news

News April 15, 2024

IPLలో ఫాస్టెస్ట్ సెంచరీలు

image

30 బంతులు- క్రిస్ గేల్ vs పుణే
37- యూసుఫ్ పఠాన్ vs ముంబై
38- డేవిడ్ మిల్లర్ vs ఆర్సీబీ
39- హెడ్ vs ఆర్సీబీ*
42- గిల్ క్రిస్ట్ vs ముంబై
42- డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్
45- జయసూర్య vs చెన్నై
46- మురళీ విజయ్ vs రాజస్థాన్

News April 15, 2024

5 రోజుల్లో 600 విమానాలు.. IAF సాయం!

image

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి రాక నేపథ్యంలో జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో 5 రోజుల్లోనే 600కంటే ఎక్కువ విమానాల రాకపోకలు జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకోసం రిలయన్స్ ఎయిర్‌ఫోర్స్ సాయాన్ని తీసుకుందట.

News April 15, 2024

₹200 కోట్ల విరాళం.. ఇకపై భిక్షాటనతో జీవనం

image

గుజరాత్‌కు చెందిన దంపతులు రూ.200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. జైన మతానికి చెందిన పారిశ్రామిక వేత్త భవేశ్‌ భాయ్‌ భండారీ ఆయన భార్య ఇకపై సన్యాసం స్వీకరించి భిక్షాటనతో రోజువారీ జీవనం సాగించనున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉండగా వారు 2022లోనే సన్యాసం స్వీకరించారు. వారి నిర్ణయం ఈ దంపతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఏప్రిల్ 22న భవేశ్‌ భాయ్‌ దంపతులు సన్యాసం స్వీకరించనున్నారు.

News April 15, 2024

ఈ రోజు SRH రికార్డులు

image

*IPL చరిత్రలో అత్యధిక స్కోర్
*ఒక IPL ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (22)
*ఒక సీజన్ లో రెండు సార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టు
*ఐపీఎల్ చరిత్రలో 2 సార్లు 270+ స్కోర్ చేసిన తొలి టీం

News April 15, 2024

వామ్మో.. ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు

image

APR 19న అస్సాంలో తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సోనిట్‌పూర్(D) ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఒకే ఇంట్లో 350 ఓట్లు ఉన్నాయి. దివంగత బహదూర్ తాపా అనే వ్యక్తి ఐదుగురు భార్యల ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను కన్నారు. కోడళ్లు, అల్లుళ్లు, పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి జనాభా 1,200కు చేరింది. వీరంతా అదే ఊరిలో 300 ఇళ్లలో నివసిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 15, 2024

బీటెక్ చేశారా?.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

కేంద్రంలోని వివిధ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ఈ నెల 18తో ముగియనుంది. మొత్తం 968 పోస్టులు ఉండగా, గడువును పొడిగించేది లేదని SSC స్పష్టం చేసింది. డిప్లమా లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.35,400-రూ.1,12,400. పేపర్-1 పరీక్ష జూన్ 4 నుంచి 6 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. సైట్: https://ssc.gov.in/

News April 15, 2024

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి

image

టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి ఏడడుగులు వేసినట్లు ఇన్‌‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా ఈమె టెంపర్ సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్2, తదితర చిత్రాల్లో నటించారు.

News April 15, 2024

మతాంతర వివాహంతో ట్రోల్స్.. చాలా ఇబ్బంది పడ్డా: ప్రియమణి

image

మతాంతర వివాహం చేసుకోవడం వల్ల సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నానని హీరోయిన్ ప్రియమణి తెలిపారు. దీనివల్ల తనతోపాటు పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ‘మైదాన్’ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘ట్రోల్స్ విషయంలో భర్త నాకు అండగా నిలబడ్డాడు. ఏం జరిగినా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. అలాంటి వ్యక్తి భర్తగా దొరకడం నా అదృష్టం’ అని పేర్కొన్నారు. ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్‌ను వివాహమాడారు.

News April 15, 2024

IPLలో చెత్త రికార్డు

image

ఇవాళ SRHతో మ్యాచులో ఆర్సీబీ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న, అత్యల్ప స్కోర్ చేసిన టీంగా నిలిచింది. ఈరోజు SRH 287 రన్స్ చేయగా, ఇదే అత్యధిక స్కోర్. ఇక 2017లో KKRపై ఆర్సీబీ 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప స్కోర్ ఇదే. దీంతో రెండు చెత్త రికార్డులు ఆర్సీబీ పేరుపై నమోదయ్యాయి.

News April 15, 2024

BJPకి 400 సీట్లిస్తే ఓటు హక్కు గల్లంతే: అఖిలేశ్

image

దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400 సీట్ల నినాదం చేస్తోందని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. అదే జరిగితే రిజర్వేషన్లతోపాటు ప్రజల ఓటు హక్కునూ లాగేసుకుంటారని చెప్పారు. ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలతో కార్పొరేట్లను బెదిరించి ఎన్నికల బాండ్ల రూపంలో కమలం పార్టీ రూ.వందల కోట్లు దోచుకుందని ఆరోపించారు. పదేళ్లలో దేశవ్యాప్తంగా లక్ష మంది రైతులు చనిపోతే కేంద్రం సాయం చేయలేదని మండిపడ్డారు.