news

News October 30, 2024

దీపావళి వేళ స్వీట్లతో జాగ్రత్త!

image

దీపావళి సందర్భంగా చాలామంది స్వీట్లు ఆరగిస్తుంటారు. స్వీట్లపై ఉండే సిల్వర్‌పూతలో కొన్నిసార్లు కల్తీ జరిగే అవకాశం ఉంది. ఆ కల్తీని గుర్తిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. స్వీట్‌పై ఉన్న సిల్వర్‌ ‌పేపర్ కల్తీదో లేదో తెలుసుకునేందుకు కాస్త సిల్వర్ పొరను తీసుకొని రెండు వేళ్లతో రబ్ చేయండి. అది పౌడర్‌గా మారితే అది స్వచ్ఛమైంది. చిన్నచిన్న ముక్కలుగా మారిందంటే అది అల్యూమినియంతో కల్తీ జరిగిందని అర్థం.

News October 30, 2024

డేటింగ్‌లో అనన్య!.. బాయ్‌ఫ్రెండ్ పోస్ట్

image

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మోడల్ వాకర్ బ్లాంకోతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దానికి బలం చేకూర్చేలా ఆమె బాయ్‌ఫ్రెండ్ వాకర్ ఓ పోస్టు చేశారు. ఈరోజు అనన్య బర్త్ డే సందర్భంగా అతడు ఇన్‌స్టాలో ఆమెకు విషెస్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్. నువ్వెంతో స్పెషల్. ఐ లవ్ యూ ఆనీ’ అని ఆమె ఫొటోను పోస్టు చేశారు. అనన్య ‘లైగర్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

News October 30, 2024

కాంగ్రెస్ ‘కళ్యాణమస్తు’ ఏమైంది?: బండి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ‘కళ్యాణమస్తు’ హామీ ఏమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా కూతురు పెళ్లి చేసిన నిరుపేద కుటుంబాలకు రూ.లక్ష సాయంతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారో ధన త్రయోదశి రోజైనా ఇవాళ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హ్యండ్ ఇచ్చిన హ్యండ్, హ్యండ్ బ్రేక్ ఆన్ ప్రోగ్రెస్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు.

News October 30, 2024

iPhone యూజర్లకు అదిరిపోయే న్యూస్

image

iOS యూజర్లకు గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్ మాదిరిగా Apple iOS 18.1కు అప్డేట్ అయిన iPhone యూజర్లు ఇకపై కాల్ రికార్డింగ్ చేయొచ్చు. iPhone SE నుంచి iPhone 16 PRO MAX వరకు ఉన్న సిరీస్ ఫోన్లు మాత్రమే ఈ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తాయి. కాల్ చేసేటపుడు లెఫ్ట్ సైడ్ పైన స్టార్ట్ కాల్ రికార్డింగ్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే రికార్డింగ్ మొదలవుతుంది. కాల్ రికార్డ్ అవుతున్నట్లు ఇద్దరికీ ఆడియో నోట్ వినిపిస్తుంది.

News October 30, 2024

RBI వద్ద ఎంత బంగారం ఉందంటే..

image

భారత బంగారం నిల్వలు 854.73 మెట్రిక్ టన్నులని RBI తెలిపింది. స్వదేశంలో 510.46, విదేశాల్లో 324.01 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచినట్టు పేర్కొంది. మరో 20.26 టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో ఉందని వెల్లడించింది. దీనిని లిక్విడిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీకి సపోర్టుగా ఉంచుతామని తెలిపింది. 2024 మార్చి నాటికి విదేశీ మారకంలో 8.15గా ఉన్న బంగారం సెప్టెంబర్‌ నాటికి 9.32 శాతానికి పెరిగినట్టు వివరించింది.

News October 30, 2024

డాన్ కావాలన్నదే డ్రీమ్: సల్మాన్ ‘డెత్‌ థ్రెట్’ నిందితుడి బ్యాగ్రౌండ్ ఇదే

image

యాక్టర్ సల్మాన్, MLA జీషన్‌ సిద్దిఖీని బెదిరించిన మహ్మద్ తయ్యబ్ (20) నోయిడాలో రోజుకూలీ అని ముంబై పోలీసులు చెప్పారు. అతడు వడ్రంగి పనిచేస్తాడన్నారు. అతడికి చెడు ఉద్దేశం లేదని, వెర్రితనంతో ఇలా చేశాడని ముదియా హఫీజ్‌లోని అతడి తల్లి అన్నారు. సరదాగా ఆ మెసేజులు పంపాడని అతడి సిస్టర్స్ చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తయ్యబ్‌ది రౌడీ క్యారెక్టరని, డాన్ కావాలన్నదే అతడి డ్రీమ్ అని నైబర్స్ చెప్తున్నారు.

News October 30, 2024

కార్పొరేట్ నయా ట్రెండ్.. ‘సైలెంట్ ఫైరింగ్’!

image

కార్పొరేట్ సెక్టార్‌లో పొమ్మనలేక పొగబెట్టడం తరహాలో ఉద్యోగుల సైలెంట్ ఫైరింగ్ మొదలైనట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. ఉద్యోగులకు కఠిన టాస్కులు ఇవ్వడం, WFH తొలగించడంతో చాలా మంది జాబ్స్‌కు గుడ్ బై చెప్పేలా చేస్తున్నారంది. ఆ స్థానాలను AIతో భర్తీ చేస్తారని పేర్కొంది. అయితే మనుషులు చేసే అన్ని టాస్క్‌లను AI చేయలేదని, వచ్చే పదేళ్లలో 5% ఉద్యోగాలనే AI భర్తీ చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

News October 30, 2024

సంజూ శాంసన్ బ్యాటింగ్ అద్భుతం: రికీ పాంటింగ్

image

భారత ప్లేయర్ సంజూ శాంసన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. అతడి బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. ‘భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ, గిల్, పంత్, విరాట్.. వీళ్లందరి ఆటా నాకు చాలా ఇష్టం. కానీ సంజూ శాంసన్ అని మరో ఆటగాడున్నాడు. మీరంతా అతడి ఆటను ఎంత ఆస్వాదిస్తారో నాకు తెలీదు కానీ.. నేను మాత్రం టీ20ల్లో సంజూ బ్యాటింగ్ చూడటాన్ని చాలా ఇష్టపడతాను’ అని తెలిపారు.

News October 30, 2024

ముగ్గురు ఐఏఎస్‌లపై ఈడీకి ఫిర్యాదు!

image

TG: ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, అమోయ్ కుమార్‌పై కొందరు ఈడీకి ఫిర్యాదు చేశారు. HYD కొండాపూర్ మజీద్ బండలో 88 ఎకరాల భూమిని బాలసాయి ట్రస్ట్‌కు దానం చేయగా భూపతి అసోసియేట్స్‌కు 42 ఎకరాలు ఇచ్చినట్లు జీవో జారీ చేశారని బాధితులు ఫిర్యాదులో తెలిపారు. తమ భూమికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి IASలు మోసం చేశారని ఆరోపించారు. కాగా ఇప్పటికే అమోయ్ కుమార్‌ను ఈడీ విచారించింది.

News October 30, 2024

కులగణనపై కాంగ్రెస్ కీలక సమావేశం

image

TG: రాష్ట్రంలో కులగణన సర్వే నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు హాజరయ్యారు. కులగణనపై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను నేతలకు మహేశ్ కుమార్ వివరించే అవకాశం ఉంది.