news

News July 2, 2024

పుణేలో ‘జికా’ కలకలం.. ఇద్దరు ప్రెగ్నెంట్లకు పాజిటివ్

image

మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ విజృంభిస్తోంది. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టే బిడ్డల్లో మెదడు అభివృద్ధి చెందదు. జికా వైరస్‌ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

News July 2, 2024

కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)

image

YS జగన్ కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు. అందులో వైట్ అండ్ బ్లాక్ కుర్తా పైజామా‌తో మాజీ సీఎం కనిపించారు. గతంలో ఈ తరహా లుక్‌లో జగన్‌ను ఎప్పుడూ చూడలేదని YCP శ్రేణులు అంటున్నాయి. దీంతో జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియాలో ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నాయి.

News July 2, 2024

రాహుల్ గాంధీ ప్రసంగంపై అభ్యంతరాలు.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు

image

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో కేంద్రంపై రాహుల్ గాంధీ చేసి <<13546466>>విమర్శలపై<<>> బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా చర్యలు తీసుకున్నారు. హిందూ మతం, బీజేపీ, RSS, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై విపక్ష నేత చేసిన వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. కాగా నిన్న దాదాపు 100 నిమిషాలపాటు రాహుల్ ప్రసంగించిన విషయం తెలిసిందే.

News July 2, 2024

హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసులు

image

గతఏడాది అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ కుట్రపూరితంగానే రిపోర్ట్ రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెబీ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘అదానీ FPO లాంచ్ అయ్యే టైమ్‌లోనే ఈ రిపోర్ట్ వచ్చింది. దీనికి ముందు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో షార్ట్ సెల్లింగ్ (ముందు షేర్లు విక్రయించి ఆ తర్వాత వాటి విలువ తగ్గాక మళ్లీ కొనడం) జరిగింది. రిపోర్ట్ తర్వాత AEL షేర్ల విలువ 59% పడిపోయింది’ అని పేర్కొంది.

News July 2, 2024

అందుకే పిచ్‌పై మట్టి తిన్నా: రోహిత్

image

T20WC గెలిచిన అనంతరం బార్బడోస్ పిచ్‌‌ మీద <<13536415>>మట్టి <<>>తినడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్‌శర్మ వెల్లడించారు. ‘ఆ పిచ్‌పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నా’ అని రోహిత్ తెలిపారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో SAపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.

News July 2, 2024

₹8,300 కోట్ల స్కామ్.. ఇండో-అమెరికన్‌కు జైలు శిక్ష

image

ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త, ఔట్‌కమ్ హెల్త్ కోఫౌండర్ రిషి షాకు US కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ₹8,300 కోట్ల కుంభకోణం కేసులో న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు. అతిపెద్ద కార్పొరేట్ మోసం కేసుల్లో ఇదొకటని పేర్కొన్నారు. కంపెనీ లాభాల్లో ఉందని చెప్పి రిషి టాప్ ఇన్వెస్టర్లు గోల్డ్‌మన్ సాచ్, అల్ఫాబెట్‌లను మోసం చేశారు. యాడ్ల కోసం డబ్బులు తీసుకుని పలు కంపెనీలను బురిడీ కొట్టించారు.

News July 2, 2024

ఫోన్‌పే, గూగుల్‌పే, PAYTMలో కరెంట్ బిల్లు కట్టలేరు

image

AP: ఈ 3 యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు <<13544824>>చెల్లించే <<>>సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు ద్వారా బిల్లుల చెల్లింపులను ఆ యాప్‌లు నిలిపివేశాయి. ఇకపై ఆయా డిస్కంల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను వినియోగించి బిల్లులు కట్టాలి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు సెంట్రల్ పవర్, ఉమ్మడి గోదావరి జిల్లాలు, VZM, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల వారు ఈస్ట్రన్ పవర్, మిగతా వారు సదరన్ పవర్ యాప్‌లు వాడాలి.

News July 2, 2024

DSC అభ్యర్థులకు ముఖ్య గమనిక

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(<<13547818>>TET<<>>)కు జులై 4 నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్-1A SGTలకు, పేపర్-1B స్పెషల్ ఎడ్యుకేషన్ SGTలకు, పేపర్-2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్-2B ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, PG టీచర్లకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ స్కిల్ ఎగ్జామ్ ఉంటుంది. టెట్‌ సిలబస్, షెడ్యూల్, నోటిఫికేషన్, అప్డేట్స్ <>https://cse.ap.gov.in/<<>>లో అందుబాటులో ఉంటాయి.

News July 2, 2024

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, ఉ.గోదావరి, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40Kmph వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News July 2, 2024

కరవు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం: కేటీఆర్

image

దగాపడ్డ తెలంగాణ దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానమే కాళేశ్వరమని KTR ట్వీట్ చేశారు. ‘కరవు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. అదే శ్రీరామ్‌సాగర్‌కు పునరుజ్జీవమిచ్చింది. నిజాంసాగర్‌ను నిండుకుండలా మార్చింది. కాళేశ్వరం అంటే బ్యారేజీ కాదని కొందరు అజ్ఞానులకు తెలియట్లేదు. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం.. దాన్ని సరిదిద్దుకోగలం. రాజకీయ కుతంత్రాలను తట్టుకోగలం’ అని రాసుకొచ్చారు.