news

News April 15, 2024

ఎంఐఎంను ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదు: అక్బరుద్దీన్

image

TG: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తాము కాంగ్రెస్ పార్టీకి బీటీమ్ అని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలే వచ్చి తమను కలుస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీలే తమతో కలుస్తాయని.. అన్ని ప్రభుత్వాలతో పని చేయించుకుంటామన్నారు. ఎంఐఎం చాలా బలమైన పార్టీ అని.. తమను ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు.

News April 15, 2024

రైతు దీక్ష చేపట్టిన కిషన్ రెడ్డి

image

TG: హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి రైతు దీక్ష చేపట్టారు. అన్నదాతలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా సాయం చెల్లించాలని, రైతు కూలీలకు రూ.12వేలు, వరికి రూ.500 బోనస్ ఇవ్వాలని పార్టీ శ్రేణులతో కలిసి కిషన్ దీక్షలో కూర్చుకున్నారు.

News April 15, 2024

బైజూస్ సీఈఓ రాజీనామా

image

ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సీఈఓ అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. 6నెలల క్రితమే ఆయన ఈ పోస్టులో చేరడం గమనార్హం. సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆ బాధ్యతల్ని చూసుకోనున్నారని సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. మోహన్ బయటి నుంచి సలహాదారుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. తాము చేపట్టిన ఈ పునర్నిర్మాణం ‘బైజూస్ 3.0’కి ఆరంభమని రవీంద్రన్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

News April 15, 2024

గోల్డ్ రేట్ దూకుడు

image

పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.73,150కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.67,050గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ కేజీ రూ.500 పెరిగి రూ.89,500గా ఉంది.

News April 15, 2024

కవిత విచారణకు సహకరించలేదు: సీబీఐ

image

మూడు రోజుల కస్టడీలో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహకరించలేదని సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్ర నుంచి తీసుకున్న నగదుపై ప్రశ్నించామని.. పొంతన లేని జవాబులు చెప్పారని తెలిపింది. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగల వ్యక్తి కవిత అని ఆరోపించింది. ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని జుడీషియల్ కస్టడీ కోరినట్లు తెలిపింది.

News April 15, 2024

గుర్తుతెలియని వ్యక్తులకు థాంక్స్: హుడా

image

పాకిస్థాన్‌లో అమీర్ సర్ఫరాజ్ అనే మాఫియా డాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. పాక్‌ జైల్లో ఉన్న భారతీయుడు సరబ్‌జిత్‌ను అమీర్ గతంలో హత్య చేశాడు. దీంతో అమీర్‌ను చంపినవారికి భారత నటుడు రణ్‌దీప్ హుడా ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ‘థాంక్యూ ‘అన్‌నోన్ మెన్’. అమరుడు సరబ్‌జీత్‌కు కొంత న్యాయం జరిగింది’ అని పోస్ట్ చేశారు. సరబ్‌జిత్ బయోపిక్‌లో రణ్‌దీప్ నటించిన సంగతి తెలిసిందే.

News April 15, 2024

DON’T MISS.. 18 ఏళ్లు పైబడిన వారికి అలర్ట్

image

తెలుగు రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన యువతకు అలర్ట్. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలంటే దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఇవాళ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఓటరు జాబితాలో చోటు కల్పించనున్నారు. తుది ఓటర్ల జాబితాకు అనుబంధంగా ఈ జాబితాను ప్రదర్శిస్తారు. అందులో పేర్లు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. ఓటు నమోదు చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 15, 2024

ఇరు జట్ల మధ్య తేడా అదే: హార్దిక్

image

నిన్నటి మ్యాచులో CSKపై ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్ల మధ్య తేడా ఏంటని హార్దిక్‌ను ప్రశ్నించగా.. ‘CSKకు స్టంప్స్ వెనుక మాస్టర్ మైండ్ ఉంది. ఏం చేస్తే వర్కౌట్ అవుతోందో ధోనీకి తెలుసు. రెండు జట్ల మధ్య ఉన్న తేడా అదే’ అని అన్నారు. మరోవైపు CSK బ్యాటింగ్ సమయంలో చివరి ఓవర్ హార్దిక్ బౌలింగ్ చేయాల్సింది కాదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News April 15, 2024

కవిత అరెస్ట్.. @ 30రోజులు

image

లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టై నేటికి నెల రోజులైంది. మార్చి 15న HYDలోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైలుకు తరలించారు. ఇదే కేసులోకి రంగప్రవేశం చేసిన సీబీఐ ఆమెను ఈ నెల 12న మరోసారి అరెస్ట్ చేసింది. తాజాగా ఏప్రిల్ 23 వరకు కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది.

News April 15, 2024

సీఎం జగన్‌కు భారీ భద్రత

image

AP: ఇటీవల దాడి నేపథ్యంలో CM జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో DSPలతో భద్రత కల్పిస్తారు. CM రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్‌కు ఒక DSP, ఇద్దరు CIలు, నలుగురు SIలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే CM రోడ్‌షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.