India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమ్మాయితో 20సం. రిలేషన్ తర్వాత ఆమె ‘అతడు’గా తెలిస్తే? ఫ్రెంచ్ మాజీ దౌత్యవేత్త బెర్నార్డ్ బౌర్సీకాట్ విషయంలో ఇదే జరిగింది. చైనా స్పై షీ పెయిపూతో బెర్నార్డ్‌కు 1964లో పరిచయం ఏర్పడింది. నటుడైన షీ మహిళగా శరీరాకృతి మార్చుకోగా బెర్నార్డ్ ప్రేమించాడు. ఇద్దరి రిలేషన్ గుర్తించిన చైనా బెర్నార్డ్‌ను బెదిరించి కీలక సమాచారం సేకరించింది. 1983లో ఇది గ్రహించిన ఫ్రెంచ్ రక్షణ శాఖ ఇద్దరికీ 6సం. శిక్ష విధించింది.
బంగారం ధరలు ఆకాశమే హద్దు అన్నట్లు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.980 పెరిగి రూ.74,130కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.67,950గా నమోదైంది. అటు సిల్వర్ కూడా కేజీ రూ.1000 పెరిగి రూ.90,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
బెంగళూరులో ఓ మహిళకు ఏకంగా రూ.1.36లక్షల ఫైన్ పడింది. సదరు మహిళ పదేపదే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు ట్రిపుల్ రైడింగ్ వంటివి చేస్తూ 277సార్లు నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఆమె హోండా యాక్టివాపై భారీ జరిమానా పడింది. ఆ స్కూటీ ఖరీదు కంటే ఫైన్ అమౌంట్ ఎక్కువ కావడం గమనార్హం. కాగా.. బండి పోలీస్ స్టేషన్‌లో పెట్టి మిగిలిన డబ్బు చెల్లించి వెళ్లాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ACI) రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్ తొలిస్థానంలో నిలవగా.. దుబాయ్, డల్లాస్, లండన్, యూకే, టోక్యో, జపాన్, డెన్వార్ అమెరికా, ఇస్తాంబుల్(తుర్కియే), లాస్ ఏంజెలిస్, చికాగో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఢిల్లీ) పదో స్థానంలో నిలిచింది.
నిన్న సన్‌రైజర్స్‌తో మ్యాచులో ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. SRH బ్యాటింగ్ సమయంలో ఆర్సీబీలోని నలుగురు బౌలర్లు ఏకంగా 50కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఐపీఎల్‌లోనే కాకుండా టీ20ల్లోనూ ఇలా జరగడం ఇదే తొలిసారి. టాప్లీ(68), యశ్(51), ఫెర్గూసన్(52), వైశాఖ్(64) పరుగులు ఇచ్చారు. మరోవైపు నిన్నటి మ్యాచులో ఇరు జట్లలోని బౌలర్లు ఓవర్‌కు కనీసం 10 పరుగుల చొప్పున ఇవ్వడం గమనార్హం.
AP: టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని అడిషనల్ సీఈవో నోటీసులు జారీ చేశారు.
AP: తమ అభ్యర్థులకు జనసేన రేపు బీఫారాలు అందించనుంది. ఆ పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వారందరికీ బీఫారాలు ఇవ్వాలని పవన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు అభ్యర్థులందరికీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ ఈ నెల 21 లేదా 22న పిఠాపురంలో నామినేషన్ వేసే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత మహిళల జట్టును BCCI ప్రకటించింది.
★ టీమ్: హర్మన్‌ప్రీత్ (C), మంధాన, షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, సజన సజీవన్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, ఆశా శోభనా, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు
కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు ద్వారకీశ్(81) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1963లో కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ద్వారకీశ్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయుష్మాన్ భవ, ఆప్తమిత్ర, విష్ణువర్ధన వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు.
ట్విటర్ అధినేత మస్క్ సంచలన ప్రకటన చేశారు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు నామమాత్రపు ఫీజు ($1 USD అని సమాచారం) చెల్లించాలన్నారు. లైక్, రీపోస్ట్, రిప్లై, బుక్‌మార్క్ చేయాలంటే ఈ రుసుము తప్పనిసరి అని తెలిపారు. ఫేక్, స్పామ్ అకౌంట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ వెల్లడించారు. న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ పాలసీ త్వరలో భారత్‌లోనూ అమలు కావొచ్చు.
Sorry, no posts matched your criteria.