India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విశాఖ గాజువాకలో ఆదివారం జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబుపై రాళ్ల దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. ఈ ఘటనపై విచారించాలని వారు విశాఖ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విశాఖ సౌత్ ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు.
TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ ఆమె తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీబీఐ కోర్టు కవితకు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సాధారణ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిన్న కోర్టు కవితకు ఈ నెల 23 వరకు జుడీషియల్ కస్టడీ పొడిగించింది.
1978లో శ్మశానం నుంచి చార్లీ చాప్లిన్ శవపేటికను ఇద్దరు దొంగలు తవ్వి ఎత్తుకెళ్లారట. ఆ శవ పేటిక ఇవ్వాలంటే 4 లక్షల పౌండ్లు (సుమారు 24 లక్షల డాలర్లు) చెల్లించాలని, డబ్బు ఇవ్వకపోతే పిల్లలకు హాని చేస్తామని చాప్లిన్ నాలుగో భార్య ఊనాను బెదిరించారు. ఆ విషయాన్ని ఆమె రివీల్ చేయకపోయినా.. బయటికి లీకైంది. 5వారాలకు కిడ్నాపర్లను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం ఇకపై ఉండదనే ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు సంబంధిత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పూర్తయింది.
ప్రధాని మోదీపై ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మైసూర్ ప్రచారంలో కాంగ్రెస్‌ను విచ్ఛిన్న ముఠాల సుల్తాన్ అని మోదీ విమర్శించడంపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బహిష్కరించాయని, హిందూ మతంలోని బలాన్ని విచ్ఛిన్నం చేయాలని ఇండియా కూటమి కోరుకుంటోందని మోదీ ఆరోపించారని ఈసీకి రాసిన లేఖలో వివరించింది. ప్రధానిపై క్రిమినల్ కేసు పెట్టాలని కోరింది.
నిన్నటి మ్యాచులో SRH, ఆర్సీబీ జట్లు భారీ స్కోర్లు చేయడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సన్ రైజర్స్, ఆర్సీబీ పవర్ హిట్టింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన చేశాయి. 40 ఓవర్లలో ఇరు జట్లు 549 పరుగులు సాధించాయి. ఇలా చేస్తే బౌలర్ అవ్వాలని ఎవరు అనుకుంటారు?’ అని పేర్కొన్నారు.
సామాజిక సంఘ సంస్కర్తల్లో ముందు వరుసలో ఉండే పేరు కందుకూరి వీరేశలింగం. తన రచనలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించారు. నేడు ఆయన జయంతి. బాల్యవివాహాల రద్దుకు ఆయన కృషి చేశారు. తన మిత్రులతో కలిసి దక్షిణ భారతదేశంలోనే తొలి వితంతు వివాహం జరిపించారు. ఆధునికాంధ్ర పితామహుడిగా పేరొందిన కందుకూరి సాహితీరంగంలో విశేష కృషి చేశారు. ఆంధ్రకవుల చరిత్రము, రాజశేఖర చరిత్రము వంటి రచనలు చేశారు.
హోరాహోరీ క్రికెట్ మ్యాచ్ ఇచ్చే కిక్కే వేరు. SRHvsRCB మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లతో ఇరుజట్ల ప్లేయర్లు తగ్గేదేలే అన్నట్లు విరుచుకుపడ్డారు. దీంతో ఫ్యాన్స్ పైసా వసూల్ పర్ఫార్మెన్‌ను ఎంజాయ్ చేశారు. SRHలో హెడ్(102), క్లాసెన్(67), సమద్(37), అభిషేక్(34), మార్క్రమ్(32) బ్యాటుతో సత్తా చాటగా.. కమిన్స్(3), మార్కండే(2) బంతితో రాణించారు. RCBలో DK(83), డుప్లెసిస్(62), కోహ్లీ(42) దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు.
AP: జగన్ చేపట్టిన బస్సు యాత్ర 16వ రోజైన నేటి షెడ్యూల్‌ను YCP విడుదల చేసింది. నిన్న బస చేసిన నారాయణపురం నుంచి బయల్దేరనున్న CM.. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం బయల్దేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి శిబిరానికి చేరుకుంటారు.
AP: ఏప్రిల్ 23న స్కూళ్లలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఆరోజున విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను వారి తల్లిదండ్రులకు అందించాలంది. తల్లిదండ్రులు 100% హాజరయ్యేలా HMలు బాధ్యత తీసుకోవాలంది. అటు వేసవి సెలవుల్లో విద్యార్థులు ఈ ఏడాదితో పాటు గత 2 తరగతుల సైన్స్, సోషల్ బుక్స్ చదివేలా చూడాలని సూచించింది. దీంతో సబ్జెక్టులు మరింతగా అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడింది.
Sorry, no posts matched your criteria.