news

News April 17, 2024

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది.. చూశారా?

image

వాట్సాప్‌ కొత్తగా చాట్ ఫిల్టర్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో మెసేజ్లను వేర్వేరుగా చూడవచ్చు. వాట్సాప్‌లో పైన All, Unread, Groups అనే మూడు సెక్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సంబంధిత మెసేజ్లు చూసుకోవచ్చు. Allపై నొక్కితే.. అన్ని చాట్స్ కలిసి ఒకేచోట కనిపిస్తాయి. Unreadపై నొక్కితే.. చదవకుండా వదిలేసిన మెసేజ్‌లు కనిపిస్తాయి. గ్రూప్స్ అంటే కేవలం గ్రూప్స్ చాట్స్ మాత్రమే చూడవచ్చు.

News April 17, 2024

ఫ్యామిలీకి తెలియకుండా పరీక్ష రాసి.. 4వ ర్యాంక్

image

నిన్న ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో విజేతలుగా నిలిచిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. అయితే.. కేరళకు చెందిన UPSC 4వ ర్యాంకర్ సిద్ధార్థ్ రామ్‌కుమార్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే.. ఆయన పరీక్ష రాసిన విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదట. టీవీలో చూశాకే తమకు తెలిసిందని తన పేరెంట్స్ చెప్పారు. గతంలోనే IPSకు ఎంపికైన సిద్ధార్థ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు.

News April 17, 2024

ఫేక్ వీడియోపై స్టార్ హీరో కేసు

image

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తనకు సంబంధించిన ఓ ఫేక్ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలో ఆమిర్ ఓ పొలిటికల్ పార్టీకి మద్దతిస్తున్నట్లుగా ఉంది. దీంతో స్పందించిన ఆమిర్.. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని స్పష్టం చేశారు. ఆయన ఫిర్యాదుతో సదరు వీడియో క్రియేటర్‌పై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు FIR నమోదు చేశారు.

News April 17, 2024

మూక దాడులకు కుల, మతాలను అంటగట్టొద్దు: SC

image

మూక దాడులు జరిగినప్పుడు వాటికి కుల, మతాలు అంటగట్టవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా మైనారిటీలపై మూక దాడులు జరుగుతున్నాయని దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా స్పందించింది. రాజస్థాన్‌లోని టైలర్ కన్నయ్య లాల్ హత్యను ఉదహరిస్తూ ఇలాంటి సందర్భాల్లో కులం, మతం గురించి మాట్లాడవద్దని సూచించింది.

News April 17, 2024

కోహ్లీ నా ఇన్‌స్పిరేషన్: సివిల్స్ ఆలిండియా 3వ ర్యాంకర్

image

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించిన తెలంగాణ యువతి అనన్య రెడ్డి.. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్పిరేషన్ అని తెలిపారు. ‘ఆయన నా ఫేవరెట్ ప్లేయర్. ఎప్పుడూ వెనకడుగు వేయొద్దనే కోహ్లీ ఆటిట్యూడ్ అంటే నాకిష్టం. చేసే పనిలో ఫలితం ఎలా వచ్చినా నిరంతరం కష్టపడుతూనే ఉండాలన్న విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా’ అని అనన్య వెల్లడించారు.

News April 17, 2024

తెలంగాణ ఖ్యాతిని చాటారు.. అభినందనలు: KTR

image

TG: సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు KTR శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటిన అనన్యకు ప్రత్యేక అభినందనలు. వరుసగా 2వ సారి తెలంగాణ బిడ్డకు 3వ ర్యాంక్ రావడం, సివిల్స్‌కు 60 మంది తెలుగువారు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. ఎంపికైన వారు పూర్తి శక్తి సామర్థ్యాలతో దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News April 17, 2024

T20WC: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ!

image

టీ20 వరల్డ్ కప్ సమీపిస్తుండటంతో బీసీసీఐ జట్టు కూర్పుపై దృష్టి సారించింది. బ్యాటింగ్ ద్వయం రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనర్లుగా పంపించడంపై ఆలోచనలు చేస్తోందట. ఐపీఎల్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంపైనే హార్దిక్ పాండ్య ఎంపిక ఆధారపడి ఉందని, గిల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఉంచాలని యోచిస్తోంది. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే.. రాజస్థాన్ రాయల్స్ సెన్సేషన్ రియాన్ పరాగ్‌ను WCకి ఎంపిక చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.

News April 17, 2024

‘రాబిన్‌హుడ్’ రిలీజ్ ఎప్పుడంటే?

image

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. శ్రీరామనవమి పర్వదినాన మూవీ యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

News April 17, 2024

ఎన్నికలు పూర్తయ్యాక హామీలు నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి

image

TG: లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక మిగిలిన హామీలను నెరవేరుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎలక్షన్ కోడ్ వల్ల రైతు బంధు, రుణమాఫీ ఇవ్వలేకపోయామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని.. దమ్ముంటే కాంగ్రెస్‌ను టచ్ చేయమని సవాల్ విసిరారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందన్నారు.

News April 17, 2024

సీఐ అవమానం.. సివిల్స్ కొట్టేలా చేసింది

image

ఉద్యోగంలో జరిగిన అవమానం <<13067940>>ఉదయ్<<>> కృష్ణారెడ్డిని సివిల్స్ ర్యాంక్ సాధించేలా ప్రేరేపించింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతడు డిగ్రీ చదువుతుండగానే 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు, రామాయపట్నం స్టేషన్‌లలో విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ సీఐ అవమానించడంతో 2019లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత సివిల్స్‌‌కు సన్నద్ధమై తాజా ఫలితాల్లో 780వ ర్యాంకుతో మెరిశారు.