news

News April 19, 2024

100 రోజుల్లో రుణ మాఫీ చేస్తామనలేదు: భట్టి

image

TG: మేడిగడ్డకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించారని, అది కూలిపోతే వాస్తవాలు ప్రజలకు తెలియకూడదా? అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రుణమాఫీపై స్పందిస్తూ.. ‘మేం 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పలేదు. కానీ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కరెంటు కోతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు.

News April 19, 2024

మహేశ్ బాబు కొత్త లుక్

image

‘SSMB29’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా ఉన్న మహేశ్ బాబు, రాజమౌళి దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కొత్త లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. లాంగ్ హెయిర్‌తో టోపీ, కళ్లద్దాలు ధరించి ఉన్న మహేశ్ బాబును చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘సినిమా సిట్టింగ్స్ పూర్తయినట్లున్నాయి. ఇక షూటింగ్ మొదలవ్వడమే తరువాయి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

News April 19, 2024

కడియం.. నీ అంతు చూస్తా: రాజయ్య

image

TG: స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య తాజాగా సవాలు విసిరారు. ‘కడియం.. నాకు నమ్మక ద్రోహం చేసిన నీ అంతు చూస్తా. నిన్ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం. రాజీనామా చేసి రా. ఇద్దరం పోటీ చేసి తేల్చుకుందాం. సీఎం రేవంత్ అభయ హస్తం అంటుంటారు కానీ కడియం లాంటి భస్మాసురుడు ఆయన పక్కన చేరారు. కడియం శ్రీహరి ఓ దళిత ద్రోహి, ఖల్‌నాయక్’ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

News April 19, 2024

ప్రచారం చేయకుండా కేసులు పెడుతున్నారు: సునీత

image

AP: వైఎస్ వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని వైఎస్ సునీత తెలిపారు. న్యాయం కోసం ప్రజాతీర్పు కోరుతుంటే వైసీపీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. ‘పులివెందులలో నేను ప్రచారం చేయకుండా కేసులు పెడుతున్నారు. మీ వద్దకు రాలేకపోతే మన్నించండి. షర్మిలను కడప ఎంపీగా గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదే’ అని పేర్కొన్నారు.

News April 19, 2024

నీకు దమ్ముంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు: CM

image

TG: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘కేసీఆర్ నీకు దమ్ముంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు. నేను హైటెన్షన్ వైర్ లాంటి వాడిని. ముట్టుకుంటే షాక్ కొడుతుంది. మనల్ని దెబ్బ తీయాలని బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. రైతులు వలస పోతుంటే పట్టించుకోని మీరు ఓట్లు ఎలా అడుగుతారు?’ అని ప్రశ్నించారు.

News April 19, 2024

ఓటింగ్ శాతం @1pm

image

★ అరుణాచల్‌ప్రదేశ్: 38.73%
★ అస్సాం: 45.12%
★ బిహార్: 32.41
★ ఛత్తీస్‌గఢ్: 42.57
★ మధ్యప్రదేశ్: 44.43
★ మణిపుర్: 46.92
★ రాజస్థాన్: 33.73
★ తమిళనాడు: 39.51
★ పశ్చిమబెంగాల్: 50.96
★ మహారాష్ట్ర: 32.36

News April 19, 2024

ఏప్రిల్ 23న సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న సెలవు ప్రకటించాలని తెలంగాణ విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు డిమాండ్ చేశారు. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి అని గుర్తు చేశారు. ఆరోజు గౌలిగూడ శ్రీరామ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు భారీ ర్యాలీ చేస్తామని, ఈ నేపథ్యంలో అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరారు.

News April 19, 2024

హ్యాపీ బర్త్‌డే అమ్మ!: జగన్

image

ఏపీ సీఎం జగన్, పీసీసీ చీఫ్ షర్మిల తమ తల్లి విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే అమ్మ! అని జగన్ ట్వీట్ చేశారు. ‘చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ’ అని షర్మిల పోస్ట్ చేశారు.

News April 19, 2024

FLASH: తిరుమలలో అగ్ని ప్రమాదం

image

AP: తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. పార్వేట మండపం, శ్రీగంధం వనం ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంది. వన్యప్రాణులు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. భారీ ఎండల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

News April 19, 2024

స్నేహితురాలితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్

image

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లే గార్డ్‌నర్ తన స్నేహితురాలు మోనికా రైట్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను యాష్లే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2017 నుంచి వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. యాష్లే ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.