India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
T20WC గెలిచిన అనంతరం బార్బడోస్ పిచ్ మీద <<13536415>>మట్టి <<>>తినడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్‌శర్మ వెల్లడించారు. ‘ఆ పిచ్‌పైనే మనం ఫైనల్ గెలిచి వరల్డ్ కప్ సాధించాం. నాకు ఆ పిచ్ ఎంతో ప్రత్యేకం. దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని నేను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా మట్టి నోట్లో వేసుకున్నా’ అని రోహిత్ తెలిపారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో SAపై 7 రన్స్ తేడాతో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే.
ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త, ఔట్‌కమ్ హెల్త్ కోఫౌండర్ రిషి షాకు US కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. ₹8,300 కోట్ల కుంభకోణం కేసులో న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు. అతిపెద్ద కార్పొరేట్ మోసం కేసుల్లో ఇదొకటని పేర్కొన్నారు. కంపెనీ లాభాల్లో ఉందని చెప్పి రిషి టాప్ ఇన్వెస్టర్లు గోల్డ్‌మన్ సాచ్, అల్ఫాబెట్‌లను మోసం చేశారు. యాడ్ల కోసం డబ్బులు తీసుకుని పలు కంపెనీలను బురిడీ కొట్టించారు.
AP: ఈ 3 యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు <<13544824>>చెల్లించే <<>>సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు ద్వారా బిల్లుల చెల్లింపులను ఆ యాప్‌లు నిలిపివేశాయి. ఇకపై ఆయా డిస్కంల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను వినియోగించి బిల్లులు కట్టాలి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు సెంట్రల్ పవర్, ఉమ్మడి గోదావరి జిల్లాలు, VZM, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల వారు ఈస్ట్రన్ పవర్, మిగతా వారు సదరన్ పవర్ యాప్‌లు వాడాలి.
AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(<<13547818>>TET<<>>)కు జులై 4 నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్-1A SGTలకు, పేపర్-1B స్పెషల్ ఎడ్యుకేషన్ SGTలకు, పేపర్-2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్-2B ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, PG టీచర్లకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ స్కిల్ ఎగ్జామ్ ఉంటుంది. టెట్ సిలబస్, షెడ్యూల్, నోటిఫికేషన్, అప్డేట్స్ <
AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, ఉ.గోదావరి, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40Kmph వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దగాపడ్డ తెలంగాణ దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానమే కాళేశ్వరమని KTR ట్వీట్ చేశారు. ‘కరవు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. అదే శ్రీరామ్‌సాగర్‌కు పునరుజ్జీవమిచ్చింది. నిజాంసాగర్‌ను నిండుకుండలా మార్చింది. కాళేశ్వరం అంటే బ్యారేజీ కాదని కొందరు అజ్ఞానులకు తెలియట్లేదు. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం.. దాన్ని సరిదిద్దుకోగలం. రాజకీయ కుతంత్రాలను తట్టుకోగలం’ అని రాసుకొచ్చారు.
భారత్ T20WC గెలవడంలో కీలకపాత్ర పోషించిన పేస్ గన్ బుమ్రా ఓ అరుదైన రికార్డు సృష్టించారు. T20WCలో ఒక్క రన్ కూడా చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న మొదటి క్రికెటర్‌గా అవతరించారు. బుమ్రాకు కేవలం పాకిస్థాన్‌పై బ్యాటింగ్ అవకాశం రాగా అందులో గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఆయన 29.4 ఓవర్లు వేసి 15 వికెట్లు తీశారు. ఈ స్పీడ్‌గన్ బౌలింగ్‌లో కేవలం 12 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి.
రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని దర్శకుడు శంకర్ తెలిపారు. ‘భారతీయుడు-2’ విడుదలయ్యాక మిగతాది పూర్తి చేస్తామని ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ రెండు సినిమాలకు అసలు పోలికే లేదన్నారు. కథ దృష్ట్యా గేమ్ ఛేంజర్‌కు రెండో భాగం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ యూనిట్ ఇంకా ప్రకటించలేదు.
ఇప్పటికే టారిఫ్‌లు పెంచిన జియో 2 పాపులర్ ప్లాన్స్‌లను తొలగించి తన యూజర్లకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూజర్లు ఎక్కువగా వాడే ₹395, ₹1,559 ప్లాన్లను తొలిగించిందట. కొత్త టారిఫ్‌లు జులై 3 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఒక విడత అదనపు ఛార్జీలు తప్పించుకునేందుకు ఒకరోజు ముందే రీఛార్జ్ చేసుకోవడానికి యూజర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆ 2 ప్లాన్లు కనిపించడం లేదని కొందరు Xలో ఫిర్యాదులు చేస్తున్నారు.
TG: భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి వచ్చింది. ఉ.9 నుంచి 9.30 వరకు, రా.7 నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలను నిలిపివేస్తారు. టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్ల వద్ద, వెబ్‌సైట్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.