India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇరాన్ మద్దతు గల లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ ఎంపికయ్యారు. హసన్ నస్రల్లా మృతి చెందడంతో ఆయన స్థానంలో నయీమ్‌ను నియమించారు. నయీమ్ ఇప్పటివరకు హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్‌గా కొనసాగారు. నస్రల్లాతో కలిసి ఆయన యాక్టివ్‌గా పనిచేశారు. నయీమ్ 1953లో దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలాలో జన్మించారు. తొలుత ఆయన కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశారు. 1982లో హెజ్బొల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.
AP: ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా ధర్మం. నా విధి. ఇంతమంది పెద్దలు చెప్తున్న అబద్ధాల మధ్య నిజాలు తెలియాలనే మీ మందుకు వచ్చా. YSR బతికి ఉంటే ఆస్తుల సమస్య వచ్చేది కాదు. దీనిపై ఇక ఎవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు’ అని లేఖలో కోరారు.
ట్విటర్‌లోని గ్రోక్ ఏఐకి వైద్య పరీక్షల నివేదికల్ని విశ్లేషించే సామర్థ్యం ఉందని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. యూజర్లు తమ ఎక్స్-రే, PET, MRI రిపోర్టుల్ని గ్రోక్‌కి సబ్‌మిట్ చేస్తే విశ్లేషించి చెబుతుందని పేర్కొన్నారు. ‘ఇది ఇంకా ఆరంభ దశే అయినా గ్రోక్ చాలా బాగా పనిచేస్తోంది. మున్ముందు మరింత మెరుగువుతుంది’ అని వెల్లడించారు. గ్రోక్‌ను వాడాలంటే ట్విటర్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
AP: జగన్ CM అయ్యాక ఆస్తుల పంపకం ప్రపోజల్ పెట్టాడని తల్లి విజయమ్మ అన్నారు. ‘ఇప్పుడు ప్రచారంలో ఉన్న MOU జగన్ చేతితో రాసిందే. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు రూ.200Cr డివిడెండ్లు ఇచ్చారు. MOUలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, అందులో లేని యలహంక ప్రాపర్టీ 100% షర్మిలకు వెంటనే ఇస్తానని మాట ఇచ్చి సంతకం పెట్టాడు. కానీ అవి ఇవ్వలేదు. పైగా అటాచ్‌మెంట్లో లేని ఆస్తుల విషయంలో పాపకు అన్యాయం జరిగింది’ అని ఆవేదన చెందారు.
జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్రహోదా వస్తుందని సీఎం ఒమర్ అబ్దుల్లా ధీమా వ్యక్తం చేశారు. తన ఢిల్లీ పర్యటనలో ఈ విషయంలో హామీ లభించిందన్నారు. ‘యూటీ హోదా తాత్కాలికమే. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రహోదా వస్తుంది. అత్యున్నత స్థాయిలో నాకు హామీ లభించింది’ అని స్పష్టం చేశారు. వచ్చే నెలలో మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు ముగిసిన తర్వాత కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై కేంద్రం ఓ నిర్ణయానికి రావొచ్చని సమాచారం.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన వచ్చే నెల 6న క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు. నవంబర్ రెండో వారంలో వారంపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం.
AP: వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం చేశారన్నది అవాస్తవమని వైఎస్ విజయమ్మ వెల్లడించారు. ‘విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా ఉండటంతో ఆయనకు అన్ని తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా సాక్షి సంతకం పెట్టారు. కానీ ఇద్దరూ స్పృహ లేకుండా అవాస్తవాలు మాట్లాడారు. జగన్, షర్మిల పెరుగుతున్నప్పుడే కొన్ని ఆస్తులు జగన్, షర్మిల పేరిట రాజశేఖర్ రెడ్డి రాశారు. ఇది ముమ్మాటికీ ఆస్తుల పంపకం కాదు’ అని స్పష్టం చేశారు.
AP: క్రీడలపై CM CBN చాలా ఆసక్తి ఉన్నారని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. తాను ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్నానని, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై CMతో చర్చించినట్లు చెప్పారు. అందుకు స్థలం ఎక్కడ ఇస్తారనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. AP అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరినట్లు ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని వెల్లడించారు. అమరావతి, విశాఖ, అనంతపురంలో కోర్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
AP: తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదని విజయమ్మ అన్నారు. ‘జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధేస్తోంది. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరూ కల్పిత కథలు రాయొద్దు. వాళ్లిద్దరే(జగన్, షర్మిల) సమాధానం పొందుతారు. దేవుడు అన్నింటికీ పరిష్కారం చూపుతాడు’ అని తెలిపారు.
నలుపు, తెలుపు రంగులలో విలక్షణంగా కనిపించే ఆఫ్రికన్ పెంగ్విన్స్ అంతరించిపోయే దశలో ఉన్నట్లు IUCN తెలిపింది. ప్రపంచంలోని 18 పెంగ్విన్ జాతులలో అంతరించిపోయే దశకు చేరుకున్న మొదటి జాతి ఇదేనని పేర్కొంది. ఆహారం దొరకకపోవడం, వాతావరణ మార్పులు, సంతానోత్పత్తి కాలనీల సమీపంలో చేపల వేట కొనసాగించడం వీటి మనుగడకు పెను ముప్పుగా మారాయంది. వీటి సంరక్షణకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని IUCN కోరింది.
Sorry, no posts matched your criteria.