news

News July 2, 2024

నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

image

AP: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 10వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 5 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 11-15 వరకు ఆప్షన్ల ఎంపిక చేసుకోవచ్చు. 19న సీట్లు కేటాయిస్తారు. 20-22 తేదీల్లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు VIJలోని SRR, విశాఖలోని VS కృష్ణ, TPTలోని SV వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు.

News July 2, 2024

పెన్షన్ల పంపిణీలో రికార్డు: మంత్రి పార్థసారథి

image

APలో 65.18 లక్షల మంది లబ్ధిదారుల్లో 61.76 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒక రికార్డు. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లతో ఒక్కరోజులో 85% మాత్రమే పంచేవారు. ఇప్పుడు 12 గంటల్లోనే ఈ రికార్డు సాధించాం. సమర్థ నాయకత్వం, ఆదర్శవంతమైన నాయకుడు ఉంటే ఉద్యోగులు ఎంత స్ఫూర్తిగా పనిచేస్తారనడానికి ఇదే ఉదాహరణ’ అని ఆయన పేర్కొన్నారు.

News July 2, 2024

శ్రీవారి దర్శనానికి 8 గంటల టైమ్

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.

News July 2, 2024

గుడ్ న్యూస్.. రేపు స్వదేశానికి భారత జట్టు!

image

బెరిల్ హరికేన్ కారణంగా వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు రేపు స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. జట్టు ఆటగాళ్ల కోసం BCCI ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రేపు ఉదయం 7.45 గంటలకు ఢిల్లీ చేరుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం హరికేన్ ప్రభావంతో అక్కడ కర్ఫ్యూ విధించగా ఎయిర్ పోర్టును మూసివేశారు.

News July 2, 2024

ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్?

image

TG: ఈ నెల 23న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యారంటీలు, సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు ఉండొచ్చని అంచనా. చర్చలు పూర్తయ్యాక దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

News July 2, 2024

చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి సస్పెండ్

image

AP: కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం గతంలో లంచం తీసుకున్న ఓ డిప్యూటీ సర్వేయర్ సస్పెండయ్యారు. శాంతిపురం(మ) శివపురంలోని ఓ వ్యవసాయ భూమిలో CBN ఇల్లు కట్టేందుకు TDP నేతలు దరఖాస్తు చేశారు. సబ్ డివిజన్ చేసేందుకు హుస్సేన్ రూ.1.80 లక్షలు అడిగారు. ఇటీవల CM కుప్పం టూర్‌లో TDP నేతల మధ్య ఈ విషయం చర్చకు వచ్చింది. దీనిపై ఆరా తీసి, కలెక్టర్ విచారణ జరిపించగా నిజమని తేలింది. దీంతో ఉద్యోగిని సస్పెండ్ చేశారు.

News July 2, 2024

SAD: బాధను భరించలేకపోతున్న మిల్లర్

image

T20WC ముగిసి 2 రోజులవుతున్నా ఫైనల్ ఓటమి బాధ నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ బయటికి రాలేకపోతున్నారు. తొలిసారి WC గెలిచే సువర్ణావకాశాన్ని త్రుటిలో కోల్పోయినప్పటి నుంచి తమ జట్టు పరిస్థితిని మాటల్లో వర్ణించలేకపోతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సహచర ఆటగాళ్లతో ఫొటోలు పంచుకున్నారు. ఇదిలా ఉంటే మిల్లర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

News July 2, 2024

మరోసారి రాయలసీమ అమ్మాయిగా రష్మిక!

image

రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక చేయడం దాదాపు ఖాయమైంది. రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో సాగే కథ అని, నటీనటుల పాత్రలు ఆ యాసలోనే ఉంటాయని సమాచారం. రష్మిక పుష్ప సినిమాలో చిత్తూరు అమ్మాయి శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయిన విషయం తెలిసిందే. కాగా విజయ్, రష్మిక కాంబోలో ఇది మూడో చిత్రం కానుంది. ఇప్పటికే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్‌లో నటించారు.

News July 2, 2024

పరువు నష్టం కేసులో ఎంపీకి రూ.50 లక్షల జరిమానా

image

పరువు నష్టం కేసులో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ MP సాకేత్ గోఖలేకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. పిటిషనర్, మాజీ దౌత్యవేత్త లక్ష్మిపురీకి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. గతంలో దౌత్యవేత్తగా విధులు నిర్వహించిన లక్ష్మిపురీ ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేశారని 2021లో సాకేత్ సోషల్ మీడియాలో ఆరోపించారు. ఆమె భర్త అయిన కేంద్రమంత్రి హార్దిప్‌సింగ్‌ పురీపైనా ఆరోపణలు చేశారు.

News July 2, 2024

నిరుద్యోగులకు GOOD NEWS.. త్వరలో జాబ్ క్యాలెండర్

image

TG: 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. TGPSC భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డుల, ఇతర విభాగాల పోస్టులను ఇందులో పొందుపరచనుంది. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుదిరూపు తీసుకురాగా.. సీఎం రేవంత్ పరిశీలన అనంతరం విడుదల చేసేందుకు అడుగులు ముందుకేస్తోంది.