India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్రకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.jksasb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. కాగా ఈ యాత్రకు 13 నుంచి 70 ఏళ్ల మధ్య వారినే అనుమతిస్తారు.
AP: సముద్రంలో చేపల వేటపై నేటి నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 14 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులకు రెండు నెలల పాటు విరామం లభించనుంది. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ఏటా ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. కాగా ఈ విరామం సమయంలో కుటుంబానికి రూ.10వేలు చొప్పున మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
AP: విజయవాడలో రాయి దాడి నేపథ్యంలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నిన్న బ్రేక్ పడగా.. ఈరోజు మళ్లీ ప్రారంభం కానుంది. కేసరపల్లి నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జగన్ జొన్నపాడు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు గుడివాడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు.
TG: రాష్ట్రంలో నిన్నటి పోలిస్తే నేడు, రేపు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. మూసాపేటలో గరిష్ఠంగా 41 డిగ్రీలు నమోదైంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై భారత్ ఆచితూచి వ్యవహరించింది. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ దాడి చేసినప్పుడు భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గొడవ ఇరాన్‌తో కావడంతో భారత్ అప్రమత్తమైంది. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ కీలక దేశం కావడం, ఆ ప్రాంతంలోని దేశాలతో భారత్ సత్సంబంధాలు కోరుకోవడమే ఇందుకు కారణం. అందుకే చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరాన్-ఇజ్రాయెల్‌కు భారత్ సూచించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. మిడిల్ ఈస్ట్ పతనం అంచున ఉందని, ఆ ప్రాంతం సహా ప్రపంచ దేశాలు ఇక యుద్ధాలను తట్టుకోలేవన్నారు. ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. కాగా ఇరాన్ మిసైల్ దాడులను ఇజ్రాయెల్ దీటుగా ఎదుర్కొంది. అయితే ఎదురుదాడిపై ఆలోచించుకోవాలని ఇజ్రాయెల్‌ను మిత్రదేశాలు హెచ్చరిస్తున్నాయి.
UPSC పరీక్షలకు సన్నద్ధం కావడంపై యూట్యూబ్‌లో వచ్చే వ్లోగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు IAS ఆఫీసర్ అవనీశ్ శరణ్. 18 లేదా అంతకంటే ఎక్కువ గంటలు చదవాలంటూ ఆ వ్లోగ్స్ అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. సక్సెస్ కావాలంటే అన్ని గంటలు చదవాల్సిన అవసరం లేదన్నారు. ఆ వీడియోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఆయన ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ‘మీరు చెప్పింది నిజమే’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎన్నికల వేళ యూపీ మాజీ సీఎం, బీఎస్‌పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. ‘బీజేపీ మరోసారి అధికారంలోకి తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఓటింగ్ మెషీన్స్ ట్యాంపర్ కాకుండా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీ గెలవదు. ధనికులను మరింత సంపన్నులుగా తీర్చిదిద్దేందుకే బీజేపీ కృషి చేస్తోంది’ అని విమర్శించారు.
ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా మహారాష్ట్రలో BJP, శివసేన (ఏక్‌నాథ్ వర్గం), NCP (అజిత్ పవార్ వర్గం) కూటమి సీట్ల పంపకంపై తర్జనభర్జన పడుతోంది. రత్నగిరి-సింధుదుర్గ్, సతారా, ఔరంగాబాద్, నాశిక్, థానే, పాల్‌గఢ్ సహా ముంబైలోని సౌత్, నార్త్ వెస్ట్, నార్త్ సెంట్రల్ సీట్లపైనే ఈ కన్ఫ్యూజన్ అంతా. మే 7న సతారా, రత్నగిరిలో పోలింగ్ జరగనుండగా.. 13న ఔరంగాబాద్‌లో, మిగతా ఆరు చోట్ల 20న పోలింగ్ జరగనుంది. <<-se>>#Elections2024<<>>
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇటీవల సరికొత్త గరిష్ఠాలను తాకాయన్న సంతోషం మదుపర్లకు ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం రూపంలో ఇప్పుడు మార్కెట్లకు మరో సవాల్ ఎదురైంది. ఈ పోరు ముదిరితే అది మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, ఇదే జరిగితే అతిపెద్ద ఇంధన దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌పై ఆ ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.