India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ గా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు?
AP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ ఆఫీసుని కూల్చేశారని అన్నారు. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్‌ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
తాను రానా కలిసి 142మంది తెలుగు నటులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని నటి మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ గ్రూపులో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్లున్నారన్నారు. టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఫీలింగ్ పెంపొందించడమే దీని ఉద్దేశమని, కొత్త సినిమాలు, ట్రైలర్లుంటే గ్రూపులో వేస్తారని, వాటిని అంతా ప్రమోట్ చేస్తామన్నారు. Enough of this animosity(ఈ శత్రుత్వం చాలు) పేరుతో గ్రూప్‌ని క్రియేట్ చేశామన్నారు.
నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్‌లో మోదీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని తెలిపాయి.
AP: కృష్ణా జిల్లాకు, విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు దివంగత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కాపు ఐక్య వేదిక సీఎం చంద్రబాబును కోరింది. జులై 4న రంగా జయంతి సందర్భంగా నామకరణం విషయాన్ని ప్రకటించాలని కోరింది. కాపు-కమ్మ కులాల మైత్రి మరింత బలపడాలన్నా, టీడీపీని కాపులు భవిష్యత్తులో మరింత విశ్వసించాలన్నా ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ ఐక్యవేదిక సంఘం సీఎంకు విజ్ఞప్తి చేసింది.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తొమ్మిది మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయనతో పాటు ఎంపీలు జగదంబికా పాల్, ఎ.రాజా, పి.సి. మోహన్, సంధ్యారాయ్, దిలీప్ సైకియా, శెల్జా, కాకోలీ ఘోష్ దస్తీదార్, అవధేశ్ ప్రసాద్‌లున్నారు. వీరంతా ప్యానెల్ స్పీకర్లుగా సభ నిర్వహణలో ఓం బిర్లాకు సహకరించనున్నారు.
AP: కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలవరంపై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 3వ తేదీన అమరావతిపై ఈ పత్రాన్ని సీఎం విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో అమరావతి విధ్వంసం, తాజా పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ అంశాలను ఇందులో పొందుపర్చనున్నారు. దీనిపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు పొందుపర్చాల్సిన అంశాలపై సూచనలు చేశారు.
TG: అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం కానున్నట్లు సమాచారం. శాఖల వారీగా అధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. శాఖల వారీగా పనితీరు, సమస్యలను సమీక్షించి.. ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించనున్నట్లు తెలుస్తోంది.
AP: రాష్ట్రంలో త్వరలో కొత్త ఇసుక పాలసీని తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. సచివాలయంలో చంద్రబాబును క్రెడాయ్ ఛైర్మన్ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షుడు వైవీ రమణరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలు చంద్రబాబుకి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లలో 97.87శాతం వరకు బ్యాకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 2024 జూన్ 28 నాటికి రూ.7851 కోట్ల విలువైన నోట్లు మాత్రం ప్రజల వద్దే ఉండిపోయాయంది. కాగా 2016 నవంబరులో ఈ నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న రూ.2వేల నోట్లను కేంద్రం ఉపసంహరించుకుంది.
Sorry, no posts matched your criteria.