India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరైన వారికి పెన్షన్లు ఇవాళ ఉదయం నుంచే జమ అవుతాయని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. జీతాల చెల్లింపుల నిధులు సర్దుబాటు పూర్తైందన్నారు. అటు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
AP: పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద ప్రవహించినా ఏమీ కాదని అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. నీళ్లలో ఉంటే కట్టడం దెబ్బతింటుందనే ఆలోచనని సరికాదన్నారు. దీనికి మరో కట్టడాన్ని అనుసంధానించినా సమస్య ఉండదని పేర్కొన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్ఠతపై మరికొన్ని పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. నేడు, రేపు సమీక్షలు నిర్వహించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తుది దశకు చేరింది. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి RR నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి MBNR నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్, ఉమ్మడి ADB నుంచి వివేక్, ఉమ్మడి WGL నుంచి మాధవరెడ్డి ఉన్నట్లు సమాచారం.
దేశంలోని బ్యాంకుల్లో 6128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ప్రిలిమ్స్, అక్టోబర్ 13న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తైన 20 నుంచి 28 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. SC/ST/PwBD/ESM/DESM అభ్యర్థులకు రూ.175, ఇతరులు రూ.850 ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
TG: నల్గొండలో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో BRS కార్యాలయం నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకుండా కట్టిన పేదలు ఇళ్లు నోటీసులు ఇచ్చి, కూల్చేసే అధికారులు BRS ఆఫీసు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే కూల్చివేత జీవో ఇవ్వాలని ఆదేశించారు. ఆ స్థలంలో విద్యార్థులకు వసతి గృహాలను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.
TG: ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ గా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు?
AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ ఆఫీసుని కూల్చేశారని అన్నారు. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్‌ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
తాను రానా కలిసి 142మంది తెలుగు నటులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని నటి మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ గ్రూపులో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్లున్నారన్నారు. టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఫీలింగ్ పెంపొందించడమే దీని ఉద్దేశమని, కొత్త సినిమాలు, ట్రైలర్లుంటే గ్రూపులో వేస్తారని, వాటిని అంతా ప్రమోట్ చేస్తామన్నారు. Enough of this animosity(ఈ శత్రుత్వం చాలు) పేరుతో గ్రూప్‌ని క్రియేట్ చేశామన్నారు.
నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్‌లో మోదీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని తెలిపాయి.
AP: కృష్ణా జిల్లాకు, విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు దివంగత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కాపు ఐక్య వేదిక సీఎం చంద్రబాబును కోరింది. జులై 4న రంగా జయంతి సందర్భంగా నామకరణం విషయాన్ని ప్రకటించాలని కోరింది. కాపు-కమ్మ కులాల మైత్రి మరింత బలపడాలన్నా, టీడీపీని కాపులు భవిష్యత్తులో మరింత విశ్వసించాలన్నా ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ ఐక్యవేదిక సంఘం సీఎంకు విజ్ఞప్తి చేసింది.
Sorry, no posts matched your criteria.