India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చైనా ఆగడాలకు సంబంధించి ఎమ్మె రైలీ అనే ఐక్యరాజ్య సమితి మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. ‘UN వంటి అంతర్జాతీయ సంస్థలను అధీనంలోకి తెచ్చుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు, నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. చైనాకు వ్యతిరేకంగా రిపోర్టులు రాయకుండా UN సీనియర్ అధికారులను ఒత్తిడి చేస్తోంది’ అని యూకే ఫారిన్ అఫైర్స్ కమిటీకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇంటింటికీ గ్యారంటీ కార్డులు పంచడంపై ఎన్నికల సంఘానికి BJP ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఈ కార్డుల పంపిణీ, ప్రింటింగ్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విధానం ఓటర్లను మభ్యపెట్టేలా ఉందని, లంచగొండితనాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని ఆరోపించింది. గ్యారంటీల లబ్ధికి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా అప్లికేషన్ పేపర్లను కాంగ్రెస్ పంచుతోందని పేర్కొంది.
అమెరికాలో స్థిరపడాలనేది చాలా మంది భారతీయుల కల. అయితే ఇలా కలలు కంటున్న వారి జాబితా ఇటీవల బాగానే పెరిగింది. గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారి సంఖ్యే అందుకు ఉదాహరణ. డిపెండెంట్లతో కలిపి 12.6లక్షల మందికిపైగా భారతీయులు గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నట్లు US వెల్లడించింది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అనే మూడు కేటగిరీల కింద US గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది.
ఈవీఎం వ్యవస్థను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో బ్యాలెట్ పేపర్ల వ్యవస్థ ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయో చూశామని, ఆ ఘటనలు ఇంకా మర్చిపోలేమని పేర్కొంది. ఈవీఎంలకు ప్రత్యామ్నాయం ఏంటని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను కోర్టు ప్రశ్నించగా, ఆయన బ్యాలెట్ పేపర్ వ్యవస్థను సూచించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవస్థ సరికాదంటూ కోర్టు అభిప్రాయపడింది.
భారతీయ వాయుసేన మాజీ అధికారి స్క్వాడ్రన్ లీడర్ దలీప్ సింగ్ మజితియా (103) మంగళవారం కన్నుమూశారు. ఉత్తరాఖండ్ రుద్రపూర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వాయుసేనలో చేరిన దలీప్ భయమెరుగని యోధుడిగా గుర్తింపుపొందారు. 1942-1943 మధ్య బర్మా వద్ద వాయుసేనకు ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని IAF వర్గాలు పేర్కొన్నాయి. 1920 జూలై 27న జన్మించిన దలీప్ 1940లో వాయుసేనలో చేరారు.
బిహార్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సనాతన ధర్మాన్ని దూషించే వాళ్లు ఒక్క విషయం తెలుసుకోవాలి. రాజ్యాంగ రూపకర్తల్లో 80-90% మంది సనాతన ధర్మాన్ని గౌరవించిన వారే ఉన్నారు. ఈ గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ తీర్చిదిద్దేందుకు వీరు మద్దతుగా నిలిచారు. దేశాభివృద్ధికై కలలు కని రూపకర్తలు రాజ్యాంగాన్ని అందిస్తే కాంగ్రెస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది’ అని తెలిపారు
రాజ్యాంగంలో సవరణలు చేపట్టేందుకే BJP భారీ మెజార్టీని కోరుకుంటోందన్న ప్రతిపక్షాల విమర్శలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. NDA రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని.. అంబేడ్కర్ సైతం దానిని మార్చలేరన్నారు. ‘నన్ను దూషించేందుకు ప్రతిపక్షాలు రాజ్యాంగం పేరును వాడుకుంటున్నాయి. అంబేడ్కర్, డా.రాజేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దిన రాజ్యాంగమే నన్ను PMను చేసింది. ప్రతిపక్షాలు రాజ్యాంగంతో రాజకీయాలు చేస్తున్నాయి’ అని విమర్శించారు.
శ్రీరామనవమి సందర్భంగా నేడు అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్య తిలకాన్ని ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రక్రియను నిన్న నిర్వాహకులు విజయవంతగా పరీక్షించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాయి. ఈ అపురూప ఘట్టాన్ని భక్తులు వీక్షించేందుకు ఆలయ ప్రాంగణంలో దాదాపు 100 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారట.
జమ్మూకశ్మీర్‌లో బీజేపీ విజయంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల నమ్మకాన్ని, ప్రేమను పొందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కమలం దానంతట అదే వికసిస్తుందన్నారు. ‘ప్రధాని మోదీ హయాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించింది, రాళ్లు దాడులు ఆగాయి, ఆర్టికల్ 370 రద్దైంది. ఒకప్పుడు రాళ్లు పట్టుకున్న జమ్మూకశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు ల్యాప్‌టాప్స్ వచ్చాయి’ అని పేర్కొన్నారు.
కేకేఆర్‌పై ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్‌కు సూపర్ విక్టరీ అందించిన బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆత్మవిశ్వాసంతో ధోనీ, కోహ్లీ చివరివరకు ఉండి పోరాడతారని ఈ మ్యాచ్‌లో తానూ అదే చేశానని అన్నారు. ‘నాకు గతంలో సంగక్కర కూడా ఇదే మాట చెప్పారు. చివరివరకు క్రీజులో ఉంటే ఏదో క్షణాన పరిస్థితులు మనకి అనుకూలించొచ్చని అన్నారు. పోరాడకుండా ప్రత్యర్థికి వికెట్ ఇచ్చేయడం కన్నా ఘోరమైంది మరొకటి లేదు’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.