India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిబంధనలు ఉల్లంఘించిన భారతీయుల ఖాతాలను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) నిషేధించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య మొత్తం 2,12,627 ఖాతాలపై వేటు వేసినట్లు పేర్కొంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పింది. వీటిలో చిన్నారులపై లైంగిక వేధింపులు, అడల్ట్ కంటెంట్‌ను ప్రోత్సహించే ఖాతాలు ఉన్నట్లు తెలిపింది.
వాంఖడే స్టేడియంలో MIతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచిన్(21), రహానే(5) నిరాశపర్చగా.. గైక్వాడ్, శివమ్ దూబే చెలరేగి ఆడారు. రుతురాజ్ 40 బంతుల్లో (5 ఫోర్లు, 5 సిక్సులు) 69 రన్స్ చేయగా.. దూబే 38 బంతుల్లో 66 రన్స్ చేశారు. చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కొయెట్జీ, గోపాల్ తలో వికెట్, హార్దిక్ 2వికెట్లు తీశారు.
AP: తన అన్న చిరంజీవి రెండు రోజుల కిందట జనసేనకు రూ.5 కోట్ల విరాళం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. తెనాలి సభలో మాట్లాడుతూ.. ‘ప్రజల కోసం బలంగా నిలబడ్డానని అన్న నన్ను ప్రశంసించారు. కౌలు రైతుల కోసం నేను చేసిన సాయం తనను కరిగించిందని చెప్పారు. నా పోరాటం ఆగకూడదని విరాళం ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే రామ్ చరణ్‌ను కూడా సాయం చేయాలని చెప్పారు. వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
నటి ఊర్వశీ రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచారు. గతంతో ఆమె క్రికెటర్ రిషభ్ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అయితే వీటిపై పంత్ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఈ భామ ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కరీమ్ బెంజెమాతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ‘బెంజెమాతో డేటింగ్ చేస్తున్నారా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
AP: ప్రతి వ్యక్తిలో ఏ నైపుణ్యం, శక్తి ఉందో గుర్తించాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘కులగణన మాత్రమే కాదు.. ప్రతిభా గణన కూడా జరగాలి. ప్రతిభను గణించి మహిళలకు అవకాశాలు కల్పించాలి. పశ్చిమగోదావరి నుంచి విదేశాలకు షూ లేసులు ఎగుమతి అవుతున్నాయి. ఈ స్థాయిలో ప్రతి మహిళా ఏదో ఒక నైపుణ్యం పెంచుకోవాలి. ప్రతి గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు ఏర్పాటుచేస్తాం’ అని హామీ ఇచ్చారు.
AP: జగన్‌కు అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ‘చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది. బోండా ఉమ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. జగన్‌పై దాడికి చంద్రబాబు, లోకేశ్, బోండా ఉమానే కారణం. విజయవాడలో అల్లర్లు సృష్టించాలన్నదే వారి కుట్ర. దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
AP: జగన్‌కు చిన్న గాయమైతే రాష్ట్రమంతా ఊగిపోతుందని.. సగటు మనిషికి గాయమైతే మనకు బాధ లేదా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘జగన్‌కు గాయమైతే నాకు బాధగా ఉంది. ఇది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? నాన్న పులి కథ ఒకసారి చెబితే బాగుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెబితే ఎవరు నమ్ముతారు? ఈ నాటకాలు ఆపండి చాలు. భరించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఇలాంటి డ్రామాలను నమ్మకండి’ అని ఆయన తెనాలి సభలో కోరారు.
AP: విజయవాడలో రాయి దాడి ఘటనతో CM జగన్ మేమంతా సిద్ధం యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా రేపు జగన్ యాత్ర కేసరపల్లి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, జొన్నపాడు మీదుగా యాత్ర గుడివాడ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుని రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారు.
AP: విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల <<13054000>>దాడిని<<>> వైసీపీ Xలో ఖండించింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. కాగా నిన్న ఆగంతకుల రాయి దాడిలో సీఎం జగన్‌కు గాయమైన విషయం తెలిసిందే. ఇవాళ తెనాలి సభలో పవన్ పైనా దుండగులు రాళ్లు విసరగా, ఆయనకు దూరంగా పడ్డాయి.
AP: సీఎం జగన్‌పై నిన్న జరిగిన దాడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘రాయి పడింది అని.. రాష్ట్రానికి గాయమైందని వైసీపీ నేతలు బాధపడుతున్నారు. అక్కను ఏడిపిస్తున్నారని ఎదిరించిన 15 ఏళ్ల అమర్నాథ్ గౌడ్‌ను చెరుకు తోటలో పెట్రోల్ పోసి కాల్చేశారు. పసిబిడ్డను కాల్చేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా?’ అని తెనాలి సభలో పవన్ ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.