India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వివేకా హత్య కేసులో సునీతతో ఒప్పందంతోనే దస్తగిరి అప్రూవర్‌గా మారారు అని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. ‘దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారు. సునీత నాపై కావాలనే బురద జల్లుతున్నారు. ఇందుకు చంద్రబాబు కూడా కుట్రలు చేస్తున్నారు. వివేకాను చివరి రోజుల్లో సునీత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
AP: సీఎం జగన్ గులకరాయి డ్రామా రక్తికట్టలేదని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ‘గజమాలకు ఉన్న పుల్ల గుచ్చుకోగానే నాటకం ప్రారంభమైంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అందించిన వైద్యమూ డ్రామాలో భాగమే. దీన్ని రచించిన రచయితకు నంది అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నా. అద్భుతంగా నటించిన జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి’ అని సెటైర్లు వేశారు.
మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్స్ పిక్చర్స్‌పై హీరో విశాల్ మండిపడ్డారు. ‘రక్తం చిందించి సినిమాలు తీస్తున్నాం. ఎవరో ఒకరు థియేటర్ల యజమానులకు ఫోన్ చేసి ఆ సినిమా వేయకండి? ఈ సినిమా వేయండి అని ఆదేశాలిస్తున్నారు. మీరు ఎవరు చెప్పడానికి? ఆ అధికారం, హక్కులు ఎవరిచ్చారు’ అంటూ స్టాలిన్ లక్ష్యంగా ఆయన ఫైర్ అయ్యారు. కాగా ఎనిమీ, మార్క్ ఆంటోనీ సినిమాలకు రెడ్ జెయింట్స్ థియేటర్ల కొరత సృష్టించింది.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ట్రావిస్ హెడ్ సెంచరీతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. శతకం పూర్తైన తర్వాత బ్యాట్ హ్యాండిల్‌పై హెల్మెట్ పెట్టి సెలబ్రేట్ చేసుకున్నారు. దాని వెనుక కారణాన్ని మ్యాచ్ అనంతరం వివరించారు. ‘రెండు రోజుల క్రితం నేను, కోచ్ వెటోరీ వివిధ సెంచరీ సెలబ్రేషన్లపై జోకులు వేసుకున్నాం. ఆ చర్చను అనుసరిస్తూనే నేను సరదాగా ఈ తరహాలో వెటోరీకి అభివాదం చేశాను’ అని తెలిపారు.
శ్రీరామ నవమి సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలని బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రజలను కోరుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఇది ఫేక్ అని, ఎన్నికల కమిషన్ కోసం చేసిన ఓ వీడియోను AI ద్వారా ఎడిట్ చేశారంటూ ఆయన ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 35 ఏళ్ల సినీ కెరీర్‌లో తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ఎవరినీ సపోర్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
TG: సెప్టెంబర్ లోపు గల్ఫ్ కార్మికుల కోసం ప్రణాళిక రూపొందిస్తామని CM రేవంత్ రెడ్డి చెప్పారు. గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ ఉపాధిపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఆ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయించామన్నారు. కార్మికుల సహాయార్థం ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సివిల్స్-2023 పరీక్షల్లో <<13063782>>ర్యాంకులు<<>> సాధించిన వారికి ప్రధాని మోదీ Xలో శుభాకాంక్షలు చెప్పారు. వారి పట్టుదల, అంకితభావం ప్రజా సేవకు నాంది పలికిందన్నారు. రాబోయే రోజుల్లో వారి కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్నారు. అలాగే సివిల్స్ క్లియర్ చేయలేని వారికి ఆయన భరోసా ఇచ్చారు. ఎదురుదెబ్బలు కఠినంగా ఉన్నప్పటికీ.. ముందడుగు వేయడానికి ఇవేమీ అడ్డు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
TG: మాజీ సీఎం KCR అధ్యక్షతన ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో BRS కీలక సమావేశం జరగనుంది. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం అందింది. ఎంపీ అభ్యర్థులకు బి-ఫారాలను, ఎన్నికల ఖర్చు కోసం రూ.95 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర, ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చిస్తారు.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఆరంభం నుంచే రికార్డు కలెక్షన్లు సాధిస్తూ తాజాగా మరో ఘనత అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా రూ.125 కోట్ల బ్లాక్ బస్టర్ పోస్టర్‌ను నెట్టింట పోస్ట్ చేసింది.
Sorry, no posts matched your criteria.