news

News April 18, 2025

ఆ నటుడు డ్రగ్స్ డిమాండ్ చేసేవాడు.. నిర్మాత ఆరోపణ

image

‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు శ్రీనాథ్ భాసీ ప్రస్తుతం ‘నముక్కు కొడత్తియిల్ కాణం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా నిర్మాత హజీబ్ మలబార్ శ్రీనాథ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలో తనకు ఫోన్ చేసి డ్రగ్స్ తీసుకురావాలని వేధించేవాడని, షూట్ సమయంలో కారవాన్‌లో డ్రగ్స్‌ను దాచి వాడేవాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అతడి కారణంగా తమ సినిమా షూటింగ్, డబ్బింగ్ ఆలస్యమయ్యాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News April 18, 2025

జగన్‌కు వ్యతిరేకంగా చెబుతానని మీడియా భ్రమపెట్టింది: VSR

image

AP: మద్యం కేసులో సిట్ విచారణపై తనకేమీ అత్యుత్సాహం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తనకు తెలిసిన విషయాలు చెప్పానని, మరోసారి పిలిస్తే వస్తానని పేర్కొన్నారు. ‘ఈ నెల 18న విచారణకు సిట్ నోటీసు ఇచ్చింది. అయితే నేను అత్యుత్సాహంగా ముందుగానే వచ్చి YS జగన్‌కు వ్యతిరేకంగా చెప్పబోతున్నాననే భ్రాంతిని కొన్ని మీడియా సంస్థలు కలిగించాయి. ఇలాంటి జర్నలిస్టు ప్రమాణాలు మానుకోవాలి’ అని పేర్కొన్నారు.

News April 18, 2025

TGలో భారీ పెట్టుబడులు.. జపాన్‌లో సీఎం రేవంత్ ఒప్పందం

image

TG: రాష్ట్రంలో జపాన్‌కు చెందిన NTT డేటా సంస్థ రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. జపాన్ పర్యటనలో ఉన్న CM రేవంత్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 25వేల జీపీయూలతో AI సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్‌ను లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ కూడా HYD శివారు రుద్రారంలో రూ.592 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు సీఎం బృందంతో ఎంవోయూ కుదుర్చుకుంది.

News April 18, 2025

నేషనల్ హెరాల్డ్ కేసుతో BJPకి సంబంధం లేదు: బండి

image

నేషనల్ హెరాల్డ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. 2011లో UPA ప్రభుత్వ హయాంలోనే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందన్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ పొందారని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి రూ.2 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు వారు ప్రయత్నించారని ఆరోపించారు. వారికి చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు.

News April 18, 2025

భర్తను 36 సార్లు పొడిచి.. ప్రియుడికి వీడియో కాల్ చేసిన భార్య

image

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ల రాహుల్ అనే వ్యక్తిని మైనర్ అయిన భార్య, ప్రియుడి స్నేహితులు 36 సార్లు బీరు బాటిల్‌తో పొడిచి చంపారు. షాపింగ్‌కు వెళ్దామని భర్తను బయటకు తీసుకెళ్లగా ప్రియుడు యువరాజ్‌ స్నేహితులు వారిని వెంబడించారు. ఓ చోట ఆగగానే అతణ్ని పొదల్లోకి తీసుకెళ్లి బీరు బాటిల్‌తో పొడిచి చంపేశారు. అనంతరం ‘పని అయిపోయింది’ అని భార్య తన ప్రియుడికి వీడియో కాల్ చేసింది.

News April 18, 2025

ఆ విషయం రాజ్ కసిరెడ్డినే అడగాలి: VSR

image

AP: మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ 3 గంటలపాటు విచారించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘లిక్కర్‌కు సంబంధించి రెండు సమావేశాలు జరిగినట్లు నేను అధికారులకు చెప్పా. ఫస్ట్ మీటింగ్‌లో వాసుదేవరెడ్డి, మిథున్, సత్యప్రసాద్, కసిరెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో నాకు తెలియదు. ఈ విషయాన్ని ఆయన్నే అడిగి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News April 18, 2025

20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు: ఇన్ఫోసిస్

image

ముందస్తు సమాచారం లేకుండా <<15595609>>400 మంది ట్రైనీలను తొలగించి<<>> విమర్శలపాలైన ఇన్ఫోసిన్ ఇప్పుడు యువతకు శుభవార్త చెప్పింది. FY2025-26లో 20K మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ వెల్లడించారు. జీతాల పెంపుపై మాట్లాడుతూ ‘కంపెనీలో జీతాల పెంపు సగటున 5-8% ఉంది. ఉత్తమ పనితీరు కనబర్చిన వారికి 10-12% పెంచాం. JANలోనే చాలామందికి శాలరీలు పెరిగాయి. మిగతా వారికి APR 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని తెలిపారు.

News April 18, 2025

భార్యతో విడాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో ధవన్(PHOTO)

image

ఆయేషా ముఖర్జీతో విడిపోయిన తర్వాత IND మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ విదేశీ యువతి సోఫీ షైన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా వీరిద్దరూ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రత్‌ హాజరైన ఈవెంట్‌లో ధవన్, సోఫీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కలిసి ఫొటో దిగారు. కాగా ఈ ఐరిష్ భామతో ధవన్ ఏడాదిగా డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

News April 18, 2025

ఆ విధానం అమలుపై నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

image

టోల్‌గేట్లు ఎత్తేసి శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వాహన ఛార్జీ వసూలు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మే 1నుంచే ఇది అమల్లోకి వస్తోందంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ANPR) విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంది. తొలుత ఎంపిక చేసిన టోల్‌ప్లాజాల వద్ద అమర్చుతామని పేర్కొంది.

News April 18, 2025

18th Anniversary: IPL స్పెషల్ పోస్టర్

image

ప్రతిష్ఠాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభమై నేటితో 18 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా IPL X హ్యాండిల్ స్పెషల్ ట్వీట్ చేసింది. ‘కలలు నిజమయ్యాయి.. మనసులు ఉప్పొంగాయి.. కేరింతలు మార్మోగాయి’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్ చేసింది. ‘18 ఏళ్ల IPL జర్నీపై ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పండి?’ అని ఫ్యాన్స్‌ను కోరింది. COMMENT

error: Content is protected !!