news

News April 17, 2024

తాటి ముంజలతో ప్రయోజనాలేంటి?

image

వేసవిలో లభించే తాటి ముంజల్లో విటమిన్ బి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుకు విరుగుడుగా, క్యాన్సర్ నిరోధకంగానూ ఇవి పని చేస్తాయని అంటున్నారు. ముఖంపై రాసుకుంటే మచ్చలు సైతం తగ్గుతాయట. లేత తాటి ముంజలు తింటే వేసవిలో ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. గర్భిణులకు, పిల్లలకు మంచిదట. సాధారణంగా బయట డజన్ ముంజలు సుమారు రూ.100 పలుకుతోంది. మరి మీ దగ్గర తాటి ముంజలు దొరుకుతున్నాయా? ధర ఎంతో కామెంట్ చేయండి.

News April 17, 2024

హాల్‌టికెట్లు విడుదల

image

AP: పాలిసెట్-2024 హాల్‌టికెట్లను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 27న జరిగే పాలిసెట్ పరీక్ష కోసం లక్ష మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ టెన్త్ హాల్‌టికెట్/మొబైల్ నంబర్, టెన్త్ పాసైన/ పూర్తి చేసిన సంవత్సరం వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News April 17, 2024

మూడు రోజులు తేలికపాటి వర్షాలు

image

ఎండలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు శుభవార్త. ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అదే సమయంలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 17, 2024

22న ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

image

AP: ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ నెల 22న సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. ‘బుధవారం నుంచి ఈ నెల 26వరకు శ్రీరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నేటి ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న రాములోరి కల్యాణాన్ని లక్ష మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశాం. 23న రథోత్సవం నిర్వహిస్తాం’ అని టీటీడీ పేర్కొంది.

News April 17, 2024

మూడు నెలల్లో BRS ఖాళీ అవుతుంది: కోమటిరెడ్డి

image

TG: మరో మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాము గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఒక్కరు కూడా మిగలరని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన రేవంత్‌ను సీఎంగా చూడలేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కోమటిరెడ్డి విమర్శించారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు.

News April 17, 2024

DANGER: రసీదులను తాకుతున్నారా?

image

కెమికల్స్‌తో ప్రింటైన రిసిప్టులను చేతితో తాకడం, నోట్లో పెట్టుకోవడం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. రసీదుకు వాడే పేపర్‌ను థర్మల్ పేపర్ అంటారు. దీని తయారీలో ప్రమాదకరమైన కెమికల్స్ బిస్ ఫినాల్ ఏ, బిస్ ఫినాల్ ఎస్ వాడుతారు. ఇవి నోట్లోకి వెళితే మనిషిలోని హార్మోన్ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తాయట. ఈ కారణంగానే కొన్ని కంపెనీలు BPA రహితంగా మారుతున్నాయి. మాల్స్‌లో డిజిటల్ రిసిప్ట్‌ అడగాలని సూచిస్తున్నారు.

News April 17, 2024

రైతులకు నేరుగా రుణాలివ్వం: నాబార్డ్

image

తాము రైతులకు నేరుగా రుణాలు ఇవ్వబోమని నాబార్డ్ స్పష్టం చేసింది. గ్రామీణాభివద్ధికి తోడ్పాటు అందించే వివిధ రుణ సంస్థలు, సహకార సంఘాలకు రుణ సాయం చేస్తామని వెల్లడించింది. ఆయా సంస్థల నుంచి రైతులు రుణాలు తీసుకోవచ్చని తెలిపింది. రైతులకు నాబార్డ్ నేరుగా రుణాలు ఇస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. సరైన సమాచారం కోసం నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

News April 17, 2024

పట్టువదలని విక్రమార్కుడు

image

సివిల్స్ సాధించాలని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న కునాల్ ఆర్ విరుల్కర్‌ అనే యువకుడిని తాజా ఫలితాలు నిరాశకు గురిచేశాయి. ‘12సార్లు పరీక్ష రాశా. 7సార్లు మెయిన్స్‌, 5సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఎంపిక కాలేదు. బహుశా పోరాటం అనేది జీవితానికి మారు పేరు కావొచ్చు’ అని అతడు ట్వీట్ చేశారు. ‘మన వైఫల్యాన్ని ఇతరులకు చెప్పాలంటే ధైర్యం కావాలి. మీరు గ్రేట్’ అంటూ నెటిజన్లు అతణ్ని ప్రశంసిస్తున్నారు.

News April 17, 2024

బిగ్ బీకి అరుదైన పురస్కారం

image

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ విషయాన్ని మంగేష్కర్ కుటుంబం ప్రకటించింది. ఈ నెల 24 లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతిన పురస్కారాన్ని అందజేయనున్నారు. 2022 ఫిబ్రవరి 6న మరణించిన సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ప్రారంభించారు. 2022లో ప్రధాని మోదీ, 2023లో ఆశా భోస్లే ఈ అవార్డును అందుకున్నారు.

News April 17, 2024

‘డాక్సింగ్’ చేస్తున్నారా? అరెస్ట్ కావొచ్చు!

image

ఒకరి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో బహిర్గతం చేయడమే డాక్సింగ్. ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామా, ఫొటోలు వంటివి షేర్ చేయడం అన్నమాట. దీన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం లేకపోయినా వివిధ సెక్షన్ల కింద అరెస్టయ్యే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి అప్పటికే సోషల్ మీడియాలో వెల్లడించిన విషయాలను షేర్ చేస్తే అది డాక్సింగ్ కిందకి రాదు. డాక్సింగ్‌కు గురైతే బాధితులు పోలీసులను సంప్రదించాలి.