news

News April 17, 2024

రాళ్లు పట్టుకున్న చేతుల్లో ఇప్పుడు ల్యాప్‌టాప్స్ వచ్చాయి: షా

image

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ విజయంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల నమ్మకాన్ని, ప్రేమను పొందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కమలం దానంతట అదే వికసిస్తుందన్నారు. ‘ప్రధాని మోదీ హయాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించింది, రాళ్లు దాడులు ఆగాయి, ఆర్టికల్ 370 రద్దైంది. ఒకప్పుడు రాళ్లు పట్టుకున్న జమ్మూకశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు ల్యాప్‌టాప్స్ వచ్చాయి’ అని పేర్కొన్నారు.

News April 17, 2024

ధోనీ, కోహ్లీనే ఫాలో అయ్యా: బట్లర్

image

కేకేఆర్‌పై ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్‌కు సూపర్ విక్టరీ అందించిన బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆత్మవిశ్వాసంతో ధోనీ, కోహ్లీ చివరివరకు ఉండి పోరాడతారని ఈ మ్యాచ్‌లో తానూ అదే చేశానని అన్నారు. ‘నాకు గతంలో సంగక్కర కూడా ఇదే మాట చెప్పారు. చివరివరకు క్రీజులో ఉంటే ఏదో క్షణాన పరిస్థితులు మనకి అనుకూలించొచ్చని అన్నారు. పోరాడకుండా ప్రత్యర్థికి వికెట్ ఇచ్చేయడం కన్నా ఘోరమైంది మరొకటి లేదు’ అని తెలిపారు.

News April 17, 2024

ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

image

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహరాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్ధ్ జననం
1790: అమెరికా సహవ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం
2004: సినీ నటి సౌందర్య మరణం

News April 17, 2024

T20 WCకు వికెట్ కీపర్ అతడేనా?

image

టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి BCCI సెలక్టర్లకు వికెట్ కీపర్ ఎంపిక తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. IPLలో వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ రాణిస్తున్నారు. వీరిలో రిషభ్ పంత్‌ను WC కోసం ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాకప్‌గా సంజూ శాంసన్, దినేశ్ కార్తీక్‌‌లలో ఒకరిని తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News April 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 17, 2024

సొంత మేనిఫెస్టోతో బరిలోకి గడ్కరీ

image

నాగ్‌పుర్ లోక్‌సభ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేయనున్న కేంద్రమంత్రి, BJP నేత నితిన్ గడ్కరీ సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. ‘ఐదేళ్లలో నాగ్‌పుర్‌లో లక్ష ఉద్యోగాలు, విదర్భ పరిధిలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అభివృద్ధి, స్వచ్ఛతలో నాగ్‌పుర్‌ను టాప్ ఫైవ్ నగరాల్లో నిలబెడతా. ఇప్పటికే స్లమ్స్‌లోని 500-600 ఇళ్లకు పట్టాలు అందించే ప్రక్రియ మొదలైంది. మరోసారి గెలిపిస్తే దీనిని విస్తరిస్తాను’ అని హామీ ఇచ్చారు.

News April 17, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 17, బుధవారం ఫజర్: తెల్లవారుజామున గం.4:44 సూర్యోదయం: ఉదయం గం.5:59 జొహర్: మధ్యాహ్నం గం.12:16 అసర్: సాయంత్రం గం.4:42 మఘ్రిబ్: సాయంత్రం గం.6:33 ఇష: రాత్రి గం.07.47 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 17, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 17, బుధవారం చైత్రము శు.నవమి: మధ్యాహ్నం: 03:14 గంటలకు ఆశ్లేష: మరుసటి రోజు తెల్లవారుజామున 07:56 గంటలకు దుర్ముహూర్తం: ఉదయం 11:41 నుంచి 12:31 గంటల వరకు, వర్జ్యం: రాత్రి 07:29 నుంచి 09:16 గంటల వరకు

News April 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 17, 2024

TODAY HEADLINES

image

✒ ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 29 మంది మావోల మృతి
✒ AP: శిరోముండనం కేసులో YCP MLC త్రిమూర్తులుకు జైలు శిక్ష.. బెయిలు
✒ AP: నాపై రాళ్లు వేయండని CBN చెబుతున్నాడు: CM
✒ AP: ఇంటర్ షార్ట్ మెమోలు విడుదల
✒ AP: జనసేనకే గాజు గ్లాస్.. హైకోర్టు తీర్పు
✒ సివిల్స్ ఫలితాలు.. TG యువతికి మూడో ర్యాంక్
✒ TG: గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత: CM రేవంత్
✒ TG: రేవంత్ BJPలో చేరుతారేమో: KCR
✒ IPL: KKRపై RR విజయం