news

News April 19, 2024

ఐదేళ్లలో ఎన్నోసార్లు అబార్షన్: కిరణ్ రావు

image

పెళ్లైన తొలి ఐదేళ్లలో తనకు ఎన్నో సార్లు గర్భస్రావమైందని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య, దర్శకనిర్మాత కిరణ్ రావు తెలిపారు. ‘అప్పట్లో పిల్లలు కావాలని చాలా ప్రయత్నించా. కానీ అబార్షన్ల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. పిల్లలను పొందడం ఇంత కష్టమా అని అప్పుడు అనిపించింది’ అని ఆమె చెప్పారు. కాగా ఆమిర్-కిరణ్‌కు ఐవీఎఫ్-సరోగసి పద్ధతి ద్వారా 2011లో ఆజాద్ అనే కుమారుడు జన్మించారు.

News April 19, 2024

లైంగిక జీవితానికి ముప్పుగా ఉప్పు?

image

ఉప్పు అధికంగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. దీనిని తినడం వల్ల రక్తనాళాలపై అధిక ఒత్తిడి పడి హైపర్ టెన్షన్, బీపీ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలతో బాధపడేవారు లైంగిక చర్యలో సరిగ్గా పాల్గొనలేరు. దీనిని అధికంగా తినడం వల్ల స్త్రీలలో కూడా లైంగిక కోరికలు తగ్గుతున్నట్లు వెల్లడైంది. అధికంగా తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.

News April 19, 2024

YELLOW ALERT: మూడు రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రంలో అక్కడక్కడా భారీ <<13084833>>వర్షాలు<<>> కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు మోస్తరు వానలు కొనసాగుతాయని IMD వెల్లడించింది. వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News April 19, 2024

వేసవి రద్దీ.. రైల్వే 9,111 అదనపు ట్రిప్పులు

image

వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. గత ఏడాది 6,369 అదనపు ట్రిప్పులు నడపగా, ఈసారి ఆ సంఖ్యను 9,111కు పెంచినట్లు పేర్కొంది. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంది. పశ్చిమ రైల్వే అత్యధికంగా 1,878 ట్రిప్పులు, దక్షిణ మధ్య రైల్వే 1,012 ట్రిప్పులు నడపనుంది.

News April 19, 2024

‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్.. రిలీజ్ ఎప్పుడంటే?

image

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘ప్రేమలు’ చిత్రానికి త్వరలో సీక్వెల్ రూపొందనుంది. 2025లో ప్రేమలు-2ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించిన ‘ప్రేమలు’ మూవీలో నస్లేన్ కె.గఫూర్, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. రూ.3కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మలయాళ మూవీ రూ.85కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తెలుగులోనూ విడుదలై ఆకట్టుకుంది.

News April 19, 2024

రేవంత్ బీజేపీ ఏజెంట్: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మైనారిటీకీ కూడా మంత్రి పదవి ఇవ్వలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘మంత్రి పదవి ఇచ్చేందుకు ఒక్క మైనారిటీ నాయకుడు కూడా మీకు కనిపించలేదా? మైనారిటీలపై కాంగ్రెస్ ప్రేమ ఇదేనా? తెలంగాణలో మైనారిటీ మంత్రి లేకుండా ప్రభుత్వం నడవడం ఇదే తొలిసారి. రేవంత్ బీజేపీ ఏజెంట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేశాయి’ అని ఆయన ఆరోపించారు.

News April 19, 2024

FB, ఇన్‌స్టా, వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్

image

FB మాతృసంస్థ మెటా AI రంగంలోకి అడుగుపెట్టింది. FB, మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాలో దీన్ని ప్రవేశపెట్టింది. దీని సాయంతో రియల్ టైమ్ ఇమేజ్‌లను రూపొందించి ఇతరులకు పంపొచ్చు. మనం టెక్ట్స్ రూపంలో ఇచ్చే సూచనల ఆధారంగా క్వాలిటీ ఫొటోలు జనరేట్ అవుతాయి. AI చాట్‌బాట్‌లో ఏ ప్రశ్నకైనా ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ IND సహా పలు దేశాల్లో కొందరికి అందుబాటులోకి వచ్చిందని, త్వరలో అందరూ వాడుకోవచ్చని సంస్థ తెలిపింది.

News April 19, 2024

భారీ వర్షం.. 4KM ట్రాఫిక్ జామ్

image

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై నాలుగు చోట్ల చెట్లు కూలిపోయాయి. మహేశ్వరం మండలం తుమ్మలూరు-కందుకూరు రోడ్డుపై నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చెట్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

News April 19, 2024

కౌన్ బనేగా బాపట్ల బాస్!

image

AP: బాపట్ల MP స్థానంలో ఎందరో రాజకీయ ప్రముఖులు పోటీ చేసి గెలుపొందారు. 1998లో మాజీ CM నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందీశ్వరి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి రామానాయుడు వంటి ప్రముఖులు గెలిచారు. ప్రస్తుతం SC రిజర్వుడ్‌ అయిన ఈ సెగ్మెంట్‌లో మరోసారి నందిగం సురేశ్‌ని YCP బరిలో దింపింది. మాజీ IPS అధికారి టి.కృష్ణప్రసాద్‌ను TDP పోటీలో నిలిపింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 19, 2024

చంద్రబాబు ఆస్తులు ఎంతంటే?

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆమె తమ ఆస్తులను ప్రకటించారు. ఇద్దరికీ కలిపి రూ.931 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇది 2019 ఎన్నికల నాటి ఆస్తులతో పోలిస్తే 39 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. రూ.3 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.