB డేటా, 100 ఫ్రీ SMSలు ఈ ప్యాక్‌లో అందిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలు ఇదే ధరకు 1GB డేటానే ఇస్తుండగా వ్యాలిడిటీ 28 రోజులే ఉంటుండటం గమనార్హం. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ తమ టారిఫ్‌లను భారీగా పెంచిన వేళ వినియోగదారులకు ఇది పెద్ద ఊరటనే చెప్పొచ్చు.
అదానీ గ్రూప్‌పై రిపోర్టుకు సంబంధించి సెబీ <<13549559>>నోటీసులపై<<>> స్పందిస్తూ హిండెన్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నోటీసుల్లో కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (KMIL) పేరును ఎందుకు దాచారని ప్రశ్నించింది. ‘KMILను సెబీ K-India Oppurtunities ఫండ్‌గా పేర్కొంది. మాపై చర్యలకు సిద్ధమైన సెబీ భారతీయ సంస్థ అయిన కోటక్‌కు దీంతో సంబంధం ఉందని గుర్తించలేదంటే అనుమానంగా ఉంది’ అని పేర్కొంది.
అరకులో కాఫీ పండిస్తున్న గిరిజన రైతులకు మద్దతిస్తున్నందుకు PM <<13539131>>మోదీ<<>>, ఏపీ సీఎం CBNకు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కాఫీకి గుర్తింపు ఉందని, ప్యారిస్‌లో రెండో కేఫ్‌ను ప్రారంభించనున్నట్లు Xలో తెలిపారు. దీనిని AP CM చంద్రబాబు స్పందిస్తూ అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయగాథలు AP నుంచి రావాలని CBN ఆకాంక్షించారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ రూ.25 లక్షలు తీసుకున్నట్లు నవీ ముంబై పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. సల్మాన్‌ను చంపేందుకు పాకిస్థాన్ నుంచి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కాంట్రాక్ట్ ఎవరిచ్చారో తెలియాల్సి ఉంది.
HYDలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అమరావతిలో AP మంత్రి నారా లోకేశ్‌కు పలువురు AP క్యాబ్ డ్రైవర్లు విన్నవించుకున్నారు. ఉమ్మడి రాజధానిగా HYD కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలకు TG ప్రభుత్వం మళ్లీ లైఫ్ ట్యాక్స్ అడుగుతోందని వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి APలో ట్యాక్స్ కట్టిన తమకు మళ్లీ కట్టడం ఆర్థికంగా తీవ్ర భారమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న జరిగే చంద్రబాబు-రేవంత్ భేటీలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.