India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ MP సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. పిటిషనర్, మాజీ దౌత్యవేత్త లక్ష్మిపురీకి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. గతంలో దౌత్యవేత్తగా విధులు నిర్వహించిన లక్ష్మిపురీ ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేశారని 2021లో సాకేత్ సోషల్ మీడియాలో ఆరోపించారు. ఆమె భర్త అయిన కేంద్రమంత్రి హార్దిప్‌సింగ్ పురీపైనా ఆరోపణలు చేశారు.
TG: 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. TGPSC భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డుల, ఇతర విభాగాల పోస్టులను ఇందులో పొందుపరచనుంది. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుదిరూపు తీసుకురాగా.. సీఎం రేవంత్ పరిశీలన అనంతరం విడుదల చేసేందుకు అడుగులు ముందుకేస్తోంది.
TG: రాష్ట్రంలో రంగారెడ్డి మినహా 32 జిల్లాల్లో 25,036 మంది SGTలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో సగం మంది కొత్త స్థానాల్లో చేరిపోయారు. మిగిలిన స్థానాల్లోకి వచ్చేందుకు ఇతర ఉపాధ్యాయులు ఆప్షన్లు ఇవ్వకపోవడంతో కొత్త టీచర్లు వచ్చేవరకు వారు ఎదురుచూడాల్సి ఉంటుంది. అయితే అప్పటివరకు విద్యా వాలంటీర్లను నియమించి, బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
AP: క్యాన్సర్ మహమ్మారి కాదని, ముందస్తు పరీక్షలు చేయించుకుని గుర్తిస్తే 98 శాతం తగ్గించుకోవచ్చని ప్రముఖ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. స్క్రీనింగ్ టెస్టులను ఆరోగ్యశ్రీ వంటి ఉచిత సేవల పరిధిలోకి తీసుకువస్తే మేలు జరుగుతుందనే విషయాన్ని పలు రాష్ట్రాల CMలకు చెప్పినట్లు పేర్కొన్నారు. తూ.గోదావరి(D) రాజానగరంలోని GSL మెడికల్ కాలేజీలో ఆయన ప్రసంగించారు. క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
AP: ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరైన వారికి పెన్షన్లు ఇవాళ ఉదయం నుంచే జమ అవుతాయని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. జీతాల చెల్లింపుల నిధులు సర్దుబాటు పూర్తైందన్నారు. అటు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
AP: పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద ప్రవహించినా ఏమీ కాదని అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. నీళ్లలో ఉంటే కట్టడం దెబ్బతింటుందనే ఆలోచనని సరికాదన్నారు. దీనికి మరో కట్టడాన్ని అనుసంధానించినా సమస్య ఉండదని పేర్కొన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్ఠతపై మరికొన్ని పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. నేడు, రేపు సమీక్షలు నిర్వహించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తుది దశకు చేరింది. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి RR నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి MBNR నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్, ఉమ్మడి ADB నుంచి వివేక్, ఉమ్మడి WGL నుంచి మాధవరెడ్డి ఉన్నట్లు సమాచారం.
దేశంలోని బ్యాంకుల్లో 6128 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ప్రిలిమ్స్, అక్టోబర్ 13న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తైన 20 నుంచి 28 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. SC/ST/PwBD/ESM/DESM అభ్యర్థులకు రూ.175, ఇతరులు రూ.850 ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
TG: నల్గొండలో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో BRS కార్యాలయం నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకుండా కట్టిన పేదలు ఇళ్లు నోటీసులు ఇచ్చి, కూల్చేసే అధికారులు BRS ఆఫీసు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే కూల్చివేత జీవో ఇవ్వాలని ఆదేశించారు. ఆ స్థలంలో విద్యార్థులకు వసతి గృహాలను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.
TG: ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ గా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు?
Sorry, no posts matched your criteria.