India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్‌లో న్యాయవ్యవస్థను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి 21మంది విశ్రాంత న్యాయమూర్తులు లేఖ రాశారు. కొన్ని ముఠాలు తెలివిగా వ్యవహరిస్తూ న్యాయవ్యవస్థపై ఒత్తిడిని తీసుకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే కొంతమంది, ప్రజల్లో కోర్టులపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి న్యాయాన్ని రక్షించాలని సీజేఐను కోరారు.
గ్లోబల్ స్టార్ జూ.ఎన్టీఆర్ వార్-2 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఆయన్ను నటి ఊర్వశీ రౌతేలా కలిశారు. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా సెల్ఫీ తీసుకున్న ఆమె ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఎన్టీఆర్ గారు.. మీరే నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. మీ క్రమశిక్షణ, వ్యక్తిత్వం ప్రశంసనీయం. త్వరలో మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చారు.
అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ చిత్రం ‘సైతాన్’. గత నెల 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ మే 3న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.
MLC కవితను కోర్టులో హాజరుపర్చిన సందర్భంలో ఆమెపై జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడొద్దని సీరియస్ అయ్యారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకే తాను బదులిచ్చానని కవిత చెప్పడంతో.. అయినా సరే ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మరోసారి అలా మాట్లాడొద్దని జడ్జి సూచించారు. కాగా ‘ఇది CBI కస్టడీ కాదు, BJP కస్టడీ. బయట BJP అడిగిందే, లోపల CBI అడుగుతోంది’ అని కవిత వ్యాఖ్యానించారు.
TG: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని BJP రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. గత BRS ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మార్పు అంటే KCR కుటుంబం పోయి.. సోనియా కుటుంబం వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలు అంటే మోసం చేసేవా? అని ప్రశ్నించారు.
AP: వివేకా హత్య కేసులో న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు ఆయన కుమార్తె సునీత వెల్లడించారు. HYDలో ఈ కేసు వివరాలను బయటపెట్టిన ఆమె.. ‘జగన్‌తో మాట్లాడేందుకు నేను సిద్ధం. గతంలో కొన్నిసార్లు CMతో మాట్లాడా. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అందుకోసం సీఎంకు ఎన్నో లేఖలు రాశా. హత్య జరిగిన సమయంలో అవినాశ్ రెడ్డి, గంగిరెడ్డి మధ్య ఫోన్‌కాల్స్ ఉన్నాయి. దీనిపై సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందే మార్గాలు ఇవేనంటూ పలు ఏఐ ఫొటోలను క్రియేట్ చేశారు. అందులో ఫన్నీగా ఉన్న ఐస్ హెల్మెట్, ఐస్ స్కూటీ, ఐస్ సోఫా వంటి ఇమేజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
AP: రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో మాట్లాడుతూ.. ‘బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పింది. మరోసారి అధికారంలోకి వస్తున్నాం.. ఆందోళన వద్దు. ఎలాంటి దాడులూ నన్ను ఆపలేవు. ధైర్యంతో ముందడుగు వేద్దాం’ అని పేర్కొన్నారు.
TG: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తాము కాంగ్రెస్ పార్టీకి బీటీమ్ అని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలే వచ్చి తమను కలుస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీలే తమతో కలుస్తాయని.. అన్ని ప్రభుత్వాలతో పని చేయించుకుంటామన్నారు. ఎంఐఎం చాలా బలమైన పార్టీ అని.. తమను ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు.
TG: హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. అన్నదాతలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా సాయం చెల్లించాలని, రైతు కూలీలకు రూ.12వేలు, వరికి రూ.500 బోనస్ ఇవ్వాలని పార్టీ శ్రేణులతో కలిసి కిషన్ దీక్షలో కూర్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.