India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, సలార్-2, ఫౌజీ సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. వీటిని పూర్తిచేసి ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నారు. అయితే, ఈ మూవీ కథ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘ప్రభాస్ పోలీసు పాత్రలో నటిస్తారు. కానీ కథలో మలుపుల కారణంగా ఆయన గ్యాంగ్‌స్టర్‌గా మారుతారు. భారీ వైల్డ్ ఎలిమెంట్స్ మూవీకి హైలైట్‌గా నిలుస్తాయి’ అని పుకార్లు వినిపిస్తున్నాయి.
పని భారం, ఎక్కువ గంటలు వర్క్ చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కానీ ఐస్‌లాండ్ వారానికి 4 రోజులే పని చేయిస్తూ విజయం పొందింది. 2020- 2022 మధ్య డేటాను సమీక్షించగా తక్కువ పని గంటలు ఐస్‌లాండ్ ఆర్థిక వ్యవస్థను యూరప్‌లోని బలమైన వాటిలో ఒకటిగా మార్చడంలో సహాయపడినట్లు తేలింది. వారానికి 35-36 గంటలు పనిచేయడంతో ఉద్యోగిపై ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడినట్లు గుర్తించారు.
భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆ జట్టు 49.5 ఓవర్లు ఆడి 232 పరుగులు చేసింది. బ్లాక్ క్యాప్స్‌లో బ్రూక్ హాలీడే (86) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నారు. ప్లిమ్మర్ (39), గేజ్ (25) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, రేణుక, సైమా ఠాకూర్ ఓ వికెట్ సాధించారు. భారత్ గెలవాలంటే 233 పరుగులు చేయాల్సి ఉంది.
ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా 70ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఉచితంగా రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆధార్‌లో వయసును బట్టి అర్హులు <
నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సర్కార్ సీతారామ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీపావళి రోజున టైటిల్‌తో పాటు టీజర్ కూడా రివీల్ చేయనున్నట్లు టాక్. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుంది.
TG: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ చేపడతామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు అధిష్ఠానం(ఏఐసీసీ)తో గ్యాప్ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏఐసీసీ అంటే తానేనని మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన పేర్కొన్నారు. రోజులో ఎనిమిది గంటలు మూసీపైనే పని చేస్తున్నానని తెలిపారు. హైడ్రా వల్లే HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా ‘రియల్’ రంగంలో స్తబ్దత ఏర్పడిందని CM చెప్పారు.
<<14476260>>వివాదాస్పదంగా మారిన<<>> తన రూ.2 లక్షల బ్యాగ్‌పై ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిశోరీ వివరణ ఇచ్చారు. ‘డబ్బులు సంపాదించొద్దని, అన్నీ వదిలేయాలని నేనెప్పుడూ అనలేదు. లెదర్ వాడని ఆ బ్యాగ్‌ను నేను ప్రత్యేకంగా చేయించుకున్నాను. నేనూ అందరు అమ్మాయిల్లాంటిదాన్నే. సాధారణమైన ఇంట్లో తల్లిదండ్రులతో జీవితాన్ని గడిపే మనిషినే. కష్టపడి సంపాదించి మంచి జీవితాన్ని గడపాలనే అనుకుంటాను. నేను బోధించేది కూడా అదే’ అని తెలిపారు.
AP: చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసులో ఇద్దరు నిందితులకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఖైదీల విడుదల సాధన సమితి ప్రభుత్వాన్ని కోరింది. 32 ఏళ్లుగా వారు జైల్లో మగ్గిపోతున్నారని హోంమంత్రి, న్యాయశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. 1993లో హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట వెళ్తున్న బస్సును చలపతి, విజయవర్ధన్ దోచుకోవడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు ఎదురుతిరగడంతో పెట్రోల్ చల్లి నిప్పు పెట్టడంతో 23 మంది దుర్మరణం చెందారు.
TG: మీడియాతో చిట్‌చాట్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టులు రద్దు చేశామని, త్వరలోనే వాళ్లు అరెస్ట్ అవుతారని చెప్పారు. ఇక బీఆర్ఎస్ నేతలు మూసీ పరీవాహక ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని, దమ్ముంటే కేటీఆర్, హరీశ్, ఈటల తనతో రావాలని సవాల్ విసిరారు.
సినీ అభిమానులకు రేపు డబుల్ ట్రీట్ లభించనుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ‘జై హనుమాన్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా నుంచి కూడా టైటిల్ & ఫస్ట్‌లుక్ రేపు సాయత్రం 4.05 గంటలకు విడుదలవనుంది. దీంతో దీపావళి తమకు ముందుగానే వచ్చేస్తోందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.