India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇవాళ నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మరోవైపు తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లాలో జలదీక్ష చేయనుంది. ఈ దీక్షలో హరీశ్ రావు, RS ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు.
CSKతో మ్యాచులో రోహిత్ సెంచరీ కోసమే ఆడాడు కానీ.. జట్టు విజయం కోసం ప్రయత్నించలేదంటూ ట్విటర్‌లో ట్రోలింగ్ మొదలైంది. అతడు ‘సెల్ఫిష్’ అంటూ ఆ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే రోహిత్ ఒక్కడే నిలబడినా మిగతా ప్లేయర్ల నుంచి సహకారం అందలేదని అతడి ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. చివర్లో రోహిత్‌కు స్ట్రైకింగ్ కూడా సరిగా రాలేదని, అందుకు అతడేం చేస్తాడంటూ మండిపడుతున్నారు.
ఎన్నికల వేళ ఒడిశాలోని కోర్టుల్లో భారీగా బెయిల్ పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వాలని విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలు కోరుతున్నారట. అయితే ఎన్ని పిటిషన్లు దాఖలయ్యాయి, ఎవరికైనా బెయిల్ వచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇలా పెద్ద మొత్తంలో ఓటు కోసం బెయిల్ పిటిషన్లు రావడం ఇదే తొలిసారని అంటున్నారు నిపుణులు. మే 13 నుంచి జూన్ 1 మధ్య ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
AP: పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండూ ఒకటేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ప్రసంగించే జగన్ ఆ వర్గాలకు చేసిందేమీ లేదు’ అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే దళితులకు రెండెకరాల సాగుభూమి అందిస్తామని బాలయ్య హామీ ఇచ్చారు.
IPLలో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. బెంగళూరు వేదికగా SRH, RCB మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 5 మ్యాచులాడి మూడింట గెలిచిన SRH.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆడిన 6 మ్యాచుల్లో ఒకే ఒక్కటి గెలిచి టేబుల్‌లో చిట్టచివరి స్థానంలో ఉన్న RCB.. ఇవాళ ఎలాగైనా SRHపై నెగ్గాలని భావిస్తోంది. మరి ఎవరు విజేతగా నిలుస్తారని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ మూడు రోజుల గడువు ముగియడంతో నేడు ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. సీబీఐ అధికారులు మరోసారి ఆమె కస్టడీ గడువు పొడిగించమని కోరుతారో లేక జుడీషియల్ కస్టడీకి తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కవితకు ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిలును నిరాకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు రేపు రెగ్యులర్ బెయిల్‌పై విచారణ జరగనుంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం కానుంది. 8వ తేదీలోపు పూర్తి కానుంది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఈసీ కల్పించింది. దరఖాస్తు చేసుకున్నవారికే ఈ అవకాశం కల్పించనున్నారు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, కేంద్ర సర్వీసుల్లోని సిబ్బంది, దివ్యాంగులు కూడా పోస్టల్ ఓటును వినియోగించుకోనున్నారు.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.jksasb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. కాగా ఈ యాత్రకు 13 నుంచి 70 ఏళ్ల మధ్య వారినే అనుమతిస్తారు.
AP: సముద్రంలో చేపల వేటపై నేటి నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 14 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు రెండు నెలల పాటు విరామం లభించనుంది. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ఏటా ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. కాగా ఈ విరామం సమయంలో కుటుంబానికి రూ.10వేలు చొప్పున మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
AP: విజయవాడలో రాయి దాడి నేపథ్యంలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నిన్న బ్రేక్ పడగా.. ఈరోజు మళ్లీ ప్రారంభం కానుంది. కేసరపల్లి నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జగన్ జొన్నపాడు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు గుడివాడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.