news

News April 16, 2024

త్వరలో కాంగ్రెస్‌లోకి ఇంద్రకరణ్?

image

TG: లోక్‌సభ ఎన్నికల వేళ BRSకు మరో షాక్ తగిలే అవకాశం కన్పిస్తోంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ ఆదిలాబాద్‌లో KTR అధ్యక్షతన జరిగిన సన్నాహక భేటీకి ఆయన డుమ్మాకొట్టారు. నిర్మల్‌లో కార్యకర్తలతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. దీంతో ఆయన త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

News April 16, 2024

రాములోరి కళ్యాణం లైవ్ టెలికాస్ట్‌కు ఈసీ అనుమతి

image

భద్రాచలం శ్రీసీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా కళ్యాణ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్ 4న ఈసీ ఆంక్షలు విధించింది. 40 ఏళ్లుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని దేవాదాయశాఖ, నేతలు ఈసీ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఎన్నికల సంఘం ప్రత్యక్షప్రసారానికి ఓకే చెప్పింది.

News April 16, 2024

ఇలా తింటున్నారా.. అయితే ప్రమాదమే!

image

టీలో రస్కులు వేసుకుని ఇష్టంగా తినడం చాలామందికి ఓ అలవాటు. రుచిగా ఉంటుంది కూడా. కానీ అలా తినడం పెను ప్రమాదమంటున్నారు ఆరోగ్య నిపుణులు. భారీగా చక్కెర, అనారోగ్యపూరిత కార్బోహైడ్రేట్లు, తక్కువ ధర నూనెలతో తయారయ్యే రస్కులు టీతో తీసుకోవడం వలన మధుమేహం, ఊబకాయ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందట. పేగులు దెబ్బతినడం, గుండెజబ్బులు, జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

News April 16, 2024

రాయలసీమకు తాగునీరు ఇచ్చింది చంద్రబాబే: బాలకృష్ణ

image

AP: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బాలకృష్ణ ఆరోపించారు. ఎమ్మిగనూరు సభలో మాట్లాడుతూ.. ‘రాయలసీమకు తాగు, సాగు నీరు ఇచ్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు. మహిళల్లో ఆర్థిక విప్లవం తెచ్చారు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలో, విధ్వంసం కావాలో ప్రజలు తేల్చుకోవాలి. వైసీపీని ఓటుతో పొడిచి అపజయం రుచి చూపించాలి’ అని పిలుపునిచ్చారు.

News April 16, 2024

అక్కడ రోజుకు ఒకరు జన్మిస్తే.. ఇద్దరు చనిపోతున్నారు!

image

గ్రీస్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడ రోజుకు ఒకరు జన్మిస్తే.. ఇద్దరు చనిపోతున్నారు. దీంతో ఆ దేశ జనాభా వేగంగా తగ్గిపోతోంది. 2011లో 1.11 కోట్ల జనాభా ఉంటే ప్రస్తుతం 1.07 కోట్లుగా ఉంది. పదేళ్లలోనే 7 లక్షల మంది జనాభా తగ్గిపోయారు. ఇది 2050 నాటికి 90 లక్షలకు చేరుకోనున్నట్లు అంచనా. పిల్లలను కనాలని ప్రభుత్వం పలు రకాల ఆఫర్లు ఇస్తున్నా ఆ దేశ యువత పెళ్లి, పిల్లలపై ఆసక్తి చూపడం లేదు.

News April 16, 2024

IPL: అప్పుడు కెప్టెన్.. ఇప్పుడు బెంచ్‌కే పరిమితం?

image

కేకేఆర్ బ్యాటర్ నితీశ్ రానా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతేడాది రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీతో KKRకు కెప్టెన్‌గా వ్యవహరించారు. సీజన్ మొత్తం ఆయనే సారథిగా జట్టును నడిపించారు. అటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టారు. కానీ ఈ సీజన్‌లో జట్టులో చోటే కోల్పోయారు. ఇప్పటివరకు కేకేఆర్ 5 మ్యాచ్‌లు ఆడితే ఒక్కదాంట్లోనే ఆయన ఆడారు. అప్పటినుంచి ఆయన బెంచ్‌కే పరిమితమైపోయారు. ఇందుకు కారణాలు తెలియరావడం లేదు.

News April 16, 2024

ఇంటర్ షార్ట్ మెమోలు విడుదల

image

AP: ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల షార్ట్ మెమోలను అందుబాటులోకి తెచ్చారు. https://bieap.apcfss.in సైట్ ద్వారా వాటిని <>డౌన్‌లోడ్<<>> చేసుకోవచ్చు. హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే చాలు. అందులో స్టూడెంట్ ఫొటోతో పాటు గ్రేడ్, సాధించిన మార్కులు ఉంటాయి. కాగా ఏప్రిల్ 12న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

News April 16, 2024

ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో MP సీట్లు పెంచుతారట: KTR

image

TG: దేశవ్యాప్తంగా 2026లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో KTR కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. ‘మేమిద్దరం.. మాకిద్దరు అని కేంద్రం ఇచ్చిన పిలుపును దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. UP, MP, బిహార్, రాజస్థాన్ ప్రజలు పట్టించుకోలేదు. కుటుంబ నియంత్ర‌ణ పాటించిన రాష్ట్రాల్లో ఇప్పుడు పార్ల‌మెంట్ సీట్లు పెంచ‌ర‌ట‌. ఇష్ట‌మొచ్చిన‌ట్లు పిల్ల‌ల‌ను క‌న్న రాష్ట్రాల్లో పెంచుతార‌ట’ అని మండిపడ్డారు.

News April 16, 2024

‘యానిమల్’ సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది: మాజీ ఐఏఎస్

image

సందీప్‌రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమాపై మాజీ ఐఏఎస్, 12th ఫెయిల్ నటుడు వికాస్ దివ్యకృతి తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. హీరోను జంతువులా చూపించారు. ఇందులో ఓ నటిని హీరో తన కాలి షూ నాకమనే సీన్ ఉంది. దీన్ని చూసి యువత ఇలానే ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి బుద్ధిలేని సినిమాలు తీయడం బాధ కలిగిస్తోంది’ అని పేర్కొన్నారు.

News April 16, 2024

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌: 29 మంది మావోయిస్టులు మృతి

image

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 29 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. కాంకేర్ జిల్లా చోటేబైథియా పీఎస్ పరిధిలోని కల్పర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఏకే-47 తుపాకులతో పాటు మెషీన్ గన్లను పోలీసులు సీజ్ చేశారు.