India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సందీప్‌రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమాపై మాజీ ఐఏఎస్, 12th ఫెయిల్ నటుడు వికాస్ దివ్యకృతి తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. హీరోను జంతువులా చూపించారు. ఇందులో ఓ నటిని హీరో తన కాలి షూ నాకమనే సీన్ ఉంది. దీన్ని చూసి యువత ఇలానే ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి బుద్ధిలేని సినిమాలు తీయడం బాధ కలిగిస్తోంది’ అని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 29 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. కాంకేర్ జిల్లా చోటేబైథియా పీఎస్ పరిధిలోని కల్పర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఏకే-47 తుపాకులతో పాటు మెషీన్ గన్లను పోలీసులు సీజ్ చేశారు.
TG: మెదక్ సభలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారేమోనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. సర్వే రిపోర్టులు చూసి రేవంత్ భయపడుతున్నారని, నారాయణపేట సభలో వణికిపోయారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వేలో తేలిపోయిందన్నారు.
ఆర్సీబీ బౌలర్ల ప్రదర్శనపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఒకరికొకరు పోటీపడి ధారాళంగా పరుగులు ఇవ్వడాన్ని సొంత ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫామ్ లేమితో సతమతమవుతున్న బట్లర్, నరైన్, సమద్ లాంటి బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లే ఫామ్‌లోకి తీసుకొచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘బెంగళూరు బౌలింగ్ నభూతో నభవిష్యత్. ఆర్సీబీ పంచాంగంలో అవమానాలే ఎక్కువ’ అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ జోనర్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. కొన్నిరోజులుగా ప్రభాస్, నిధి అగర్వాల్ మధ్య సాగే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్‌లో టాక్. ఇక ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు మారుతి టీం సన్నాహాలు చేస్తోందట. రాజాసాబ్ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన వచ్చింది.
TG: సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. భద్రాచలంలోని శ్రీసీతారాములవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి రేవంత్‌కు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇది సాధ్యం కాదని పేర్కొంది. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. దీంతో ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు.
ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు KKR, RR తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
KKR జట్టు: సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయస్, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, స్టార్క్, వరుణ్, హర్షిత్ రాణా
RR జట్టు: యశస్వి, శాంసన్, పరాగ్, హెట్మెయిర్, జురెల్, పావెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్, కుల్‌దీప్ సేన్, చాహల్
గృహ హింస అభియోగాలతో అరెస్టైన ఆస్ట్రేలియా <<13063531>>మాజీ<<>> క్రికెటర్ మైఖేల్ స్లేటర్‌కు కోర్టులో చుక్కెదురైంది. క్వీన్స్‌లాండ్ కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అతడు బయట ఉంటే మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశముందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అనంతరం బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో కోర్టు ఆవరణలోనే ఉన్న స్లేటర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
TG: హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై పోలీసులు ఆంక్షలు విధించారు. వంతెనపై వాహనాలు ఆపి ఫొటోలు దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుట్‌పాత్‌లో కాకుండా బ్రిడ్జి రోడ్డుపై నిలబడటం నిషేధం అని చెప్పారు. నేటి నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
AP: వివేకా హత్య కేసులో దస్తగిరితో సునీత <<13064596>>లాలూచీ<<>> పడ్డారని ఎంపీ అవినాశ్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ‘దస్తగిరి అప్రూవర్ అయినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు. కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందని అవినాశ్ అంటున్నారు.. మరి దీని గురించి ఆయన పోలీసులతో ఎప్పుడైనా మాట్లాడారా? ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా? గూగుల్ టేకౌట్ ఫ్యాబ్రికేటెడ్ కాదు’ అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.