news

News April 15, 2024

భర్తల గెలుపు కోసం ప్రచార బాధ్యతలు

image

AP: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్న TDP, YCP అధినేతలు చంద్రబాబు, జగన్‌ల కోసం వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. నేతల ఇలాకాల్లో ప్రచార బాధ్యతల్ని భుజస్కందాలపై వేసుకుంటున్నారు. YS భారతి ఎన్నికలు పూర్తయ్యే వరకు పులివెందులలోనే ఉండనున్నారు. ఇటు CBN సతీమణి కుప్పంలో, నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటిస్తున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురంలో ప్రజలతో మమేకమవుతున్నారు.

News April 15, 2024

సంతోషంగా లేకపోతే 10 రోజులు సెలవు

image

వ్యక్తిగత, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా చైనాలోని పాంగ్ డాంగ్ లై అనే రిటైల్ కంపెనీ కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. సంతోషంగా లేని ఉద్యోగులకు 10 రోజుల అదనపు సెలవులు ఇస్తామని ఆ సంస్థ ఛైర్మన్ డాంగ్లాయ్ ప్రకటించారు. ‘ప్రతి ఉద్యోగికీ స్వేచ్ఛ ఉండాలని నేను కోరుకుంటా. అందుకే ఎవరైనా సంతోషంగా లేకపోతే ఆఫీస్‌కు రావొద్దు’ అని పేర్కొన్నారు.

News April 15, 2024

ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తాం: ఉత్తమ్

image

TG: రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని, గతేడాది కంటే వారం ముందే ప్రారంభించామని చెప్పారు. 6,919 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, నిన్నటి వరకు 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.

News April 15, 2024

14వేలమంది తొలగింపు.. టెస్లా నిర్ణయం

image

తమ ఉద్యోగులకు కార్ల తయారీ సంస్థ టెస్లా షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాఫ్‌లో 14వేలమందిని తొలగించాలని నిర్ణయించింది. గత డిసెంబరు నాటికి ఆ సంస్థలో 1.40 లక్షలమంది పనిచేస్తున్నారు. తాజా నిర్ణయంతో వారిలో 14వేలమందిపై ప్రభావం పడనుంది. ఏ విభాగాల వారిని తొలగిస్తున్నదీ సంస్థ వివరించలేదు. గత కొన్ని నెలలుగా టెస్లా అమ్మకాలు బాగా తగ్గడంతో ఖర్చును అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News April 15, 2024

IPL: టాస్ గెలిచిన RCB

image

బెంగళూరులో SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సిరాజ్‌ స్థానంలో యశ్ దయాళ్‌, మ్యాక్సీ బదులు ఫెర్గుసన్‌ను బెంగళూరు జట్టులోకి తీసుకొచ్చింది.
RCB జట్టు: డుప్లెసిస్, కోహ్లీ, జాక్స్, పాటీదార్, లోమ్రోర్, దినేశ్ కార్తీక్, సౌరవ్, వైశాఖ్, యశ్ దయాళ్, ఫెర్గుసన్, టోప్లే
SRH జట్టు: హెడ్, అభిషేక్, మార్క్రమ్, నితీశ్, క్లాసెన్, సమద్, షాబాజ్, కమిన్స్, భువీ, ఉనాద్కత్, నటరాజన్

News April 15, 2024

ముఖ్యమంత్రి భద్రత కోసమే కరెంట్ కట్ చేశాం: CP

image

CM జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై విజయవాడ CP కాంతిరాణా టాటా మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి భద్రత కోసమే కరెంట్ కట్ చేశాం. కరెంట్ తీయడం సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమే. సీఎంను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి బలంగా రాయి విసిరాడు. అది CMకు తాకి, పక్కనే ఉన్న వెల్లంపల్లికి తగిలింది. 8 బృందాలను ఏర్పాటు చేశాం. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం. చీకటి, జనాల రద్దీని ఆసరా చేసుకుని దాడి చేశాడు’ అని తెలిపారు.

News April 15, 2024

హిట్‌మ్యాన్ అంటార్రా బాబూ..

image

రోహిత్ శర్మ పేరు చెప్పగానే సిక్సర్లు గుర్తుకొస్తాయి. వన్డేల్లో, టీ20ల్లో, IPLలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ రోహితే. అలాగే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ యాక్టివ్ ప్లేయర్ అతడే. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో హిట్‌మ్యాన్ 597 సిక్సర్లు కొట్టారు. IPLలో 272 సిక్సర్లు సాధించారు.

News April 15, 2024

జగన్ అనే నేను.. మళ్లీ మీ ముందుకి వస్తా: జగన్

image

AP: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మూడు సెంట్ల స్థలం, రుణమాఫీ, సింగపూర్ తరహా అభివృద్ధి లాంటి హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ దుయ్యబట్టారు. ‘మళ్లీ బాబు, దత్తపుత్రుడు, BJP కలిసి వస్తున్నారు. లంచాలు లేని పాలన కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలి. 175కి 175 సీట్లలో ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు.. సిద్ధమేనా. దేవుడి దయతో జగన్ అనే నేను మళ్లీ మీ ముందుకి వస్తాను’ అని ఘంటాపథంగా చెప్పారు.

News April 15, 2024

రైల్వేలో 4,660 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం

image

RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208) భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. మే 14న రాత్రి 11.59 వరకు అప్లై చేసుకోవచ్చు. SI అభ్యర్థులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/

News April 15, 2024

బాబు చేష్టలకు కడుపు రగులుతోంది: జగన్

image

AP: ప్రతి గ్రామంలో తన మార్క్ పాలన కనిపిస్తుందని CM జగన్ చెప్పారు. ‘చంద్రబాబు మార్క్ అంటే పచ్చపాముల కాట్లు. రైతులకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు ఇవ్వొద్దన్నది బాబే. ఆయన చేసిన పనులకు కడుపు రగిలిపోతోంది. విద్య, వైద్య, సంక్షేమ రంగాల్లో మా సంస్కరణలు చూసి ఆయన కడుపు మండుతోంది. SC, ST, BC, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇంటింటికీ అభివృద్ధిని తెచ్చిన YCPకి అండగా నిలబడండి’ అని కోరారు.