news

News April 14, 2024

బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా?: చంద్రబాబు

image

AP:విశాఖలో తనపై రాళ్లు వేసిన ఘటనపై చంద్రబాబు ఫైరయ్యారు. ‘విజయవాడలో CMపై ఎవరో రాయి విసిరారు. ఈ ఘటనను అందరూ ఖండించారు. నేను రాళ్లు వేయించినట్లు కొన్ని పేటీఎం బ్యాచ్ కుక్కలు మొరిగాయి. కోడికత్తి డ్రామా, బాబాయి హత్యను నాపై నెట్టాలని చూశారు. CMపై దాడి జరిగి 24 గంటలు అవుతున్నా.. నిందితులను పట్టుకోలేదు. ఇప్పుడు నాపై రాళ్లు విసిరారు. క్లెమోర్ మైన్స్‌కే నేను భయపడలేదు, ఈ రాళ్లకు భయపడతానా?’ అని ప్రశ్నించారు.

News April 14, 2024

ఆయనే నా ఫేవరెట్ బ్యాటర్: క్లాసెన్

image

ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరిగా SRH కీపర్ హెన్రిచ్ క్లాసెన్ పేరు తెచ్చుకున్నారు. స్పిన్ బౌలింగ్‌లో సిక్సులు అంత సులువుగా కొట్టడం వెనుక కారణాల్ని ఆయన క్రిక్‌బజ్ ఇంటర్వ్యూలో వివరించారు. ‘స్వదేశంలో నాకు అద్భుతమైన స్పిన్నర్లు బౌలింగ్ చేశారు. వారిని ఎదుర్కొనే క్రమంలో మరింత మెరుగయ్యా. గేల్ నా ఫేవరెట్ బ్యాటర్. అందుకే తన జెర్సీ నంబర్‌నే(45) నేను కూడా ధరిస్తుంటాను’ అని స్పష్టం చేశారు.

News April 14, 2024

ఇసుక పేరుతో జగన్ రూ.లక్షల కోట్ల దోపిడీ: బాలకృష్ణ

image

AP: వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమని, YCP ఫ్యాన్ 3 రెక్కలు విరిగిపోవడం ఖాయమని బాలకృష్ణ జోస్యం చెప్పారు. అనంతపురం(D) కల్లూరులో మాట్లాడుతూ.. ‘ఇసుక అమ్ముకుని CM జగన్ రూ.లక్షల కోట్లు సంపాదించారు. జే బ్రాండ్ పేరుతో మహిళల తాళి బొట్లు తెంచుతున్నారు. దళితులకు అండగా ఉంటానని చెప్పి హత్య చేస్తున్నారు. SC, STలకు చెందిన 25 పథకాలను రద్దు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారు’ అని మండిపడ్డారు.

News April 14, 2024

ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీ సమస్యలు: సర్వే

image

ఫెయిర్‌నెస్ క్రీములతో భారత్‌లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని తాజా సర్వేలో తేలింది. అధికంగా పాదరసం వాడటమే దీనికి కారణమని పేర్కొంది. ఈ క్రీములను ఉపయోగించడంతో మెంబ్రేనస్ నెఫ్రోపతి(MN) కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తూ ప్రొటీన్ లీకేజీకి కారణమవుతుందని తెలిపింది. ఆరోగ్యానికి హాని చేసే ఈ తరహా ఉత్పత్తుల వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

News April 14, 2024

ఐపీఎల్ చరిత్రలో లాంగెస్ట్ ఓవర్

image

కోల్‌కతాతో డెబ్యూ మ్యాచ్‌లో లక్నో బౌలర్ షమర్ జోసెఫ్ ఘోరంగా విఫలమయ్యారు. 4 ఓవర్లలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నారు. మూడు క్యాచ్‌లు సైతం వదిలేశారు. తొలి ఓవర్‌లో పది బాల్స్ వేసి (0, L1, 4, 2, b1, nb, Wd, Wd4, nb, 6) ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మొత్తం 7 వైడ్‌లు, 3 నో బాల్స్ వేశారు. అతని వల్లే మ్యాచ్ చేజారిపోయిందని లక్నో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

News April 14, 2024

మీ గురించి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు పవన్?: ఆర్జీవీ

image

‘నిన్ను నువ్వు తెలుసుకో’ అంటూ శ్రీ రమణ మహర్షి చెప్పిన వాక్యం తనకు ఎంతో నేర్పిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ సాధారణ వాక్యం విశ్వం మొత్తానికి అనుసంధానమై ఉంటుందన్నారు. దీనికి డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్లు వేశారు. ‘మరి మీ గురించి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు సార్? నా అంచనా ప్రకారం చంద్రబాబు గురించి తెలుసుకున్న తర్వాతే మీకు తెలుస్తుంది’ అని రాసుకొచ్చారు.

News April 14, 2024

అయోధ్య రామయ్యకు 1,11,111 కిలోల లడ్డూ

image

ఈ నెల 17న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఆ రోజున భక్తులకు ప్రసాదం పంచేందుకు యూపీలోని మీర్జాపూర్ దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు 1,11,111 కిలోల లడ్డూలను తయారు చేస్తోంది. త్వరలోనే వాటిని అయోధ్యకు పంపుతామని ట్రస్టీ వెల్లడించారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ రోజున కూడా 40వేల కిలోల లడ్డూలను పంపినట్లు చెప్పారు.

News April 14, 2024

జగన్‌‌పై దాడి గురించి వైసీపీ నేతలకు ముందే తెలుసు: వర్ల రామయ్య

image

AP: సీఎం జగన్‌పై రాయి పడటం చిన్న స్టేజ్ డ్రామా అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. దాడి గురించి కొందరు వైసీపీ నేతలు, పోలీసులకు ముందే తెలుసని ఆరోపించారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే ధర్నాలు ఎలా చేశారు? వేగంగా ఫ్లకార్డులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. కరెంటు పోయిన వెంటనే సీఎంకు రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు కూర్చున్నారు? అని నిలదీశారు.

News April 14, 2024

పాక్‌లో సరబ్‌జిత్ హంతకుడి కాల్చివేత

image

పాకిస్థాన్‌లో మాఫియా డాన్ అమీర్ సర్ఫరాజ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. పాక్ జైల్లో భారతీయుడు సరబ్‌జిత్‌ను హత్య చేసింది ఇతడే కావడం గమనార్హం. లాహోర్‌లో ఉన్న అమీర్‌ను సమీపించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అమీర్ అక్కడికక్కడే హతమైనట్లు తెలుస్తోంది. గడచిన కొంతకాలంగా పాక్‌లోని గ్యాంగ్‌స్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అంతం చేస్తున్న సంగతి తెలిసిందే.

News April 14, 2024

IPL: టాస్ గెలిచిన ముంబై

image

వాంఖడేలో ముంబై, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ముంబై జట్టు: ఇషాన్, రోహిత్, హార్దిక్, తిలక్, డేవిడ్, నబీ, షెపర్డ్, శ్రేయస్ గోపాల్, బుమ్రా, కొయెట్జీ, మధ్వాల్

చెన్నై జట్టు: రుతురాజ్, రచిన్, రహానే, దూబే, మిచెల్, జడేజా, రిజ్వీ, ధోనీ, శార్దూల్, తుషార్, ముస్తాఫిజుర్