news

News January 7, 2025

ఫార్ములా-ఈ రేసు కేసు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును <<15086612>>ఆశ్రయిస్తే<<>> తమ వాదనలు కూడా వినాలంటూ కోరింది.

News January 7, 2025

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిరాజ్‌కు రెస్ట్!

image

ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు పేసర్ సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలని BCCI భావిస్తోంది. 2023 నుంచి 671.5 ఓవర్ల బౌలింగ్ వేసిన అతనిపై పనిభారం తగ్గించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే T20లకు రెస్ట్ ఇచ్చి వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. BGTలో ఆశించిన మేర రాణించకలేకపోయినా కీలక సమయాల్లో సిరాజ్ వికెట్లు తీశారు. JAN 22-FEB 2వరకు 5 T20లు జరగనున్నాయి.

News January 7, 2025

విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి: మంత్రి అచ్చెన్న

image

AP: విశాఖ పర్యటనలో PM మోదీ శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌తో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. YCP హయాంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మోదీ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వేజోన్‌కు రేపు PM శంకుస్థాపన చేస్తారన్నారు. అటు హోంమంత్రి అనిత కూడా సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు.

News January 7, 2025

గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం.. ఖండించిన టీమ్

image

కొన్ని రోజులుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం, పెళ్లిపై వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ‘కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. పారితోషికాలు, ఆస్తుల విషయంలోనూ అసత్య ప్రచారం జరుగుతోంది. అవన్నీ నిరాధారం. సత్యదూరం. సదరు వ్యక్తులపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. పరువు నష్టం దావాలు వేస్తాం’ అని పేర్కొంది.

News January 7, 2025

కార్యకర్తల ఘర్షణ.. తలలు పగిలాయి!

image

TG: నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు వద్ద జరిగిన <<15087507>>ఘర్షణలో<<>> పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల అండతో కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆఫీసు ముందుకు వచ్చి తమపైనే దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా ధర్నా చేపట్టినా తమపై బీజేపీ వాళ్లు దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రమేశ్ బిధూరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News January 7, 2025

BREAKING: ఆశారాం బాపునకు బెయిల్

image

వివాదాస్పద మతగురువు, సంత్ ఆశారాం బాపునకు రిలీఫ్ దొరికింది. మార్చి 31వరకు సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో ఉపశమనం కల్పించింది. అత్యాచారం కేసులో ఆయన యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. జైలునుంచి బయటకొచ్చాక అనుచరులను కలవకూడదని ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతం ఆయనకు 85ఏళ్లు.

News January 7, 2025

బిష్ణోయ్‌తో భయం: సల్మాన్ ఇంటికి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్

image

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుతో ముప్పు ఉండటంతో యాక్టర్ సల్మాన్ ఖాన్ మరింత జాగ్రత్తపడుతున్నారు. తన గ్యాలక్సీ అపార్ట్‌మెంటు బాల్కనీ వద్ద భారీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. సాధారణంగా ఆయన ఇక్కడి నుంచే ఫ్యాన్స్‌కు చేతులూపి అభివాదం చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం ఇక్కడే ఆయనపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. అలాగే సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని కాల్చిచంపడం తెలిసిందే.

News January 7, 2025

ఫార్ములా-e: ఈ లింకుపైనే ACB కూపీ..

image

KTR చుట్టూ బిగుసుకుంటున్న ఫార్ములా-e రేస్ కేసులో ACB క్విడ్ ప్రో కో అంశంపై దర్యాప్తు చేస్తోంది. 2022లో గ్రీన్ కో, అనుబంధ సంస్థల నుంచి పలు దఫాలుగా BRSకు రూ.41 కోట్ల మేర ఎన్నికల బాండ్లు వచ్చాయని దర్యాప్తు సంస్థ గుర్తించింది. అటు 2023లో రూల్స్ పాటించకుండా ఆ సంస్థకు రూ.45 కోట్ల మేర బదిలీ చేసేలా KTR ఆదేశాలిచ్చారు. దీంతో ఇది ముందస్తు తెరవెనక ఒప్పందంలో భాగంగా జరిగిన చెల్లింపు అని ACB అనుమానిస్తోంది.

News January 7, 2025

ప్రజలను డైవర్ట్ చేసేందుకే తెరపైకి కేటీఆర్ అంశం: పువ్వాడ అజయ్

image

రైతు భరోసా వైఫల్యం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే KTR అంశం తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. KTR అవినీతి చేసినట్టు హైకోర్టు చెప్పలేదని తెలిపారు. పిటిషన్‌ను మాత్రమే కోర్టు కొట్టేసిందని చెప్పారు. అటు, KTR విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని MLC బల్మూరి వెంకట్ ఆరోపించారు. సినిమా ఆర్టిస్టుల కంటే గొప్పగా కేటీఆర్ యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు.

News January 7, 2025

రేవంత్ నోట్ల కట్టలతో దొరికారు.. కేటీఆర్ HYD బ్రాండ్ పెంచారు: హరీశ్

image

TG: గతంలో రేవంత్ అరెస్టుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఆయన కేటీఆర్‌పై ఫోకస్ చేశారని భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా హరీశ్ స్పందించారు. ‘ఆ కేసుకు, దీనికి సంబంధం లేదు. లంచం ఇస్తూ రేవంత్ రెడ్ హ్యాండెడ్‌గా నోట్ల కట్టలతో దొరికారు. HYD బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ కృషి చేశారు. ఇక్కడ ఒక్క రూపాయి అవినీతి జరగలేదు’ అని పేర్కొన్నారు.