India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40KM వేగంగా గాలులు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ఏ రాత్రైనా తాము దాడి చేయొచ్చని, సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్‌ను ఇరాన్ తాజాగా హెచ్చరించింది. ‘మేమేం చేస్తామో ఇజ్రాయెల్‌కు తెలీదు. ఎక్కడ దాడి చేస్తామోనని బిక్కుబిక్కుమంటోంది. నిజమైన యుద్ధం కంటే ఈ మానసిక, రాజకీయ యుద్ధమే వారిని ఎక్కువ భయపడుతోంది’ అని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు రహీం తెలిపారు. సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయెల్ చేసిందని ఇరాన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయి దాడిపై వైసీపీ Xలో స్పందించింది. ‘మన నాయకుడు జగన్‌పై పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారు. మేమంతా సిద్ధం యాత్రకు వస్తోన్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక టీడీపీ మూకలు పిరికిపంద చర్యకు పాల్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించండి. ఈ దాడికి ప్రజలంతా మే 13న సమాధానం చెప్తారు’ అని పేర్కొంది.
AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమల్ హాసన్ బ్యాక్’ అంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో మరో డ్రామాకి తెరలేపారంటూ ఆరోపించింది.
వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక ఆయనపై టీడీపీ దాడి చేయించిందని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ‘ర్యాలీలో నేనూ ఆయనతో పాటే ఉన్నా. జనంలో జగన్‌కు విపరీతమైన క్రేజ్‌ను చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. గాయానికి రెండు కుట్లు పడే అవకాశం ఉంది. ఓవైపు కళ్లు బైర్లు కమ్మినా మళ్లీ యాత్రను జగన్ కొనసాగిస్తున్నారు. శత్రువులు ఏం చేసినా కూడా ఆయన సంకల్పాన్ని ఆపలేరు’ అని పేర్కొన్నారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని.. కొందరు నటులు దాన్ని సహించలేరని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అన్నారు. తాను ఎక్కువగా అలాంటి సినిమాలు చేయడం వల్లే తనతో నటించేందుకు హీరోలు ఇష్టపడరని చెప్పారు. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉంటుందనే ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. అలా అయితే స్టార్ కిడ్స్ అందరూ సక్సెస్ అయ్యేవారని పేర్కొన్నారు. తన నటన వల్లే అవకాశాలు దక్కాయని.. నేపథ్యం చూసి కాదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కేకే తాజా ఇంటర్వ్యూలో వెక్కి వెక్కి ఏడ్చారు. తన సొంత బిడ్డే తనకు బాధాకరమైన మెసేజ్ పెట్టేలా బీఆర్ఎస్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్‌ను నా సొంత పార్టీగా భావించా. కానీ నా బిడ్డతో ఉగాది రోజున ‘మీ కొడుకు పోయాడని అనుకోండి’ అంటూ మెసేజ్ పెట్టించారు. కుటుంబాల్ని విడదీసే రాజకీయాలెప్పుడూ నేను చేయలేదు. ఇది కేటీఆర్ చేశాడని అనట్లేదు. కానీ ఈ పరిస్థితి వచ్చింది’ అంటూ రోదించారు.
ములాన్‌పూర్‌లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 147 రన్స్ చేసింది. పేలవంగా మొదలైన పంజాబ్ ఇన్నింగ్స్ ఒక దశలో 120 కూడా దాటడం కష్టంలా కనిపించింది. చివర్లో అశుతోశ్ శర్మ(16 బంతుల్లో 31రన్స్) మెరుపులు మెరిపించడంతో 147కు చేరింది. RR బౌలర్లలో ఆవేశ్, కేశవ్ చెరో రెండు వికెట్లు, సేన్, చాహల్, బౌల్ట్ తలో వికెట్ తీశారు.
TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆ పార్టీ నేత ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. బురదజల్లడమే పనిగా పెట్టుకునే నేతలున్న నేటి రాజకీయాల్లో లాజిక్స్ మాట్లాడుతూ.. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే కేటీఆర్ వంటి లీడర్ దొరకడం చాలా అరుదు అని ప్రవీణ్ కుమార్ అన్నారు. చర్చలో తన వాదనను వినిపించడంలో కేటీఆర్ తీరు అమోఘం అన్నారు. టీవీ9లో ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్న నేపథ్యంలో RSP ఇలా స్పందించారు.
దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘12th Fail’ సినిమా ఇప్పటికే పలు పురస్కారాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో రికార్డు సృష్టించింది. గడచిన 23 ఏళ్లలో థియేటర్లలో 25 వారాలు రన్ అయిన ఏకైక హిందీ సినిమాగా చరిత్రకెక్కింది. హీరో విక్రాంత్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. పోటీ పరీక్షల కోసం విద్యార్థులు పడే కష్టాలే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.