India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘ఉప’ అంటే సమీపంగా, ‘వాసం’ అంటే ఉండటం. మనసును దైవానికి దగ్గరగా ఉంచడమే ఉపవాసం. దీనివల్ల ఇంద్రియాలను అదుపులో ఉంచుకొనే శక్తి పెరుగుతుంది. ఆత్మశుద్ధి కలుగుతుంది. శాస్త్రీయంగానూ ఇందువల్ల అనేక లాభాలుంటాయి. శరీరంలోని విషతుల్యాలు తొలగి ప్రాణశక్తి పెరుగుతుంది. భోజనంపై ఆసక్తిని తగ్గించి, దైవచింతనపై దృష్టి సారించేలా చేస్తుంది. భక్తుడిలో క్రమశిక్షణను, పట్టుదలను పెంపొందించి శివానుగ్రహానికి పాత్రులను చేస్తుంది.

మినుము, పెసర విత్తిన 20 రోజులకు గడ్డిజాతికి చెందిన కలుపు మొక్కలు మాత్రమే 2,3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో క్విజాలోఫాప్ ఇథైల్ 5% 400ml లేదా ప్రొపాక్విజాఫాప్ 10% 250ml కలిపి పిచికారీ చేయాలి. పొలంలో గడ్డిజాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200ml లేదా ఫోమెసాఫెన్ 11.1% + ఫ్లుజిఫాప్-పి-బ్యుటెల్ 11.1% 400 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.

TG: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. 116 మున్సిపాలిటీలకు గాను ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 23 చోట్ల ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ ఆరు చోట్ల గెలవగా బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. ఇక ఏడు కార్పొరేషన్లలో రామగుండం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది.

TG: మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, BRS 4, బీజేపీ 1, స్వతంత్రులు 1 చోట గెలిచారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 5, బీజేపీ 1, స్వతంత్రులు 2 చోట్ల గెలిచారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్, BRS చెరో 8 చోట్ల గెలిచాయి.

TG: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో సంచలనం నమోదైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) విజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లో AIFB 8 చోట్ల, కాంగ్రెస్, BRS ఒక్కో స్థానంలో గెలిచాయి. ఆ ప్రాంతంలో మంచి పేరున్న వడ్డేపల్లి శ్రీనన్న కొద్ది రోజుల క్రితం కల్వకుంట్ల కవితకు చెందిన జాగృతిలో చేరారు. ఆయన మద్దతుదారులు AIFB గుర్తు (సింహం)పై పోటీ చేసి గెలిచారు.

పురుషుల్లో ఉండే Y క్రోమోజోమ్ మగాళ్లు పుట్టడానికి కీలకం. వయసు పెరిగే కొద్దీ వారి కణాల నుంచి ఈ క్రోమోజోమ్‌ను కోల్పోతారని, దీనివల్ల నష్టం లేదని గతంలో సైంటిస్టులు భావించేవారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం Y క్రోమోజోమ్ తగ్గడం వల్ల పురుషులు తీవ్రమైన వ్యాధుల బారిన పడి జీవితకాలం తగ్గుతుందట. అయితే వారసుల్లో ఈ లోపం ఉండదని, మగాళ్ల పుట్టుకపై ఇప్పటికిప్పుడు ప్రభావం ఉండదని తేలింది. ఇది ఊరటనిచ్చే అంశం.

AP: శాసన మండలి నుంచి YCP సభ్యులు వాకౌట్ చేశారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండలిలో చెప్పారు. అధికార పక్షం ఆరోపిస్తున్నట్లుగా వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదని, తమ నిరసన ద్వారా పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమేనని వివరించారు.

TG: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి నగేశ్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) 109 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలుపొందారు. రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.

TG: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ఎన్నికైన అభ్యర్థికి వెంటనే అధికారిక సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. దాన్ని తీసుకున్న వ్యక్తి సంతకం చేయాలి’ అని పేర్కొంది. దీంతో దూరప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
Sorry, no posts matched your criteria.