news

News April 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 16, 2024

వెలగపూడి విజయ పరంపర.. ఎంవీవీ కళ్లెం వేస్తారా?

image

AP: సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే వైజాగ్‌లో కీలక నియోజకవర్గం విశాఖ తూర్పు. 2008లో సెగ్మెంట్ ఏర్పడగా అప్పటి నుంచి TDP అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ చక్రం తిప్పుతున్నారు. 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఆయన వన్స్ మోర్‌ అంటున్నారు. ఈ మాస్ లీడర్‌ను ఢీకొట్టేందుకు సిట్టింగ్ MP ఎంవీవీ సత్యనారాయణను YCP బరిలోకి దింపింది. మరి ఈ సమవుజ్జీల బిగ్ ఫైట్‌‌లో ఎవరు తడాఖా చూపిస్తారో వేచి చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 16, మంగళవారం ఫజర్: తెల్లవారుజామున గం.4:45 సూర్యోదయం: ఉదయం గం.5:59 జొహర్: మధ్యాహ్నం గం.12:16 అసర్: సాయంత్రం గం.4:42 మఘ్రిబ్: సాయంత్రం గం.6:33 ఇష: రాత్రి గం.07.47 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 16, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 16, మంగళవారం చైత్రము శు.అష్టమి: మధ్యాహ్నం: 01:24 గంటలకు పుష్యమి: మరుసటి రోజు తెల్లవారుజామున 05:16 గంటలకు దుర్ముహూర్తం: ఉదయం 08:23 నుంచి 09:13 గంటల వరకు, తిరిగి రాత్రి 10.57 గంటల నుంచి 11.43 గంటల వరకు, వర్జ్యం: ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 01:33 గంటల వరకు

News April 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 16, 2024

టుడే టాప్ స్టోరీస్

image

TG:కవిత బెయిల్ కోసం బీజేపీతో KCR కుమ్మక్కు: సీఎం రేవంత్
ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ: CM
కవితకు ఈ నెల 23వరకు జుడీషియల్ కస్టడీ
ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తాం: ఉత్తమ్
TG:బంగారం ధరలు తగ్గాలంటే రాహుల్ PM కావాలి: జగ్గారెడ్డి
AP:ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పింది: సీఎం జగన్
AP:పేదల బాగు కోసమే నా తపన: చంద్రబాబు
సీఎంపై దాడి.. దర్యాప్తు అధికారుల్ని మార్చాలి: పవన్
RCBపై SRH విజయం

News April 16, 2024

అత్యధిక సిక్సులు.. మరో RCB రికార్డు బద్దలు

image

చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు నమోదయ్యాయి. సన్‌రైజర్స్ ప్లేయర్లు 22 సిక్సర్లు బాదగా.. ఐపీఎల్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. ఇప్పటి వరకు ఈ రికార్డు RCB పేరున (2016లో పుణే వారియర్స్‌పై 21 సిక్సులు) ఉండగా.. ఇప్పుడు SRH అధిగమించింది. కాగా ఇదే మ్యాచ్‌లో ఆర్సీబీపై 287 పరుగులు చేసిన సన్‌రైజర్స్ గత రికార్డులను బద్దలు కొట్టింది.

News April 15, 2024

1377 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో మొత్తం 1377 పోస్టులు ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వయో పరిమితి, పోస్టులు, ఇతర వివరాల కోసం https://nvs.ntaonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

News April 15, 2024

డీకే అద్భుత పోరాటం.. అయినా SRH గెలుపు

image

RCBని సొంతగడ్డపైనే SRH ఓడించింది. తొలుత SRH 287 పరుగులు చేయగా.. బెంగళూరు 262 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ 25 రన్స్ తేడాతో గెలిచింది. వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ వీర విహారం చేశారు. 35 బంతుల్లో 83 పరుగుల (7 సిక్సర్లు, 5 ఫోర్లు)తో ఒంటరి పోరాటం చేశారు. కోహ్లీ 42(20), డుప్లెసిస్ 62(28) రాణించారు. కమిన్స్ 3 వికెట్లు, మార్కాండే 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

News April 15, 2024

IPL-2024లో భారీ సిక్సర్

image

SRHపై ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ బాదారు. నటరాజన్ వేసిన బంతిని 108 మీటర్ల దూరం కొట్టారు డీకే. ఆ బాల్ స్టేడియం పై రూఫ్‌ను తాకి మైదానంలో పడింది. ఐపీఎల్-2024లో ఇప్పటివరకు ఇదే లాంగెస్ట్ సిక్సర్. ఇదే మ్యాచులో SRH బ్యాటర్ క్లాసెన్ 106 మీటర్ల సిక్స్ కొట్టారు. ఈ సీజన్లోనే పూరన్, వెంకటేశ్ అయ్యర్ సైతం 106 మీటర్ల సిక్సర్లు బాదారు.