news

News April 19, 2024

YCP అభ్యర్థికి ఇంటిపోరు.. భర్తపై భార్య పోటీ?

image

AP: టెక్కలిలో రెబల్‌గా పోటీ చేస్తానని YCP అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అనుచరులకు చెప్పిన ఆడియో వైరలవుతోంది. ఈనెల 22న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది. YCP టెక్కలి ఇన్‌ఛార్జ్‌గా అధిష్ఠానం వాణిని నియమించినా.. టికెట్ మాత్రం దువ్వాడకు కేటాయించింది. దీంతో అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు.

News April 19, 2024

కాంగ్రెస్ లక్ష్యం అదేనా..?

image

లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 100కు పైగా సీట్లు సాధించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లక్ష్యాన్ని దాటితే 2029 నాటికి మళ్లీ పుంజుకుంటామన్న ఉత్సాహం పార్టీ కేడర్‌లో వస్తుందని నేతలు అంటున్నారు. తమకు, మిత్రపక్షాలకు కలిపి సుమారు 230 వరకు సీట్లు దక్కితే బీజేపీని అడ్డుకునే సామర్థ్యం వస్తుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బలమున్న రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.

News April 19, 2024

కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. డిఫెన్స్ చీఫ్ మృతి

image

కెన్యాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లా(61) మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆయనతో పాటు మరో 11మంది ఉన్నారని, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఘటనపై దేశాధ్యక్షుడు విలియం రూటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. కెన్యాలో గత 12 నెలల్లో ఐదు సైనిక హెలికాప్టర్లు కుప్పకూలడం గమనార్హం.

News April 19, 2024

తొలి దశ ఎన్నికలు.. కొన్ని వివరాలు

image

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు/యూటీల్లోని 102 ఎంపీ స్థానాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 16.63 కోట్లమంది ఓటు వేయనున్నారు. వీరిలో 8.4 కోట్లమంది పురుషులు, 8.23 కోట్లమంది మహిళలు, తొలిసారి ఓటు వేసేవారు 35.67 లక్షలమంది ఉన్నారు. 20 నుంచి 29 ఏళ్ల వయసున్న వారి సంఖ్య 3.51 కోట్లుగా ఉంది. ఇక ఎన్నికల విధుల్లో 18 లక్షలమంది అధికారులు పాల్గొననున్నారు.

News April 19, 2024

ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నిక మొదలైంది

image

ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికగా అభివర్ణిస్తున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొదటి విడతగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7గంటలకు మొదలైంది. 102 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25తో పాటు జూన్ 1న మిగతా దశల్లో ఎన్నికలు జరుగుతాయి.

News April 19, 2024

ప్రతి ఓటు ముఖ్యమే: ప్రధాని మోదీ

image

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ‘ఇవాళ 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వచ్చినవారు తప్పకుండా అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలి. ప్రతి ఓటు, ప్రతి ఒక్కరి వాయిస్ ముఖ్యమే’ అని మోదీ ట్వీట్ చేశారు.

News April 19, 2024

ఇంటి నుంచే నామినేషన్ వేయొచ్చు

image

ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ మేరకు ‘సువిధ’ యాప్‌ తీసుకొచ్చింది. దీని ద్వారా ఓటు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంటి నుంచే నామినేషన్ వేయవచ్చు. ఆన్‌లైన్‌లో పత్రాలు సమర్పించిన తర్వాత ప్రింట్ తీసి.. మూడు సెట్లు జిల్లా అధికారికి అందించాలి.

News April 19, 2024

తొలి విడత పోలింగ్ ప్రారంభం

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 102 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఇవాళ 16.63 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

News April 19, 2024

స్వాగతం పలుకుతున్న పోలింగ్ స్టేషన్లు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు స్వాగతం పలికేందుకు సిబ్బంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, అందరూ వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని CEC రాజీవ్ కుమార్ కోరారు.

News April 19, 2024

30% చక్కెరను తగ్గించాం: నెస్లే

image

పిల్లలకు ఇచ్చే ఆహార ఉత్పత్తుల్లో 3గ్రాములు అదనంగా చక్కెర వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నెస్లే ఇండియా స్పందించింది. భారత్‌లో తయారు చేస్తున్నఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత 5ఏళ్లలో 30% తగ్గించినట్లు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, వెనకబడిన ఆఫ్రికా దేశాల్లో నెస్లే నుంచి వచ్చే బేబీ ప్రొడక్టుల్లో చక్కెర పర్సంటేజ్ ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి.