news

News April 17, 2024

దయచేసి వదంతుల్ని నమ్మకండి: నిర్మాత

image

తమ సినిమాలకు సంబంధించి వదంతుల్ని నమ్మొద్దని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పేర్కొన్నారు. ‘మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా అనౌన్స్ చేస్తాం. దయచేసి వదంతుల్ని నమ్మకండి’ అని ట్వీట్ చేశారు. అయితే, ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ థియేట్రికల్ రైట్స్‌ను ‘సితార’ సంస్థే కొనుగోలు చేసిందంటూ జరుగుతున్న ప్రచారం గురించే ఆయన స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.

News April 17, 2024

రెండు స్థానాల్లో నవీన్ పట్నాయక్ పోటీ

image

బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. 2019లోనూ ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా ఈ రాష్ట్రంలో 147 నియోజకవర్గాలకు గాను నాలుగు దశల్లో(మే 13, 20, 25, జూన్1 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.

News April 17, 2024

IPL: ఒక్క టికెట్ రూ.52,938

image

IPL మ్యాచ్ టికెట్ల ధర బెంగళూరులోనే అత్యధికంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో కనిష్ఠ ధర రూ.2,300 కాగా గరిష్ఠ ధర రూ.52,938. లక్నో, గుజరాత్‌లో కనిష్ఠ టికెట్ ధర రూ.499 మాత్రమే. ఇక హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో కనిష్ఠ ధర రూ.750 కాగా గరిష్ఠ ధర రూ.30,000. అయితే టికెట్ల ధర ఎంతున్నా ఆన్‌లైన్‌లోకి రాకముందే బ్లాక్‌ మార్కెట్లోకి వెళ్తున్నాయన్న విమర్శ ఉంది. టికెట్ల అమ్మకాన్ని పేటీఎం చేపడుతున్న సంగ‌తి తెలిసిందే.

News April 17, 2024

ప్రియురాలితో కిమ్‌!

image

ఉ.కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ గురించి ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అతడికి రహస్య ప్రేమికురాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ఎవరో కాదు.. కిమ్ సెక్రటేరియట్‌లో పనిచేసే హ్యోన్ సాంగ్ వోల్. గత వారం ప్యాంగ్యాంగ్‌లో కిమ్‌తో ఆమె కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా కుమారుడు కూడా జన్మించినట్లు ద.కొరియా అధికారి చెప్పారు. అతడికి కిమ్ ఇల్ బాంగ్ అనే పేరు పెట్టారట.

News April 17, 2024

గుడ్ న్యూస్.. 24 గంటల్లోనే ఆవకాయ డెలివరీ!

image

తెలంగాణ ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ పచ్చళ్ల సరఫరాకు ముందుకొచ్చింది. కార్గో సేవల్లో భాగంగా అమ్మమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడిని వారి కుటుంబీకులకు సురక్షితంగా చేరవేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా 24 గంటల్లో డెలివరీ చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

News April 17, 2024

ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 19న 21 రాష్ట్రాల్లోని 102 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. తొలి విడతలో అస్సాం, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.

News April 17, 2024

‘ఆఫ్ట్రాల్ రూ.5 కాదు సర్’

image

బెంగళూరులోని BMTC బస్సు కండక్టర్ తనకు రూ.5 చిల్లర ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్‌తో ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది తీవ్ర చర్చకు దారి తీసింది. తామూ బాధితులమేనని పలువురు కామెంట్స్ చేశారు. డ్యూటీ ఎక్కగానే కండక్టర్లకు సరిపడా చిల్లర ఇవ్వాలని కొందరు యాజమాన్యానికి సూచించారు. డిజిటల్ పేమెంట్స్ సదుపాయం కల్పిస్తే ఈ ‘చిల్లర’ గొడవలు ఉండవని మరికొందరు అన్నారు. ₹5 అయినా ఆఫ్ట్రాల్ అనకూడదని అంటున్నారు.

News April 17, 2024

మణిపూర్.. ఎన్నికల సందడే లేదు!

image

దేశమంతా ఎన్నికల ప్రచారంతో హోరెత్తినా మణిపూర్‌లో మాత్రం మైకులు మూగబోయాయి. రోడ్ షోలు, బహిరంగ సభల ఊసే లేదు. చడీ చప్పుడు లేకుండా అక్కడ 19, 26వ తేదీన రెండు MP స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కుకీ, మైతేయి వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలే ఇందుకు కారణం. భద్రత దృష్ట్యా పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. స్థానికంగా చిన్న చిన్న సమావేశాలు, ఇంటింటి ప్రచారంతో అభ్యర్థులు సరిపెట్టారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 17, 2024

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు

image

ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇవాళ ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీనొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోయారు. దీంతో అలీఖాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

News April 17, 2024

ఎల్లుండి చంద్రబాబు నామినేషన్

image

AP: ఈ నెల 19న కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు నారా లోకేశ్ మంగళగిరిలో రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ సమర్పించనున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందీశ్వరి ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు.