news

News October 30, 2024

ఈ పదాలకు అర్థం తెలుసా?

image

హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మార్కాపురం, అనంతపురం.. తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు చివర్లో ఇలా బాద్ లేదా పురం అని కనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆబాద్ అంటే నివాసం లేదా ఆహారం లభించే నివాసయోగ్యమైన స్థలమని అర్థం. వాటిని స్థాపించిన వారు లేదా ప్రముఖుల పేర్లకు చివర ఆబాద్ పేరిట ప్రాంతాలను పిలుస్తున్నాం. ఇక పురం అంటే పట్టణమని అర్థం. ఈ అర్థంలోనే కొన్ని ఊళ్ల చివర పురం అన్న పదాన్ని వాడటం ప్రారంభమైంది.

News October 29, 2024

పంత్ కాదు.. భారత్‌ని పూజారా కాపాడాడు: టిమ్ పెయిన్

image

2020-21లో తమ దేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత్‌ను కాపాడింది పూజారానేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ పేర్కొన్నారు. ‘ఆ సిరీస్ విజయంలో అందరూ పంత్ గురించే మాట్లాడతారు. నిజానికి భారత్‌ను గెలిపించింది పుజారా. మాకు అతడో గోడలా అడ్డం నిలబడిపోయాడు. బౌలర్లను విసిగించి, అలసిపోయేలా చేశాడు. బంతి తగిలి ఒళ్లు కమిలిపోతున్నా ఓ రాయిలా క్రీజులో పాతుకుపోయాడు’ అని కొనియాడారు.

News October 29, 2024

యశ్ ‘టాక్సిక్’ షూటింగ్ కోసం చెట్లు నరికివేత: క్లారిటీ

image

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం చెట్లు నరికివేస్తున్నట్లు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖాండ్రే ఆరోపించారు. దీనిపై శాండల్‌వుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. కాగా శాటిలైట్ చిత్రాలను చూస్తుంటే అక్కడ చెట్లు కొట్టేసిన ఆనవాళ్లేమీ కనిపించడం లేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మూవీ టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

News October 29, 2024

ఈ లిస్ట్‌లో మీ మండలం ఉందా?

image

AP: ఖరీఫ్ సీజన్‌లో 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 తీవ్ర కరవు, మరో 27 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించింది. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. ఈ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పింది. పైనున్న ఇమేజ్‌లో మీ మండలం ఉందా?

News October 29, 2024

పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ

image

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, దీపావళి భద్రతా ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించేందుకు హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని 185 ఫైర్ స్టేషన్ల సిబ్బంది ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటారు. బాణసంచా అక్రమ తయారీపై 100 లేదా 101కు ఫోన్ చేసి పోలీస్, అగ్నిమాపకశాఖలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

News October 29, 2024

అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం: చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి ANR జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో నిన్న ఘనంగా జరిగిన ఈ వేడుకకు నాగార్జున, చిరంజీవి కుటుంబాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా నాగార్జున, అఖిల్, నాగచైతన్యతో కలిసి తాను, రామ్‌చరణ్ దిగిన ఫొటోను చిరు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం అని క్యాప్షన్ ఇచ్చారు. ఒకే ఫ్రేమ్‌లో బ్లాక్ సూట్‌లో స్టార్‌లు మెరిసిపోతున్న ఈ ఫొటో వైరలవుతోంది.

News October 29, 2024

షమీకి గుజరాత్ టైటాన్స్ ఝలక్?

image

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పేసర్ మహ్మద్ షమీని వదిలేయాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఏడాదికిపైగా ఆయన ఆటకు దూరం కావడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రషీద్ ఖాన్, సాయి సుదర్శన్‌, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌‌‌లను అట్టి పెట్టుకుంటుందని టాక్.

News October 29, 2024

వెంకటేశ్-అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఇదేనా..?

image

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి హిట్స్ తర్వాత మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా టైటిల్‌ని మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ‘ఇక్కడ ఇల్లాలు అక్కడ ప్రియురాలు’, ‘ఇంట్లో ఇల్లాలు-పోలీస్ స్టేషన్లో ప్రియురాలు’ అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

News October 29, 2024

ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్‌సైట్‌లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

News October 29, 2024

గేమ్‌ఛేంజర్ హిందీ రైట్స్ ఎవరికంటే..

image

పాన్ ఇండియా మూవీగా రానున్న రామ్ చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ హిందీ హక్కుల్ని అనిల్ తడానీకి చెందిన AA Films దక్కించుకుంది. మూవీ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. ఇదే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ హక్కుల్ని కూడా కొనుగోలు చేయడం గమనార్హం. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.