news

News July 2, 2024

రూ.249కి BSNL అదిరిపోయే ప్లాన్!

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించేలా రూ.249 ప్లాన్‌ను పరిచయం చేస్తోంది. 45 రోజుల కాలవ్యవధితో అన్‌లిమిలిటెడ్ కాల్స్, రోజుకి 2GB డేటా, 100 ఫ్రీ SMSలు ఈ ప్యాక్‌లో అందిస్తోంది. ఇతర టెలికాం కంపెనీలు ఇదే ధరకు 1GB డేటానే ఇస్తుండగా వ్యాలిడిటీ 28 రోజులే ఉంటుండటం గమనార్హం. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ తమ టారిఫ్‌లను భారీగా పెంచిన వేళ వినియోగదారులకు ఇది పెద్ద ఊరటనే చెప్పొచ్చు.

News July 2, 2024

సెబీ కోటక్ పేరును ఎందుకు దాచినట్లు?: హిండెన్‌బర్గ్

image

అదానీ గ్రూప్‌పై రిపోర్టుకు సంబంధించి సెబీ <<13549559>>నోటీసులపై<<>> స్పందిస్తూ హిండెన్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. నోటీసుల్లో కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (KMIL) పేరును ఎందుకు దాచారని ప్రశ్నించింది. ‘KMILను సెబీ K-India Oppurtunities ఫండ్‌గా పేర్కొంది. మాపై చర్యలకు సిద్ధమైన సెబీ భారతీయ సంస్థ అయిన కోటక్‌కు దీంతో సంబంధం ఉందని గుర్తించలేదంటే అనుమానంగా ఉంది’ అని పేర్కొంది.

News July 2, 2024

అరకు కాఫీకి ఈ గుర్తింపు రావడం సంతోషకరం: CBN

image

అరకులో కాఫీ పండిస్తున్న గిరిజన రైతులకు మద్దతిస్తున్నందుకు PM <<13539131>>మోదీ<<>>, ఏపీ సీఎం CBNకు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కాఫీకి గుర్తింపు ఉందని, ప్యారిస్‌లో రెండో కేఫ్‌ను ప్రారంభించనున్నట్లు Xలో తెలిపారు. దీనిని AP CM చంద్రబాబు స్పందిస్తూ అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయగాథలు AP నుంచి రావాలని CBN ఆకాంక్షించారు.

News July 2, 2024

సల్మాన్ ఖాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్ట్!

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ రూ.25 లక్షలు తీసుకున్నట్లు నవీ ముంబై పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. సల్మాన్‌ను చంపేందుకు పాకిస్థాన్ నుంచి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కాంట్రాక్ట్ ఎవరిచ్చారో తెలియాల్సి ఉంది.

News July 2, 2024

లోకేశ్‌ను కలిసిన క్యాబ్ డ్రైవర్లు

image

HYDలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అమరావతిలో AP మంత్రి నారా లోకేశ్‌కు పలువురు AP క్యాబ్ డ్రైవర్లు విన్నవించుకున్నారు. ఉమ్మడి రాజధానిగా HYD కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలకు TG ప్రభుత్వం మళ్లీ లైఫ్ ట్యాక్స్ అడుగుతోందని వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి APలో ట్యాక్స్ కట్టిన తమకు మళ్లీ కట్టడం ఆర్థికంగా తీవ్ర భారమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న జరిగే చంద్రబాబు-రేవంత్ భేటీలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

News July 2, 2024

Airportలో షాప్.. 2నెలల్లో రూ.3కోట్లు.. అరెస్ట్

image

చెన్నై ఎయిర్‌పోర్టులో షాప్ మాటున గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ 2నెలల్లో రూ.3కోట్లు సంపాదించిన ఓ యూబ్యూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకకు చెందిన ఓ స్మగ్లర్ లోకల్ యూట్యూబర్‌ మహ్మద్ సాబిర్‌తో షాప్ పెట్టించగా అతడు 2నెలల్లోనే రూ.167కోట్ల విలువైన 267kgల బంగారం అక్రమంగా తరలించాడు. షాపు సిబ్బంది వద్ద గోల్డ్ పౌడర్ పోలీసులకు దొరకడంతో మొత్తానికి గుట్టురట్టయింది. అలీ, షాపు సిబ్బంది అరెస్టయ్యారు.

News July 2, 2024

పుణేలో ‘జికా’ కలకలం.. ఇద్దరు ప్రెగ్నెంట్లకు పాజిటివ్

image

మహారాష్ట్రలోని పుణేలో జికా వైరస్ విజృంభిస్తోంది. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి సోకింది. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ గర్భిణులకు సోకితే పుట్టే బిడ్డల్లో మెదడు అభివృద్ధి చెందదు. జికా వైరస్‌ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

News July 2, 2024

కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)

image

YS జగన్ కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు. అందులో వైట్ అండ్ బ్లాక్ కుర్తా పైజామా‌తో మాజీ సీఎం కనిపించారు. గతంలో ఈ తరహా లుక్‌లో జగన్‌ను ఎప్పుడూ చూడలేదని YCP శ్రేణులు అంటున్నాయి. దీంతో జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియాలో ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నాయి.

News July 2, 2024

రాహుల్ గాంధీ ప్రసంగంపై అభ్యంతరాలు.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు

image

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో కేంద్రంపై రాహుల్ గాంధీ చేసి <<13546466>>విమర్శలపై<<>> బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా చర్యలు తీసుకున్నారు. హిందూ మతం, బీజేపీ, RSS, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై విపక్ష నేత చేసిన వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. కాగా నిన్న దాదాపు 100 నిమిషాలపాటు రాహుల్ ప్రసంగించిన విషయం తెలిసిందే.

News July 2, 2024

హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసులు

image

గతఏడాది అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ కుట్రపూరితంగానే రిపోర్ట్ రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెబీ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘అదానీ FPO లాంచ్ అయ్యే టైమ్‌లోనే ఈ రిపోర్ట్ వచ్చింది. దీనికి ముందు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో షార్ట్ సెల్లింగ్ (ముందు షేర్లు విక్రయించి ఆ తర్వాత వాటి విలువ తగ్గాక మళ్లీ కొనడం) జరిగింది. రిపోర్ట్ తర్వాత AEL షేర్ల విలువ 59% పడిపోయింది’ అని పేర్కొంది.