news

News April 20, 2024

కేసీఆర్ కోటరీ వల్లే పార్టీకి ఈ దుస్థితి: గుత్తా

image

TG: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. దీంతో నేతలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్ల తన కుమారుడు పోటీకి దూరంగా ఉన్నారని తెలిపారు. తనకు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేదన్నారు.

News April 20, 2024

జూబ్లీహిల్స్ ప్రమాదం.. SI సస్పెండ్

image

2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో SI సస్పెండ్ అయ్యారు. బోధన్ మాజీ MLA షకీల్ తనయుడు రాహిల్‌‌ కారు ఢీకొట్టగా ఓ చిన్నారి మృతి చెందింది. అయితే ఈ కేసు నుంచి రాహిల్‌ను తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో అప్పుడు జూబ్లీహిల్స్ SIగా ఉన్న చంద్రశేఖర్‌ను తాజాగా కమిషనర్ శ్రీనివాస‌రెడ్డి సస్పెండ్ చేశారు.

News April 20, 2024

నేతలకు భద్రత కట్టుదిట్టం

image

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రాజకీయ నాయకులకు పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతలు ముందుగా తమకు సమాచారం అందించాలని, భద్రతతోనే క్యాంపెయినింగ్ నిర్వహించాలని నేతలకు స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

News April 20, 2024

ఫిష్ మసాలా‌లో పురుగు మందు?

image

ఎవరెస్ట్ ఫిష్ మసాలాలో పురుగు మందు ఆనవాళ్లు ఉన్నట్లు సింగపూర్ ఆరోపించింది. అందులో ఇథలిన్ ఆక్సైడ్ ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటికే ఫిష్‌ మసాలా కొన్నవారు వాటిని వినియోగించవద్దని, వాడుతున్న వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆ దేశ ఫుడ్ ఏజెన్సీ సూచించింది. ఈ ఆరోపణలపై ఎవరెస్ట్ ఇప్పటి వరకు స్పందించలేదు.

News April 20, 2024

పాకిస్తాన్‌లో భారీ వర్షాలు.. 87 మంది మృతి

image

పాకిస్థాన్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా ఘటనల్లో 87 మంది మరణించినట్లు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. మరో 80 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వర్షాలతో 2,715 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిపింది. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టంపై పాక్ ప్రధాని షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.

News April 20, 2024

వారికి ఒకరోజు సెలవు ప్రకటించాలి: ఉద్యోగ సంఘాలు

image

AP: ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మే మొదటి వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఉద్యోగ సంఘాలు కోరాయి. సిబ్బందిని పోలింగ్ కేంద్రాల వద్దకు ముందురోజు మధ్యాహ్నం చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. పోస్టల్ బ్యాలెట్ నమోదు, జారీ ప్రక్రియపై కొంత మంది అధికారుల్లో అనుమానాలను తొలగించాలని కోరాయి.

News April 20, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

image

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా.. 27,788 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

News April 20, 2024

లాయర్లు గౌను ధరించాల్సిన అవసరం లేదు: HC

image

కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో.. వేసవి ముగిసే వరకు లాయర్లు గౌను ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వడగాడ్పులు, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. వేసవి ముగిసిన వెంటనే గౌను ధరించాల్సి ఉంటుంది.

News April 20, 2024

IPL: ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్

image

IPL చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్ పడింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. నిర్ణీత సమయానికి బౌలింగ్ వేయకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లకు BCCI రూ.12లక్షల చొప్పున ఫైన్ విధించింది. LSG కెప్టెన్‌గా KL.రాహుల్, CSK కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో CSKపై 8 వికెట్ల తేడాతో LSG గెలిచింది.

News April 20, 2024

నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ బస్సు యాత్ర

image

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి నుంచి అనకాపల్లి నియోజకవర్గం మీదుగా పెందుర్తి చేరుకోనున్నారు. సా.3.30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ ఉండనుంది.