India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో జీతాలు అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరిలో డీఎంఈ విభాగంలో మొత్తం 5,600 మంది విధుల్లో చేరారని పేర్కొంది. వారికి ఎంప్లాయ్ ఐడీ, పీఆర్ఏఎన్ నంబర్ కేటాయించే ప్రక్రియ జరుగుతోందని, త్వరలోనే ఆ ప్రక్రియను పూర్తిచేసి వేతనాలు ఇస్తామని వెల్లడించింది.
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఇవాళ సాయంత్రం చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయగా.. పెద్దఎత్తున జనసమీకరణ చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
AP: సినీనటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో చేపట్టనున్న ఈ ప్రచారం కోసం ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో స్పెషల్ బస్సును రూపొందించారు. NDA అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాయలసీమలో ఆయన పర్యటించనున్నారు. ఈనెల 19న హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత 25 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు.
IPL-2024లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 26 మ్యాచుల్లో తలపడగా RR 15 విజయాలు సాధించింది. PBKS 11 మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 8 పాయింట్లతో టాప్‌లో ఉండగా, పంజాబ్ 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. నేడు గెలుపెవరిది? కామెంట్ చేయండి.
హృతిక్ రోషన్, NTR ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘WAR-2’ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం NTR ఇప్పటికే ముంబై వెళ్లారు. అలాగే ఇందులో నటిస్తున్న హీరోయిన్ కియారా అద్వానీ మే 1 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారట. యాక్షన్ సీన్స్ కోసం ఆమె ప్రత్యేక కసరత్తులు కూడా చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.
TG: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈనెల 20న ఉ.10:30 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అభ్యర్థుల లిస్టును <
లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను BJP రేపు విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘సంకల్ప్ పాత్ర’ పేరిట ‘మోదీ గ్యారంటీ: అభివృద్ధి చెందిన భారత్ 2047’ అనే థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించారట. ఇందులో దేశాభివృద్ధి, పేదలు, యువత, రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం. మేనిఫెస్టోకు ప్రజల నుంచి సజెషన్స్ స్వీకరించగా, 1.5M సూచనలు వచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
జలియన్ వాలాబాగ్ కాల్పుల ఘటన భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది పంజాబ్‌లోని అమృత్‌సర్ ఉన్న ఒక తోట. 1919, ఏప్రిల్ 13న జనరల్ డయ్యర్ సారథ్యంలో బ్రిటీష్ సైనికులు ఈ తోటలో సమావేశమైన ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ కాల్పుల్లో 379 మంది మరణించారు. కానీ 1000 మంది చనిపోయారనే వాదనలున్నాయి.
CUET-UGకి ఈ ఏడాది 13.47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తులు తగ్గాయి. గత ఏడాది 8.03 లక్షల మంది అబ్బాయిలు, 6.96 లక్షల మంది అమ్మాయిలు అప్లై చేశారు. ఈసారి 7.17 లక్షల మంది అబ్బాయిలు, 6.30 లక్షల మంది అమ్మాయిలు అప్లికేషన్స్ సమర్పించారు. ఈ ఏడాది అత్యధికంగా ఇంగ్లిష్ సబ్జెక్టుకు 10లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు మే 15 నుంచి 31 వరకు జరగనున్నాయి.
AP: ఈనెల 17న కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారన్న వార్తను జనసేన పార్టీ ఖండించింది. ‘కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌లో బీజేపీ తరఫున ఈ నెల 17న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు అవాస్తవం. 17వ తేదీన TDP చీఫ్ చంద్రబాబుతో కలిసి ఆయన కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ పర్యటన ఇప్పటికే ఖరారయ్యింది’ అని ట్వీట్ చేసింది.
Sorry, no posts matched your criteria.