news

News April 13, 2024

రేపు కవితను కలవనున్న కేటీఆర్

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి కవితను కలిసే అవకాశం ఉంది. సాయంత్రం 6-7 గంటల మధ్య ఆయన కవితతో భేటీ కానున్నట్లు సమాచారం.

News April 13, 2024

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా?

image

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల సమన్వయ కమిటీని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ ఒక్క ఎంపీ స్థానానికి కూడా ఆ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థులకు మద్దతిస్తుందా.. లేదా కొన్ని సీట్లలో పోటీ చేస్తుందా అనేదానిపై క్లారిటీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో JSP 8 చోట్ల పోటీ చేయగా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది.

News April 13, 2024

ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు: సిద్ద రామయ్య

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. MLAలకు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. అయితే ఈ ప్రక్రియలో బీజేపీ విఫలమైందని తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా లేరని చెప్పారు.

News April 13, 2024

విజయ్‌పై పోటీ చేస్తా: హీరోయిన్

image

వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(2026) కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతిపై తాను పోటీ చేస్తానని బీజేపీ నేత, హీరోయిన్ నమిత ప్రకటించారు. ‘రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్‌పై పోటీ చేయాలని అనుకుంటున్నా. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలి’ అని ఆమె పేర్కొన్నారు. కాగా విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

News April 13, 2024

ఆన్‌లైన్‌లో అయోధ్య రాముడి థీమ్ నాణేలు

image

అయోధ్య రాముడి థీమ్‌తో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాణేల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయోధ్యలోని రామ్ లల్లా, రామ జన్మభూమి దేవాలయం థీమ్‌తో కూడిన 3 సావనీర్ నాణేలను గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఎస్పీఎంసీఐఎల్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు.

News April 13, 2024

ఆస్ట్రేలియాలో కోహ్లీ హవా

image

ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేసిన ఆసియా వ్యక్తిగా టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచారు. దీంతో ఆస్ట్రేలియాలో మోస్ట్ పాపులర్, సెర్చ్‌డ్ పర్సన్‌గా కోహ్లీ ఆరోసారి నిలిచారు. 2017,18,19,2022,23&24లో విరాట్ కోసం ఆస్ట్రేలియన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారట. కాగా ప్రస్తుత ఐపీఎల్‌లో ఈ రన్ మెషీన్ చెలరేగి ఆడుతున్నారు. 6 మ్యాచ్‌ల్లో 319 పరుగులు చేశారు.

News April 13, 2024

ఈనెల 25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

TG: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు సొసైటీ డైరెక్టర్ శ్రీహరి తెలిపారు. మే 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఒక సెషన్, మ.2:30 నుంచి సా.5:30 వరకు మరో సెషన్ ఉంటుందని చెప్పారు. https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News April 13, 2024

రిజల్ట్స్ వచ్చేశాయ్..

image

దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన సీయూఈటీ-పీజీ(CUET PG 2024) ఫలితాలు విడుదలయ్యాయి. నిన్న తుది కీ విడుదల చేసిన NTA.. ఇవాళ ఫలితాలను ప్రకటించింది. గత నెల 11 నుంచి 28వ తేదీ వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో CUET-PG 2024 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

News April 13, 2024

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్

image

వాట్సాప్‌లో ‘నోట్స్’ పేరిట మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. బిజినెస్ టూల్‌గా పనిచేసే ఈ ఫీచర్‌తో యూజర్లు తమ కస్టమర్లకు సంబంధించిన వివరాలను చాట్ ఇన్ఫో సెక్షన్‌లో నోట్స్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రైవేటుగా ఉంటుంది. ఇతరులకు కనిపించదు. ఈ ఫీచర్ మొదట్లో సాధారణ యూజర్లకు అందుబాటులో ఉండదని, బిజినెస్ అకౌంట్స్‌కి మాత్రమే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.

News April 13, 2024

జైపూర్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం లభించింది. జైపూర్‌లోని మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నెల 18న వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కింగ్ కోహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోనూ కోహ్లీ మైనపు విగ్రహం ఉంది.