news

News October 30, 2024

ముగ్గురు ఐఏఎస్‌లపై ఈడీకి ఫిర్యాదు!

image

TG: ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, అమోయ్ కుమార్‌పై కొందరు ఈడీకి ఫిర్యాదు చేశారు. HYD కొండాపూర్ మజీద్ బండలో 88 ఎకరాల భూమిని బాలసాయి ట్రస్ట్‌కు దానం చేయగా భూపతి అసోసియేట్స్‌కు 42 ఎకరాలు ఇచ్చినట్లు జీవో జారీ చేశారని బాధితులు ఫిర్యాదులో తెలిపారు. తమ భూమికి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి IASలు మోసం చేశారని ఆరోపించారు. కాగా ఇప్పటికే అమోయ్ కుమార్‌ను ఈడీ విచారించింది.

News October 30, 2024

కులగణనపై కాంగ్రెస్ కీలక సమావేశం

image

TG: రాష్ట్రంలో కులగణన సర్వే నేపథ్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు హాజరయ్యారు. కులగణనపై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను నేతలకు మహేశ్ కుమార్ వివరించే అవకాశం ఉంది.

News October 30, 2024

భారత్ చేతిలో ఓటమి తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నా: వేడ్

image

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిన అనంతరం తాను ఇక రిటైరవ్వాలన్న <<14479096>>నిర్ణయం<<>> తీసుకున్నట్లు ఆస్ట్రేలియా మాజీ కీపర్ మాథ్యూ వేడ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ ‌కప్‌లో భారత్ చేతిలో మా టీమ్ ఓడింది. మ్యాచ్ అయ్యాక ఒక్కడినే కూర్చుని ఆలోచించుకున్నా. ఇక నా కెరీర్ ముగిసినట్లే అనిపించింది. జోష్ ఇంగ్లిస్ వంటి కీపర్ ఇప్పుడు జట్టుకు ఉన్నారు’ అని వివరించారు.

News October 30, 2024

మందుబాబులకు వెరైటీ ఆఫర్.. ఎక్కడంటే!

image

AP: సాధారణంగా వైన్స్ షాపులు మందుబాబులతో కిటకిటలాడుతుంటాయి. కానీ అన్నమయ్య జిల్లా రాజంపేటలో మాత్రం పరిస్థితి రివర్స్‌గా ఉంది. దీంతో కస్టమర్లను తమ షాపులకు రప్పించుకునేందుకు పలువురు యజమానులు ఆఫర్లు ప్రకటించేస్తున్నారు. ప్రతి మద్యం బాటిల్‌కు గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ అంటూ మందుబాబుల్ని ఊరిస్తూ బోర్డులు పెడుతున్నారు. షాపులు ఎక్కువగా ఉండటం పోటీ పెరగడంతో వ్యాపారులకు ఆఫర్ మార్కెటింగ్ తప్పడం లేదు.

News October 30, 2024

చైనా అగ్ర కుబేరుడు.. అంబానీ, అదానీకంటే పేదోడు!

image

హురున్ చైనా రిచ్ తాజాగా ప్రకటించిన చైనా కుబేరుల జాబితాలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్‌ ఇమింగ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన ఆస్తి విలువ 49.3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, అది భారత కుబేరులు అంబానీ, అదానీల కంటే తక్కువే కావడం గమనార్హం. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ 102 బిలియన్ డాలర్లు కాగా అదానీ ఆస్తి 92.4 బిలియన్ డాలర్లుగా ఉంది.

News October 30, 2024

ఉదయనిధి డ్రెస్ కోడ్‌పై హైకోర్టులో పిటిషన్

image

TN డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫార్మల్ డ్రెస్ కోడ్ పాటించడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అధికారిక కార్యక్రమాల్లో ఆయన పార్టీ చిహ్నాలను ప్రదర్శించే దుస్తులు ధరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఇది రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. దీనిపై విచారించిన కోర్టు స్పందన తెలియజేయాలని GOVTని ఆదేశించింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి డ్రెస్ కోడ్‌ విషయంలో నిబంధనలు పరిశీలించాలని ఏజీని కోరింది.

News October 30, 2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు మావోయిస్టు పార్టీ వార్నింగ్

image

TG: దళిత బంధు పేరుతో ప్రజలను జయశంకర్ భూపాలపల్లి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మోసం చేశారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. దళిత బంధు ఇస్తామని ప్రజల నుంచి రూ.లక్షల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించింది. ఇప్పటికైనా వాటిని ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని పలువురి పేర్లను పేర్కొంటూ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది.

News October 30, 2024

పేలిన ‘లోకల్’ బాంబు: చైనాకు రూ.లక్ష కోట్ల నష్టం!

image

భారత ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదం చైనాకు భారీ షాకే ఇచ్చింది. ఈ దీపావళి సీజన్లో ఆ దేశం రూ.1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం నష్టపోతుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. కస్టమర్లు ఎక్కువగా స్థానిక ఉత్పత్తులనే కొంటున్నారని చెప్పారు. భారత వ్యాపారం ఈ 5 రోజుల్లోనే రూ.4.25 లక్షల కోట్ల టర్నోవర్‌ను టచ్ చేయొచ్చని అంచనా వేశారు. ధంతేరాస్ రోజే రూ.60వేల కోట్ల టర్నోవర్ దాటొచ్చని వెల్లడించారు.

News October 30, 2024

ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని: మంత్రి కోమటిరెడ్డి

image

TG: తమ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో తాము బలహీనవర్గాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. బీసీ కులగణన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

News October 30, 2024

నాగార్జున యూనివర్సిటీకి ESI నోటీసులు

image

AP: నాగార్జున యూనివర్సిటీకి ఈఎస్ఐ జప్తు నోటీసులు ఇచ్చింది. ఉద్యోగుల ESI నిధులు దారి మళ్లించడంతో వర్సిటీ అకౌంట్ నుంచి సదరు మొత్తం రూ.28 లక్షలు తీసుకుంటామని జప్తు నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగులకు చెందిన ఈఎస్ఐ సొమ్మును ఔట్ సోర్సింగ్ సంస్థ వాడుకుందని ఈఎస్ఐ గతంలో డిమాండ్ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై వర్సిటీ నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 24న జప్తు నోటీసులిచ్చింది.