India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. ముగ్గురు పోలీసులకూ గాయాలైనట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కాంకేర్ జిల్లా పోలీసులు వెల్లడించారు.
TG: గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చట్టబద్ధమైన ఏజెంట్ల ద్వారా మాత్రమే కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లేలా చేస్తామన్నారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని పేర్కొన్నారు. ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిప్పీన్స్, కేరళలో మంచి విధానం అమల్లో ఉందని, అన్నీ అధ్యయనం చేసిన తర్వాత సమగ్ర విధానం రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
భద్రాచలంలోని శ్రీసీతారాముల కళ్యాణానికి ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందించనున్నారు. కాగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. దీంతో ప్రసారానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కొండా సురేఖ ఈసీకి లేఖ రాశారు.
★ వరల్డ్‌లోనే అత్యంత రద్దీ కలిగిన వ్యవస్థగా భారతీయ రైల్వే
★ ఏడాదికి సుమారు 8.086 బిలియన్ల మంది రైలు ప్రయాణం చేస్తారు
★ ఇండియాలో 1,27,760 కి.మీ మేర రైల్వే లైన్లు ఉన్నాయి
★ స్పీడుగా నడిచే రైలు వందే భారత్
★ నెమ్మదిగా నడిచే రైలు నీలగిరి ప్యాసింజర్ (గంటకు 10KM)
★ ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్ (4,286KM)
★ కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వే ప్లాట్‌ఫారమ్ అత్యంత పొడవైనది (1507M)
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘దేవర’ మూవీ థియేట్రికల్ హక్కులను తక్కువ ధరకు కోట్ చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.130 కోట్లకు కోట్ చేసినట్లు సమాచారం. ఇది తారక్ కెరీర్‌లో హయ్యెస్ట్ రైట్స్. కానీ ట్రెండ్ ప్రకారం ఇది చాలా తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప2, కల్కి చిత్రాల థియేట్రికల్ రైట్స్ ఒక్కో రాష్ట్రంలోనే దాదాపు రూ.100 కోట్లు పలకనున్నట్లు టాక్.
వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఉన్నవారి లిస్టు ఒకే చోట కనిపించేలా ఆప్షన్‌ను కల్పించనుంది. ఇందులో మనకు ముఖ్యమైన వారి నంబర్లను యాడ్ చేసుకోవచ్చు. అయితే వినియోగదారుల గోప్యత దృష్ట్యా వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్‌లు కనిపించబోవని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ ఆప్షన్ కొందరు బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే అందరూ ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
TG: ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రసాద్ రెడ్డి సోదరుడు. కాగా డిప్యూటీ CM భట్టి తన భార్య నందిని కోసం ఈ సీటుపై పట్టుబట్టినా ఫలితం లేకుండాపోయింది. అలాగే కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్, హైదరాబాద్ అభ్యర్థిగా సమీరుల్లా ఖాన్ పేర్లు ఫిక్స్ అయినట్లు టాక్.
AP: రాష్ట్రంలోని ఒంటిమిట్ట రామాలయానికి ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఆంజనేయుడు లేని రామాలయం ఇదొక్కటే. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఈ విశిష్టమైన రామాలయంలో సీత, రాముడు, లక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయం ఆంధ్రా భద్రాచలంగా పేరుపొందింది. చంద్రుడి వెన్నెలలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఈ దేవాలయ ప్రత్యేకత.
‘హనుమాన్’ మూవీతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ క్రేజ్ సంపాదించారు. దీంతో ఆయన తర్వాత సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో తన తదుపరి మూవీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఓ మైథలాజికల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. కొత్త సినిమాకు సంబంధించి ప్రశాంత్-రణ్‌వీర్ మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయట.
AP: వివేకా హత్య కేసులో సునీతతో ఒప్పందంతోనే దస్తగిరి అప్రూవర్‌గా మారారు అని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. ‘దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారు. సునీత నాపై కావాలనే బురద జల్లుతున్నారు. ఇందుకు చంద్రబాబు కూడా కుట్రలు చేస్తున్నారు. వివేకాను చివరి రోజుల్లో సునీత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.