India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్డీయే కూటమి ప్రచారం నేడు కృష్ణా జిల్లాకు చేరుకోనుంది. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఇద్దరు నేతలు పెడనకు చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగం అనంతరం మచిలీపట్నం నియోజకవర్గానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు విజయవాడకు బయలుదేరతారు.
ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచులు జరగ్గా.. గుజరాత్‌దే పైచేయిగా ఉంది. GT రెండింట్లో, ఢిల్లీ ఒక మ్యాచులో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో గుజరాత్ 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ఢిల్లీ నాలుగు పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలాపై ఈసీ చర్యలకు దిగింది. బీజేపీ ఎంపీ హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో 48 గంటలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. అంతకుముందు ఆయన ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించింది.
TG: శ్రీరామనవమి సందర్భంగా HYD జంటనగరాల్లో ఇవాళ వైన్ షాప్స్ మూసి ఉండనున్నాయి. జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉ.6 వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. తిరిగి రేపు వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో తెలుగు తేజాలు సత్తా చాటారు. నిన్న విడుదలైన ఫలితాల్లో 60మందికి పైగా తెలుగు అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యరెడ్డి 3వ ర్యాంకు సాధించారు. 100లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లున్నారు. 200లోపు మరో 11 మంది ర్యాంకులు సాధించారు. వీరంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం.
AP: కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్‌పై మరో దాడికి కుట్ర జరిగినట్లు YCP శ్రేణులు అనుమానిస్తున్నాయి. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర భగ్నమైనట్లు పేర్కొన్నాయి. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దాడి చేసేందుకు రాయితో వచ్చాడా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల సిరిసిల్ల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతల ఫిర్యాదుతో నోటీసులు పంపింది. ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తన వ్యాఖ్యలపై కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది.
ఫేక్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌తో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు రకాలుగా ఎర వేసి దోచుకుంటున్న సైబర్ కేటుగాళ్లు స్టాక్ మార్కెట్ల మీదా పడ్డారు. భారీ లాభాలు వస్తాయని ఫేక్ ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టిస్తారు. ముంబైలో ఓ 44ఏళ్ల వ్యక్తి ఇటీవల ఇలాగే ఫేక్ ట్రేడింగ్ స్కామ్‌లో చిక్కుకుని రూ.45.69లక్షలు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా కేటుగాళ్లు ఈ స్కామ్‌కు పాల్పడుతున్నారు.
కేకేఆర్‌పై రాజస్థాన్ రాయల్స్ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. బట్లర్ పుణ్యమా అని ఈ సీజన్‌లో అత్యధిక లక్ష్యాన్ని (224) ఛేదించిన జట్టుగా నిలిచింది. అయితే RRకు ఇంత భారీ స్కోర్‌ను ఛేజ్ చేయడం కొత్త కాదు. 2020లో పంజాబ్‌పై కూడా 224 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి సాధించింది. దీంతో IPL చరిత్రలోనే రెండుసార్లు భారీ టార్గెట్ (224)ను ఛేదించిన ఏకైక జట్టుగా RR నిలిచింది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వివిధ పార్టీలు దాఖలు చేసిన 131 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. బీజేపీ 51 ఫిర్యాదులు చేయగా 38 కేసుల్లో చర్యలు తీసుకున్నామంది. కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన 59 కేసుల్లో 51పై యాక్షన్ తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఇతర పార్టీలకు చెందిన 80 ఫిర్యాదులపై కూడా చర్యలు చేపట్టినట్లు ఈసీ పేర్కొంది.
Sorry, no posts matched your criteria.