India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలోని పాఠశాలలకు రేపు లాస్ట్ వర్కింగ్ డే. ఎల్లుండి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టితో సమ్మెటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు ముగియనున్నాయి. మంగళవారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి, ఆన్‌లైన్ ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. ఇక బుధవారం నుంచి జూన్ 11 వరకు 49 రోజులపాటు విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న బడులు తిరిగి తెరుచుకుంటాయి.
ఎన్నికల వేళ RBI కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్ద మొత్తంలో నగదు లేదా అనుమానాస్పద లావాదేవీల వివరాలివ్వాలని బ్యాంకుయేతర చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరినీ ఆదేశించింది. ఎన్నికల్లో అభ్యర్థులకు నగదు చేర్చేందుకు ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలను ఉపయోగించే అవకాశముందని పేర్కొంది. రూపే వంటి కార్డ్ నెట్వర్క్, రోజర్ పే, పేయూ, ఎంస్వైప్, ఇన్ఫీబీమ్, పేటీఎం, మొబీక్విక్, గూగుల్ పే, ఫోన్ పే వంటివి ఇందులో ఉన్నాయి.
TG: రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో అదే తరహాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. అతి వేగం ధాటికి ఆ కారు లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మునగాల మండలం ముకుందాపురం వద్ద ఈ ఘటన జరిగింది.
చింత చిగురు ధర మటన్‌తో పోటీ పడుతోంది. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం రైతుబజార్‌లో కేజీ చింత చిగురు ధర రికార్డు స్థాయిలో రూ.700 పలికింది. గుడిమల్కాపుర్ రిటైల్ మార్కెట్లో రూ.500-600 విక్రయించారు. ఏటా సీజన్‌లోనే లభించడం, కోయడం కష్టంతో కూడుకున్న పని కావడంతో రైతులు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.
ఎన్నికల వేళ ‘EVM మొరాయిస్తే’ అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఓటింగ్ జరుగుతుండగా ఈవీఎం అకస్మాత్తుగా పని చేయకపోతే వెంటనే కొత్త బ్యాలెట్ యూనిట్‌ను అక్కడికి పంపిస్తారు. అప్పటివరకు నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్‌లోనూ నమోదై ఉంటాయి. అలాగే వీవీ ప్యాట్ స్లిప్పులూ అందుబాటులో ఉంటాయి. కౌంటింగ్ రోజున అన్ని EVMలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. బ్యాటరీ సాయంతో నడిచే EVMలను విద్యుత్ లేని ప్రాంతాల్లోనూ వినియోగించొచ్చు.
<<-se>>#ELECTIONS2024<<>>
AP: హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్ క్లాసులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇటీవల విడుదలైన ఇంటల్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 1262(27.79%) మంది, సెకండ్ ఇయర్‌లో 690(37.09%) మంది విద్యార్థులే పాసయ్యారు. వీరు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించనున్నారు. జూన్ 1 వరకు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు క్లాసులు జరుగుతాయి.
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం నామినేషన్ సమర్పిస్తారు. మరోవైపు రేపు ఉత్తరాంధ్రలో, ఎల్లుండి రాయలసీమలో పవన్, చంద్రబాబు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లో అమానుష ఘటన జరిగింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మరణించింది. సీసీ కెమెరాలను పరిశీలించగా.. సదరు మహిళతో మాట్లాడిన వారిద్దరు, అనంతరం ఆమెను బలవంతంగా స్థానిక దుకాణం సెల్లార్‌లోకి లాక్కెళ్లినట్లుగా తేలింది. ఆ సమయంలోనే మహిళను రేప్ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది.
IPL: నిన్న KKRతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫుల్ టాస్ బంతికి ఔట్ కావడం ఐపీఎల్ రూల్స్ ప్రకారం కరెక్టేనని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. బంతి విరాట్ నడుము కంటే ఎక్కువ హైట్ వచ్చింది నిజమేనని, అయితే కోహ్లీ క్రీజ్ దాటడంతో అతడిని ఔట్‌గా ప్రకటించారని పేర్కొంది. కోహ్లీ క్రీజ్ దాటి ఉండకపోతే బంతి నడుము కంటే తక్కువ ఎత్తుకు వచ్చేదని తెలిపింది. అయితే అది నోబాల్‌గా ప్రకటించకపోవడంతో విరాట్ అంపైర్లపై కోప్పడ్డారు.
దేశవ్యాప్తంగా IIITలు, NITలలో ప్రవేశాలకు నిర్వహించిన JEE మెయిన్-2 ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది హాజరయ్యారు. jeemain.nta.ac.in లేదా ntaresults.nic.in వెబ్‌సైట్‌లో స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్హత సాధించిన 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఇస్తారు.
Sorry, no posts matched your criteria.