India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రభుత్వ స్కూలు, కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి సివిల్ ర్యాంకర్‌గా నిలిచారు. సింగరాయకొండ(మ) ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్‌కృష్ణారెడ్డి చిన్నప్పుడే పేరెంట్స్‌ను కోల్పోయారు. కూరగాయలు అమ్మి తనను చదివించిన నానమ్మ త్యాగం, కష్టాన్ని స్మరించుకుంటూ 780వ ర్యాంక్ సాధించారు. CI అవమానించడంతో 2019లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, సివిల్స్ వైపు మళ్లారు. 4వ ప్రయత్నంలో ఈ ర్యాంక్ సాధించారు.
తరాలుగా మాట్లాడుకుంటున్నా ‘రామరాజ్యం’ సాకారం కావడం లేదు. రాముడి గుణాలు మన పాలకుల్లో లేవు. ఆ రాముడు శత్రువుని సైతం గౌరవించేవాడు. కానీ మన పాలకులు ప్రత్యర్థులను బూతులు తిట్టేందుకు పోటీపడుతున్నారు. ఆయన రాజ్యంలో ప్రశాంతత కోరుకునేవాడు. మరి మన లీడర్లు.. స్వలాభం కోసం గొడవలు, హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నారు. ఆ రాముడు మాటకు కట్టుబడే వాడు. కానీ.. నేటి నేతలు మాట మార్చడంలో ముందుంటున్నారు.
AP: సీఎం జగన్ నుదుటికి చిన్న దెబ్బ తగిలితే తెగ హడావిడి చేశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ‘ఎవరో విసిరిన ఓ గులకరాయి జగన్‌కు, వెల్లంపల్లికి ఒకేసారి ఎలా తగిలింది? చిన్న గాటుకి 16మంది డాక్టర్లు, 26మంది నర్సుల బృందంతో కట్టు కట్టించుకోవాల్సిన అవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. వివేకా హత్యలో జగన్, భారతి ప్రమేయం కచ్చితంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ‘శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మీ ముందుకు ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఇందులో పవన్ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం.
TG: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ట్విటర్‌లో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘యుగయుగాలకు తరగని వ్యక్తిత్వం, ఈ జగాన పరిపాలనకు ఆదర్శం, మన శ్రీరామచంద్రమూర్తి జీవితం. జయజానకీ నాయకుడి కల్యాణ వైభోగం సందర్భంగా భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు’ అని పోస్ట్ చేశారు.
మిస్టరీ స్పిన్నర్‌గా పేరున్న నరైన్‌లోని హిట్టర్‌ను క్రికెట్ ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది గౌతం గంభీర్. KKRకు గౌతీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎవ్వరి అంచనాలకు అందకుండా నరైన్‌తో ఓపెనింగ్ చేయించి హిట్టయ్యారు. గౌతీ జట్టును వీడాక అతడిని అంతగా పట్టించుకోలేదు. ఈ సీజన్‌లో KKR మెంటార్‌గా వచ్చిన గౌతీ తిరిగి నరైన్‌కు ఓపెనర్‌గా అవకాశం కల్పించారు. దీంతో ఏకంగా సెంచరీ బాది తనపై ఉన్న నమ్మకాన్ని నరైన్ నిలబెట్టుకున్నారు.
శ్రీరాముడు భారతీయుల హృదయాలలో ఉన్నాడని PM మోదీ ట్వీట్ చేశారు. అయోధ్యలో తొలిసారి నిర్వహించుకుంటున్న రామనవమి పర్వదినాన ఆలయ నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన సాధువులు, రామ భక్తులు, మహాత్ములను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించిన క్షణాలు తన మదిలో ఇంకా శక్తిని నింపుతున్నాయని పేర్కొన్నారు.
దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో జరుగుతున్న రామనవమి వేడుకలకు బాల రాముడు సిద్ధమయ్యారు. ఉదయాన్నే స్వామివారికి పూజారులు అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని పూలదండలతో అలంకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర Xలో షేర్ చేసింది.
లోక్‌సభ తొలి విడత ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పలు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలివిడతలో తమిళనాడులోని 39 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని ఈసీ తరలించింది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజాసాబ్. హైదరాబాద్‌లో ఇటీవల కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇందులో భాగంగా హీరోయిన్ నిధి అగర్వాల్ సెట్లోకి అడుగుపెట్టారు. ఈ వారంలోనే ప్రభాస్ కూడా సెట్లోకి రానున్నారని టీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య సీన్స్, ఒక పాట షూట్ చేయనున్నారట. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.