India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోయంబత్తూరులోని ఓ షాపులో రాహుల్ గాంధీ మైసూర్‌పాక్ కొనుగోలు చేసిన <<13042145>>వీడియోపై<<>> సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఒకనాడు ఇదే గడ్డ(తమిళనాడు)పై తండ్రిని కోల్పోయిన రాహుల్ గాంధీ.. ప్రేమ మాత్రమే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని నమ్మే బలమైన నాయకుడు. దానికి చిన్న ఉదాహరణే ఈ దృశ్యం’ అని ట్వీట్ చేశారు. కాగా రాహుల్ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీపెరుంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
TG: ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదన్నారు. అలాంటి సంస్కృతి తమది కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పోటీయే కాదని.. 12 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోందని.. ఇందులో ఎవరున్నా బయటకు వస్తారని తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ గగనతలం మీదుగా ఆ సంస్థ విమానాలు ప్రయాణించట్లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతర మార్గాల్లో చాలా దూరం ప్రయాణించి యూరప్ వైపుగా వెళ్తున్నట్లు తెలిపాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో తమ పౌరులను ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని భారత్‌తో పాటు ఫ్రాన్స్, రష్యా కోరాయి.
ఇంటర్ ఫలితాల్లో పలు కాలేజీలు దారుణ ప్రదర్శన కనబర్చాయి. హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థల్లో ఫస్టియర్‌లో 27, సెకండియర్‌లో 28 చోట్ల ఒక్కరూ పాస్ కాలేదు. కేజీబీవీల్లోనూ ఫస్టియర్‌లో 10, సెకండియర్‌లో 6 చోట్ల అందరూ ఫెయిల్ అయ్యారు. ఇక హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్ తొలి ఏడాదిలో 72.31శాతం మంది, రెండో ఏడాదిలో 65.89శాతం మంది ఫెయిలయ్యారు.
TG: నలుగురు కీలక నేతల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓ టాస్క్‌ఫోర్స్ SI సహకారంతో డబ్బులు రవాణా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎస్కార్ట్ వాహనంలో ఆ డబ్బులను డెలివరీ చేసినట్లు గుర్తించారు. తన చిన్ననాటి మిత్రుడైన ఓ MLCకి రాధాకిషన్ పూర్తిస్థాయిలో సాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
AP: రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ‘జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సర్వనాశనమైంది. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారు. రాష్ట్రానికి ఒక పరిశ్రమ కానీ, విద్యాసంస్థ కానీ తీసుకురాలేకపోయారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొస్తాం. రాష్ట్రంలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సృష్టిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
సామాన్యులను బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ.760 తగ్గి రూ.72,550కు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.700 దిగి రూ.66,500గా నమోదైంది. అటు వెండి ధరల్లోనూ తగ్గుదల కనిపించింది. కేజీ సిల్వర్ రేట్ రూ.1000 తగ్గి రూ.89,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మెక్‌గుర్క్ రికార్డు సృష్టించారు. అరంగేట్ర మ్యాచులో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచారు. నిన్న LSGతో జరిగిన మ్యాచులో అతను 55 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో CSK మాజీ ప్లేయర్ మైఖేల్ హస్సీ (116*) తొలి స్థానంలో ఉన్నారు. 2008 సీజన్‌లో ఆయన తొలి మ్యాచ్ ఆడారు.
ఆర్సీబీ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు కనీసం రెండు మ్యాచ్‌ల్లోనైనా విశ్రాంతి ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. ‘సిరాజ్ గతేడాది అద్భుత ప్రదర్శన చేశారు. అతడో ఛాంపియన్ బౌలర్. కానీ ఐపీఎల్‌లో ఎందుకో తేలిపోతున్నారు. అతడు అలసిపోయినట్లు కనిపిస్తోంది. సిరాజ్ శారీరకంగా, మానసికంగా దృఢంగా లేరనిపిస్తోంది. అతడికి కొంచెం సమయమిస్తే మంచి కమ్‌బ్యాక్ ఇస్తారు’ అని ఆయన పేర్కొన్నారు.
TG: తమకు డ్రగ్స్ కావాలంటూ హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు ఖైదీలు ఆందోళన చేపట్టారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన విచారణ ఖైదీలు అక్కడి సిబ్బందిపై తిరగబడ్డారు. దీంతో జైలు అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రత్యేక బ్యారక్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై జైలు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.